స్త్రీ పురుషులలో లైంగిక వాంఛ..! (చతుర్థ భాగము)

 








స్త్రీ పురుషులలో లైంగిక వాంఛ..!

లైంగిక వాంఛ స్త్రీ పురుషులకు చిన్నతనం లోనే మొలకెత్తుతుంది శారీరకంగా మానసికంగా మాట్లాడడం ద్వారా వినడం ద్వారా ఈ విషయం అనుభవంలోకి వస్తుంది పసితనం నుంచి యవ్వనంలోకి కుర్రవాడు రావడం సర్వసాధారణమైన విషయంగానే ఉంటుంది ఉద్రిక్తత తెలియజేయడానికి ఒకవయవము ఉండనే ఉంది ఉపశమనానికి ఆనందించడానికి స్త్రీ ఉంటుంది, అక్కడ కూడా మగవాడికే స్వేచ్ఛ మగువ అతడి చేతిలో కీలుబొమ్మ కలవడంతో మగవారి ఉద్రిక్తత తగ్గి సంతృప్తి ఆనందము తప్పనిసరిగా పొందుతారు సంతృప్తి లేకపోయినా ఉద్రిక్తత మాత్రం తగ్గుతుంది.

స్త్రీకి అలా కాదు ఈ ఆనందం అనుభవించడానికి తగిన స్థితికి రాకపోతే అసంతృప్తి చికాకు మిగులుతుంది, పూర్వకాలం నుంచి నేటి కాలం వరకు కన్యత్వం గల కన్యను మాత్రమే వివాహానికి పనికి వచ్చే కన్యగా నిర్ణయించారు రతి ఆనందం పొందడానికి అనుభవము, చొరవ, అర్థము చేసుకోగల సూక్ష్మ జ్ఞానము ఉండాలి సామాన్య రతిలో పురుషునిదే పైచేయి, స్త్రీ ఉద్రిక్తత చెందినదా లేదా అన్న విషయము ఎవరూ ఆలోచించరు సంభోగానికి స్త్రీ అనుమతి అవసరం లేదు, తను ఇష్టపడి వస్తుందా లేక తప్పక తప్పుతుందా అని ఒప్పుకుంటుందా అని చాలామంది మగవారు ఆలోచించరు పట్టించుకోరు.

సంఘంలో లో సాంప్రదాయం ప్రకారం స్త్రీకి గౌరవం కన్యత్వం నిలుపుకోవడం ద్వారానే కలుగుతుంది కన్నె పిల్ల పెళ్లికి అర్హురాలు అనుభవజ్ఞులైన స్త్రీని సంఘంలో వేశ్య ల తర్వాత వేశ్యగా ఉపయోగించుకునేవారు పతితురాలు అయిన స్త్రీని సంఘంలో మదవాది కండూతి తీర్చుటకు పూర్వులు ఉపయోగించేవారు, దీన్ని కన్యత్వం ఋజువునకే కన్నెపొర భగవంతుడు సృష్టించాడని అందరి నమ్మకం, దీనిని బట్టి స్త్రీకి కామ స్వేచ్ఛ లేదని పురుషునికి కలదని మనం తెలుసుకోవచ్చును, కన్యత్వం ప్రేమతో అర్పించిన స్త్రీని పురుషుడు శాశ్వతంగా రక్షణ భారం వహించి కాపాడతాడు అది వివాహము కావచ్చు ప్రేమ సంబంధం కావచ్చు.

కన్యత్వం చెడిన స్త్రీతో పొందుకు సంఘములో సముచిత స్థానం లేదు ఇలాంటి ఆడవారిని సంఘములో అధమ స్త్రీగా పరిగణించేవారు నేను ఆడదాన్ని పొందాను అని పురుషుడు సగర్వంగా చెప్పలేడు, అది అతనికి విజయం కాదు ఆమె అతను ఇచ్చిన రక్షణ, డబ్బు లేక మరొక ఆశ ఆడదానిని అతని వద్ద కొంతకాలం ఉంచి ఉండవచ్చు, దానికి ప్రేమ అని వివాహము అని పవిత్రముగా భావించే అవకాశం లేదు ఆ ఆడదానికి కూడా విజయ సాధన అన్నది ఉండదు, లేదు.

