స్త్రీ ప్రేమ, వైభవము (పంచమ భాగము)








స్త్రీ ప్రేమ, వైభవము....!


ప్రేమ అనే మాటకు నిర్వచనము స్త్రీ పురుషులిద్దరికీ ఒకే రకముగా ఉండదు, ఆడదానికి ప్రేమంటే నిర్మొహమాటంగా తన మాన, ధన, సర్వస్వాలు మగవానికి అర్పించడమే, కానీ  మగవానికి అలా కాదు తన పట్ల ఆడదానికి అభిమానం ప్రేమ ఉంది కదా అని తన సర్వస్వం ఆడవారికి అర్పించాలి అనుకోడు అలా అర్పించే వాడు మగవాడే కాదు, తాను ప్రేమించిన ఆడది ఒక్కతే అతని జీవిత పరమార్ధం కాదు, ఆడదాని కోసం సర్వస్వం త్యజించిన మగవాడు లేడు, కాళ్లావేళ్లా బడి ఆడదానిని ఒప్పించి తన అదుపులోకి తీసుకు రావడమే మగాని కోరిక, కానీ ఆడవారు తను ప్రేమించిన మనిషి  కోసం తమ సర్వస్వం త్యాగం చేస్తారు, అతని ప్రేమలో తమని తాము మరచిపోతారు అది సహజ ప్రకృతి, మగవాని రక్షణలోనే ఆడది పరిపూర్ణంగా జీవిస్తుంది, ఆ బంధం చీలిపోతే చిరిగిన పాత పీలిక అవుతుంది.


మగవాడు ఆశాజీవి సమర్ధుడు పుట్టినప్పటినుంచి చచ్చేవరకు ఆధిక్యత ఉంటుంది ఆడది తనను తాను అర్పించు కోవడం తప్ప వేరే మార్గము లేదు తన వ్యక్తిత్వాన్ని చంపుకుంటుంది, వయసు వచ్చిన అమ్మాయి తను పురుషుని వెనుక (పురుషునితో) ఉండాలని వాంచిస్తుంది, సహజంగానే మగవారిలో గొప్ప వారిని పొందాలని, తన ప్రియుడు పురుషోత్తముడిగా ఉండాలని అనుకుంటుంది.


వారిరువురి మధ్య పెనవేసుకున్న ప్రేమ, లైంగిక సంబంధంలో ఉన్న ఆనందం వలన ఇద్దరి మధ్య మైత్రి, ప్రేమ పెరుగుతుంది ఏ అమ్మాయి తనను ప్రేమించిన మగాన్ని కాదనలేదు, అమ్మాయికి తన సుఖం కంటే బాధ్యతలు హెచ్చు, భర్త, పిల్లలు, ఇల్లు, కుటుంబము,సాంప్రదాయము, ప్రతిష్ట ఇవన్నీ ముఖ్యమైనవే, ఆడదానికి సామాన్యంగా ఇల్లు సంసారమే ముందున్న గొప్ప భాగ్యము అనుకుంటూ ఉంటుంది.


ఆడది తన బ్రతుకు బాధ్యత తన చేతుల్లో ఉంచుకోవడం ప్రమాదమే, మగవానికి బాల్యంలో తల్లి హెచ్చరికలు కూడా గౌరవప్రదమైనవే కానీ అనుసరణీయం కాదు, ఆడది మగవాడికి నీడగా ఉండవలసిందే తప్ప స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నిస్తే కొద్దికాలంలో ఓడిపోయి, అలిసిపోయి, నాశనమైపోతుంది అన్నది పురుష ప్రముఖుల వాదన,ఆడది తన తండ్రి లాంటి ప్రియుని కోరుకుంటుందట, దానికి కారణం పుట్టగానే పరిచయం ఉన్న మొదటి మగవాడు తండ్రి అతడి రక్షణలో పెరుగుతుంది అలాంటి రక్షణ పెరిగి పెద్దయిన తర్వాత కూడా కోరుకుంటుంది, "పిచ్చి పిల్ల ఎంత అమాయకురాలివి" అని ఏ మగవాడైన అంటే అమ్మాయిలు ఉక్కిరి బిక్కిరైపోతారు మగవాని కౌగిలిలోలో చిన్నపిల్లలై గిల గిల లాడుతారు, ఏ మగవాడు వస్తాడు నా మనసు ఏ మగధీరుడు గెలుస్తాడు అని ఆడపిల్ల ఊహ తెలిసినప్పటి నుంచి అనుకుంటుంది, భగవంతుడిని రక్షించమని అడగడానికి అవకాశం ఉండదు గనుక ఎదురుగా ఉన్న మగవాడినే భగవంతునిగా భావిస్తుంది ప్రతి అమ్మాయి తన మనసులో ఇలా రాసుకుంటుంది "నీ నీడలో, నీ అడుగుజాడలో, ధూళి నై నీ తోడుగా నడుస్తాను" అని.


