ఆమెతో నా తీయని తీరని బంధం...!

 








ఆమెతో నా తీయని తీరని బంధం...!

ఓ సుకుమారీ, నా సుమరాణి
సుందరి నివని, అందం నిదని
పసి పసి మొలకల ప్రకృతి నీవని
పురులు విప్పుకు, కురులు విత్తుకు
నాట్యసించు ఆ దేవత నీవని......

ఇల కలగా నీవొక కథలా
భాధలు మరిపే ఔషదమా
భాగ్యం కాదా నా జనుమా
గుండెల్లో భాధ ఏదో గొంతు దాటనంటుంది
దోరయిన నీ పరువం దోసి తీరమంటుంది

రంగులోన రూపులోన రంజుగున్న రమణివని
చల్లంగా క్రిడించు కిలాడివి నివేనని
కావాలని ఆశ ఏదో తీరాలని కోర్కె నాలో
తియంగా నిను గని నీవందుకు నెయ్యమని
నిను వెతుకుతు నడిచింది నిను చేరగా కదిలింది

నీతో ఈ బంధం ఇంపుగానే తోచింది
నీ ఒడిలోన నిద్రించగ ఇష్టమని పలికింది
రావాలమ్మ రావాలి నీ ఊపిరి నాది కావాలి
నీ ప్రాణం నేనే కావాలి నీ ధ్యానం నేనై పోవాలి
నీ సరసం విరసం ప్రేమామృత రసం నాకే చెందాలి..!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...