వివాహానికి ఇచ్చిన గౌరవం పవిత్రత సంఘములో క్రమక్రమంగా తగ్గి ఆర్థిక కారణాల వల్ల కుటుంబ కారణాల వల్ల వ్యక్తిగత కారణాలతో వివాహానికి అర్హతలేని ఆడవారికి వివాహము జరిపిస్తున్నారు.

ఏదిఏమైనా సంభోగ సమయంలో ఇద్దరికి ఆనందం ముఖ్యము మగవాని ఆదిక్యత దుడుకుతనం వల్ల అతడు వీరుడని స్త్రీ కీలు బొమ్మగా ఉండాలని పద్ధతులు ఏర్పాటు చేశారు, మగవాడు ఆడదాన్ని ఎంత అవహేళన చేసినా సంభోగం సమయములో ఆడది లొంగి ఉండవలసిందే.

యవ్వనము తొలిదశలో ఉన్న అమ్మాయికి ఏమి కావాలో తెలియదు స్పర్శ, వాసన, రుచి, చూపు వీటన్నిటిలో ఆనందం పొందాలని కోరుకుంటుంది ముతక గరుకు బట్టలను ఇష్టపడదు, ఘాటుగా వాసనలు పడవు వెచ్చని వాతావరణం కోరుకుంటుంది.

కొంతమంది ఆడవారు తమలాంటి తత్వము గల మగవారిని కోరుకుని తమ ఇష్టం వచ్చినట్లు ముద్దాడి మురిసిపోతారు మగవాని మొహము రూపలావణ్యములు ఆడవారు చూడరు, బలము, సాహసము, దుడుకు తనము, మగసిరిగల మగవాడిని కోరుతారు.

మోటు సరసము, ఒత్తిడి అంటే ఆడవారికి అసహ్యమయినా సరే కౌగిలిలో నలిపి పిండి చేసే మగాడిని కోరుకుంటారు మరో విచిత్రము ఏమిటంటే ఆడవారు చుంబనాలు కౌగిలింతలు పురుషుని దగ్గర్నుంచి కోరతారు, స్త్రీలు తాము పురుషుని రెచ్చగొట్టడానికి కౌగిలింతలు వాడతారు తప్ప వారికి ఆనందం ఉండదు, పురుషుడు మీదికి రావడం స్త్రీలు కోరుకుంటారు కానీ మనసులో నేను అబలని అన్న చులకన భావం ఉంటుంది ఆడది రెచ్చగొట్టబడాలి అంటే తత్సంబంధమైన గ్రంధులలో ద్రవములు వూరాలి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు త్వరత్వరగా సాగాలి వాంఛ ఆనందం కోసం మగాడిలా ఆకలిగొన్న పులిలా నరాలన్నిటిని బిగబట్టి ఉపక్రమించాలి స్త్రీ వాంఛ నిద్రించినట్టు ఎక్కడో దాగుతుంది పురుషుని వాంఛకు ఉద్రిక్తతకు తేడా ఉండదు, ఆడవారికి అలా కాదు త్వరత్వరగా మానసిక మార్పులు రావు ఆలోచన అంతటిని కేంద్రీకరించితే తప్ప అమ్మాయికి ఉబలాటం తీరదు అంతేకాక మనసులో లక్ష ఆలోచనలతో ఉంటుంది పాపభీతి, సిగ్గు కొంతమంది అమ్మాయిలకు ఆటంకము మరికొందరికి పవిత్రమైన కన్యత్వం చెడిపోతుందని భయం.