ప్రేమ పండిన ఆడది తన గురించి గర్వపడుతుంది, నేను అతనిలో ఏకమైనాను, నన్ను ప్రేమిస్తూ నా జవసత్వాలు ఉడికిన తరువాత కూడా నన్ను ఆదరించే దేవుడు ఇతగాడని  కొలుస్తుంది.


స్త్రీలో ప్రేమ విపరీతమైన విప్లవాన్ని తెస్తుంది కట్టు, బట్ట, అలంకారము అన్నింటిలో ఒకటే లక్ష్యం, ప్రేమించినవాణ్ణి సంతోషపెట్టాలి, అమ్మాయిని కాస్త పొగిడితే నిస్సంకోచంగా సేవ చేస్తుంది, ఆడది తనంతట తాను పురుషుని వద్దకు వెళ్లి శరీరం అర్పించిదంటే మనసులో ఎంతో ప్రేమ విశ్వాసం ఉండాలి లేదా ఆ మగవాడు ఎన్నో మాయమాటలు నమ్మకంతో చెప్పి ఉండాలి, ఆడది మగవాడికి తన శీలము ఆనందాన్నిచ్చే అమృతకలశం గా మార్చుతుంది, ప్రియుని చూపుతో చిత్తయిపోతుంది, రెక్కలు కట్టుకొని ఎగిరిపోతున్నట్లు ఉంటుంది, నన్ను కొట్టు, తిట్టు, గిచ్చు, కరువు ఏమైనా చేయి కానీ నన్ను మాత్రము వదలకు నన్ను నీలో ఐక్యము చేసుకో నా జీవితాన్ని నడుపు నీకు దాసిగా ఉంటాను అంటుంది, మగవాడు ఎంత ఎక్కువగా బాధపడితే అంత సంతోషిస్తుంది కానీ తను ఆ భాద తీర్చలేకపోతే బాధపడుతుంది.


తెలివితేటలు గల మగవాడు ప్రియురాలిని కోరికలు కోరుతూ ఉంటాడు, నువ్విలా ఉంటే నాకు నచ్చుతావు అని ప్రియుడన్న మరుక్షణం తనకెంతో ప్రియమైనదయినా త్యజించి ప్రియుడు కోరిన విధముగా ఉంటుంది, అతడికి ఇష్టం లేనిది ఏదైనా అది తనకు ఎంత ప్రాణప్రదమైనా వదిలేస్తుంది తప్ప కోపగించుకోదు ప్రతిక్షణం తనని తాను పరామర్శించుకుంటుంది, తను కోరినంతగా పురుషుడు ప్రేమించకపోతే తనను తాను శిక్షించు కుంటుంది ఆడది, తన ప్రియుడు పురుషులలో గొప్పవాడు కావాలనుకుంటుంది అతడు ఇతరులను విమర్శిస్తే సంతోషిస్తుంది తగాదాలకు, పోటీలకు ప్రేరేపిస్తుంది తనకు నచ్చిన రంగాలలో అతడి ద్వారా పోరాటం సాగిస్తుంది, భర్త కొట్టినందువల్ల అతడి ఘనత పెరుగుతుంది అంటే ఎన్ని దెబ్బలు తినడానికైనా భార్య సిద్ధమే, ఈ రకంగా ఆడది దాసి, రాణి, పువ్వు, నాట్యకత్తె, తల్లి, స్నేహితురాలు, సోదరి, బిడ్డ ఇలా రకరకాలుగా పురుషుని సేవిస్తుంది, ప్రేమ తప్పులను మరపింపజేస్తుంది, ప్రేమ శాశ్వతం అంటే విడరాని జంటగా ఉండటమే, ప్రేమ అంటే ప్రియుడి దృక్పథాన్ని తాను అలవర్చుకోవడంమే, అతడు చదివే పుస్తకాలు, మాట్లాడే మాటలు, అతని చేష్టలు అనుకరిస్తుంది తను తక్కువ అని కించపడదు.


