ఆడది కోరేది ఏమిటి? (ప్రధమ భాగము)

 








ఆడది కోరేది ఏమిటి?


ప్రపంచాన్ని పాలించే మహారాణి కైనా పక్కమీద మొగాడు కావాల్సిందే! ప్రేమించడం, ప్రేమించబడడం కన్నా మించిన సంతోషం స్త్రీకి మరొకటి లేదు పురుష సాంగత్యం కోసం నిరంతరం స్త్రీ తపిస్తుంది పదవి, రాజ్యం, అధికారం అన్నీ ఉన్నా "నేను నిన్ను ప్రేమిస్తున్నా" అనే మగాడు ఆడదానికి కావాలి. పురుషునిలా స్త్రీ తేలికగా మరిచిపోవడం మనిషిని మార్చడం చేయలేదు ఉత్సాహము ధైర్యము, కేంద్రీకరణ, లౌక్యము ఉంటే నిలబెట్టుకోవచ్చు అది స్త్రీకి కావాల్సినంత ఉంది.


ప్రతి స్త్రీ పురుషుని ఆకర్షించడంలో ఆరితేరిందే, ప్రేమ అన్నది ఒక రకమైన మానసిక స్థితి భరించడం, భర్త మాట అనుసరించడం ఆడ వాళ్లకు బాగా తెలుసు ఎంత అందవికారంగా ఉన్నా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్న మగాడు దొరికినప్పుడు ఆ స్త్రీలో తెలివితేటలు పెరుగుతాయి. ముసలయినా ముతకయినా ఆడ దానిలో ఒకరిని మెప్పించాలని ఆకర్షించాలని  తాపత్రయం ఉంటుంది మెచ్చుకున్న వాడే మగాడు మొనగాడు.


స్త్రీ మొట్టమొదట చూచిన మగవాడు తండ్రి అందుచేత స్త్రీ దృష్టిలో తండ్రి స్వరూపం ముద్ర వేసుకుంటుంది ఆమె జీవితంలో పురుషులు ప్రవేశించినప్పుడు తండ్రి పోలికలను వాళ్ళ తో పోల్చుకుంటుంది తండ్రి పోలికలను దగ్గరగా ఉన్నవాణ్ణి ప్రేమిస్తుంది, గాలి నీరు ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారం వచ్చినట్టు స్త్రీలు పరిస్థితులలో సర్దుకుపోతారు ప్రేమ మెప్పుదల డాంబికం స్త్రీలను ఆకర్షించే గుణాలు కల్లబొల్లి మాటలు సానుభూతి చెప్పి స్త్రీలను మభ్య పెట్టవచ్చు.


కొందరు స్త్రీలు పూర్తిగా భర్తను వశం చేసుకుంటారు తను తప్ప వేరే ఆలోచనలు లేకుండా చేస్తారు భర్త నుంచి అందరినీ విడదీస్తారు ఆ తరువాత తనకు అనుగుణంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు ఇక చిత్రం ఏమిటంటే ప్రతి ఆడది ఇలాంటి పురుషుడు దొరికితే బాగుండును అని అనుకుంటారు, పురుషుడు ఏమాత్రం అవకాశం ఉన్నా మరో స్త్రీ ఆకర్షణకు జారిపోయే ప్రమాదము పోటీ ఉన్నది.


పురుషునికి అనుగుణంగా నటించడం అనుసరించడం స్త్రీ కి బాగా అలవాటు ఎంతగా దెబ్బలాడుతుందో అంత తేలికగా లొంగిపోతుంది లైంగిక అసంతృప్తితో వున్న స్త్రీ పర పురుషుని ఆశించి ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. రోజు భర్తచేత చీవాట్లు తినే స్త్రీ సానుభూతి చూపే మగాడికి తేలికగా లొంగి పోతుంది ప్రతి  తప్పు తన నెత్తిన వేసుకునే భరిస్తారు కొందరు ఆడవాళ్ళు తన లోపం కనపడకుండా అన్నీ సవ్యంగా చేస్తున్నట్టు అనిపించుకోవాలని తాపత్రయ పడే ఆడవాళ్ళు చాలా మంది వున్నారు, మొగుడేమి చేసినా సర్దుకుపోవడం ఏడవడంతో సర్ధుకుపోతుంది దెబ్బలాడదు ఇలాంటి స్త్రీలు ఆరోగ్యవంతులుగా ఉండరు.


ఇంకా ఉంది............


నోట్ : ఆడవాళ్ళందరికి నా మాటలు ఆపాదించడం నా అభిమతం  కాదు, నా వ్యక్తిగత జీవితములో నాకు తారసపడ్డ కొన్ని పాత్రల రూపమే నా ఈ రచన మీకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా నన్ను క్షేమించమని వెడుతున్నాను🙏


తాజ్ 

పల్లెటూరి పిల్లోడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...