కార్యం గదిలో భర్త కలుసుకున్న కొద్ది క్షణాలలో సంవత్సరాల తరబడి దాచుకున్న పవిత్ర కన్యత్వం బలి చేయడం అవమానంగా భావిస్తోంది అయినా తప్పదు పెళ్లి చూపుల దగ్గర నుండి పెళ్లి జరుగుతున్నంతసేపు కార్యం గదిలోకి వచ్చేదాకా కొత్తగా పరిచయమైన భర్త సరస శృంగార సంభాషణతో స్పర్శతో వధువును ఆకర్షిస్తాడు, మృదువుగా మాట్లాడుతూ చూపులతో రెచ్చగొడుతూ వధువు సిగ్గును భయాన్ని పోగొడతాడు, కన్నెపిల్ల మనసు ఆకర్షించడం కోసం వరుడు తనే ముందు కార్యానికి ఉపక్రమిస్తాడు వధువు వరుణికి శరీరం అర్పించి అతను చెప్పినట్టల్లా బొమ్మలా ప్రవర్తిస్తుంది, సామాన్యంగా ఇలాంటి వ్యవహారాల్లో మగవాళ్ళు అనుభవజ్ఞులు వయసులో పెద్దవారు అయి ఉంటారు వధువును ఎలా ఆడించాలో వారికి తెలిసే ఉంటుంది జరగవలసిన కార్యక్రమం నిర్వహించవలసింది అతనే, మగవాడు త్వరగా నిర్ణయాలు తీసుకొని సమయస్ఫూర్తిగా నటించగలరు.

ఆడ మగ వాళ్ళిద్దరూ పరస్పర నగ్నంగా కనిపించడం సిగ్గుగానే ఉంటుంది, ఒకసారి అనుభవంలోకి రాగానే ముక్కు, చేవి, ముఖము, చేతులలాగే ఒక ముఖ్యమైన శరీర భాగాలు కలిసాయి తప్ప అసహ్యించుకోవలసిన పని లేదు, ఆడవారు వెనుకనుంచి బట్టలు కట్టుకునేటప్పుడు నగ్నంగా ఇతరులు చూడటము ఒప్పుకోరు అలాంటిది శరీరం యావత్తు అప్పుడే పరిచయమైన మగవాడు చూడడానికి అంగీకరించింది అంటే ప్రేమతో ముడిపడిన పెళ్లి బంధానికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది, సిగ్గు దొంతరలు అమ్మాయిని ఎలా విడిపోయాయో తెలిసిపోయింది మగవాడు తన రూపాన్ని చూసి ఆనందించి మెచ్చుకోవాలి అది నిర్ణయము చేయడానికి అతడే సమర్ధుడు అసహ్యించుకుంటాడా మెచ్చుకుంటాడా ఇన్నాళ్ళు తనలో తానే ముచ్చటపడిన తన శరీరము అతని కంటికి ఎలా కనబడింది పురుషుడు ఆమె శరీరము చేత ఆకర్షించబడి ఆమెను తన అనుభవంలో ఉంచుకోవడానికి తాపత్రయం పడతాడు, అతని ప్రవర్తన బట్టి అభిప్రాయము అర్థం చేసుకోగలదు.

పురుషుడు తొందరపాటుతనంతో ఉంటే అమ్మాయి బొమ్మలాగా ప్రవర్తిస్తుంది కొంచెం ఓపికతో అమ్మాయి అభిప్రాయం తెలుసుకొని నచ్చే విధంగా అనుభవించవచ్చు, అలా జరగని పక్షంలో అమ్మాయికి రతి పట్ల విముఖత ఏర్పడే అవకాశం ఉంది కొంతమంది అమ్మాయిలు పిరికివారు, సరసం తెలియని వారు అంతగా ఉద్రేకము లేనివారు అయినా మగవారితో సంతృప్తి చెందుతారు.

పురుషునిపై కోపం వచ్చిన అమ్మాయి పడక గదిలో అలిగి ఇష్టము లేదు అని ఎంతగానో ఏడుస్తుంది ఆడవాళ్ళకి అనుమానాలే ఎక్కువ, అలక ఎక్కువ, ఇవన్నీ లేకుండా ఆనందించనా సంతృప్తికరమైన స్థితికి రావడానికి అమ్మాయికి చాలాకాలం పడుతుంది.

