చిత్తభ్రంశమే కానీ ప్రత్యక్షీకరణ....!

 








చిత్తభ్రంశమే కానీ ప్రత్యక్షీకరణ....!

ఇది నిజమా లేక నా భ్రమనా...!
పిలిస్తే పలికే పలికే దైవం
తలిస్తే ప్రత్యక్షమయ్యే రూపం
అడగగానే వరాలిచ్చు ఇలవేల్పు

అంతం కోరి, పంతం పట్టి
కరుణించకుంది, కటాక్షించకుంది
నా ఊసు ధ్యాస మరిచి కొండేక్కింది
ఆ గుండె రాయిని కరిగించే లావా కరువైంది

అన్నార్తినై శరణార్తినై వేడుకున్నా
ఫలం లేకుంది ఫలితం అందకుంది
కన్నీటి నైవేద్యాలు ఉపవాస నిష్టలు
జాగారాలు భజనా స్తుతులు
ఏది తన మనసు గెలవలేదు, ఆ గుండె కరగలేదు

అర్జునుడు రగిలించిన అగ్నికి
వాయువు తోడై అరణ్యాన్ని కాల్చినట్లు
గొంతెండిన పృధ్వీ ఆకాశానికేసి చూసినట్లు
తన మౌనానికి క్రోధం తోడై నన్ను నిలువెల్లా దహిస్తుంది

కాటిలో అనాధ ప్రేతంలా అలమటిస్తూ
గతించబోయే నా చూపు నీ కొరకు వెతికింది
నీ ప్రేమామృత ఫల హాస్తాలకై నలు దిశలా చూస్తుంది...!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...