పురుషుడు తనకు తోచిన విధంగా స్త్రీని సంతృప్తి పరుద్దాం అనుకోవడం భ్రమ, స్త్రీ సహకారం లేనిదే ఆమెకు కోరిన తృప్తి ఇవ్వలేడు, ఎంత కాలము ఏ పద్ధతి అని లెక్కలేసి చెప్పలేము స్త్రీని సంతృప్తి పరచుటకు అనుభవము, ఓపిక, పద్ధతి, పురుషుని చొరవ, అవసరం స్త్రీ వాంఛ, తృప్తి అతి విచిత్రమైనది పురుషుడు ముట్టుకోగానే ఒక రకమైన పారవశ్యంలో ఉంటుంది ప్రశాంతముగా ఏకాంతముగా వేరే ఏ విషయము పై దృష్టి ప్రసరించకుండా ఆ పురుషునిపై సంభోగంపై ఆసక్తి చూపుతూ ఆలోచిస్తూ ఉంటుంది పరిసరాలు మర్చిపోవాలి అనుకుంటుంది, అందుకే సంభోగ సమయంలో ఆడవారి కనురెప్పలు సగం వాలి ఉంటాయి చీకటిలో కూడా కళ్ళు సగం మూసుకునే ఉంటుంది, అతని శరీరంలో ఇమిడిపోయి ఏకాగ్రత సాధించాలని అనుకుంటుంది ఇద్దరు ఆనందంగా అనుభవించాలని అనుకుంటుంది తను లేకపోతే సంభోగంలో ప్రాధాన్యత లేదు అనుకుంటుంది, తను కూడా పురుషునిలా ఉండడానికి ప్రయత్నిస్తుంది దానికి పురుషుడు అసహ్యించుకోకుండా మెచ్చుకోవాలి, అలా మెచ్చుకోకుండా, పట్టించుకోకుండా ఉంటే తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని అనుకుంటుంది, రతి తర్వాత పురుషుడు లేచి పోతూ ఉంటే ఆడవారికి చాలా బాధగా ఉంటుంది శరీరమంతా ఉద్రిక్త స్థాయి తగ్గేదాకా పురుషుడు లేవకూడదు అనుకుంటుంది, స్త్రీ పురుషులు పూర్తి అంగీకారంతో సంభోగం సాగించినప్పుడు స్త్రీ తనే పురుషుదిగా పురుషుడు తనే స్త్రీగా అనుభవించి ఆనందిస్తారు.

ఆడదానికి నటన శక్తి ఉన్నదని అనుకుంటారు కానీ అది నిజం కాదు, మనసులో ఉన్న ద్వంద్వ అభిప్రాయాలు త్వరగా ఆడదానిని ఒక నిర్ణయానికి రానివ్వవు, అది చూచి పురుషులు సిగ్గు, భయపడుతున్నదని వారే ముందుకు సాగుతారు, ఆడది ఎంత సుఖ పడుతున్నా అసంతృప్తి నిరాశ అనుభవిస్తూనే ఉంటుంది, మర్మావయవము చూసి అసూయ పడదు గాని అతడి దుడుకుతనానికి లొంగిపోయాను అన్న చులకన భావంతో బాధపడుతుంది, తగిన అవకాశం దొరికి ఆనందంగా అనుభవించే అదృష్టం ఆడ వారందరికీ కలగదు.

ఇంకా ఉంది....

నా తదుపరి రచనలో ఆడవారి ప్రేమ, వ్యక్తిత్వం, త్యాగం, గొప్ప సేవానిరతిని గురించి ప్రస్తావిస్తాను....🙏

తాజ్
పల్లెటూరి పిల్లోడు

గమనిక :ఈ రచన పూర్తిగా నా వ్యక్తిగత జీవితములో ఎదురుపడిన కొన్ని సంఘటనలు కొందరు పెద్దల మాటల సారమే తప్ప ఎవరినీ కించపరచడం నా ఉద్దేశ్యం కాదు ఎవరినైనా నా ఈ రచన ఇబ్బంది కలిగిస్తే క్షేమించ ప్రార్థన..🙏

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...