తనను నిరాకరించిన పురుషుడు రాక్షసుడు, దుర్మార్గుడు, దగ్గరకు చేర్చినవాడు దేవుడు, అతడు తప్పు చేసినా, లోకం నిందించినా అతడినే సమర్ధిస్తుంది "ఇన్నాళ్లకు నా జీవితం సార్థకం అయింది నీవు లేని జీవితం వ్యర్థంగా గడిపాను ఇహనుంచి నీ సుఖం కోసం నేను ఏమైనా చేస్తాను" అంటుంది


పురుషుడు కోరినదిచ్చి మెప్పించడం అమ్మాయిలకు సరదా ఎక్కడ అసంతృప్తి చెందుతాడో అని ప్రియుని కోరికలు క్షణాలలో బానిసగా దేవతగా తీరుస్తుంది, తన సహాయం స్వీకరించడమే పురుషుడి ప్రేమకు చిహ్నమని, తన పట్ల గౌరవమని ఆడది భావిస్తుంది, ప్రియురాలు దగ్గర లేనప్పుడు స్వతంత్ర వాయువును పిలుస్తాడు మగవాడు విచార పడడు, కానీ ఆడది ప్రియుడు దగ్గరగా లేనప్పుడు బాధగా ఉంటుంది, విరహం భరింపజాలదు, పని చేసుకుంటున్నప్పుడు కాసేపు దూరంగా ఉండమని ప్రియుడు తనని అంటేనే ఆడది సహించాజాలదు, నిద్రపోయేటప్పుడు కూడా తల్లి ఒడిలో పిల్లలలా ప్రియుని ఒడిలో నిద్రించాలని ఆడది తాపత్రయపడుతుంది, తను మేల్కొని ఉండగా మగవాడు నిద్రపోతే ఆడవాళ్ళకి మహా కోపం ఎంత స్వార్ధపరుడు అనుకుంటుంది, ఏమీ తోచక నిద్ర లేపుతుంది, కౌగిలించుకోమంటుంది, పక్కన పడుకుంటుంది, త్వరగా లేవండి టైం అయిపోయింది అంటు మగవాన్ని నిద్రపోనివ్వదు.


ఇద్దరు మరీ ఎక్కువగా ప్రేమించుకుంటే ఆత్మత్యాగం చేసుకున్నట్టే! అందుచేత అప్పుడప్పుడు స్త్రీ మగవానితో కలహించి అతన్ని కార్యోన్ముఖున్ని చేస్తుంది.


మరొక విషయం కూడా ఉంది పురుషుడు కలకాలం దేవుడు మేలు చేస్తే మరో జన్మలో కూడా తనవాడుగా ఉండాలని కోరుకుంటుంది, వ్యభిచారిని, కలహకంటి, గయ్యాళి భార్య కూడా భర్త మరొక పెళ్లి చేసుకుంటానంటే చాలా బాధపడుతుంది.


నువ్వు లేనిదే నేను జీవించలేను అని భర్త అంటే భార్య ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది భర్త మరొక ప్రియురాలిని తెచ్చుకుంటే మాత్రం భరించలేదు.


ఏ మగాడైనా అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి కావాలి అని అనుభవించే దాకా తాపత్రయపడతారు ఆ తరువాత ఆలోచన ఉండదు, కానీ కన్నెపిల్ల భర్త ప్రేమే శాశ్వతమని, దేవుడని అనుకుంటుంది, భార్యాభర్తలు చచ్చేదాకా కలిసి ఉన్నారంటే అతడి అవసరమే కాదు తన స్థానబలం కోసం ఆడది అలా ఉంటుంది, ప్రేమ కోసం, మెప్పు కోసం ఎల్లప్పుడూ బాధపడుతూ ఉంటుంది.


"నన్ను పూర్వంలా ప్రేమిస్తున్నారా! మీరీ మధ్య నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు నేనంటే మీకు ఇష్టం లేదా?" అని భర్తను పదే పదే అడుగుతుంది, ఈ ప్రశ్నలకు అన్నివేళలా సమాధానం చెప్పడం ఏ భర్త కు సాధ్యం కాదు, ఎలాంటి సమయంలో అడుగుతుందంటే ఎంతో ఉత్సాహంతో కౌగిలించుకున్నప్పుడు, ముద్దు పెట్టుకున్నప్పుడు, సంభోగం సాగిస్తున్నప్పుడు అడుగుతుంది, ఈ సమయాలలో మగవాడు తప్పనిసరిగా అబద్దం ఆడవలసి వస్తుంది నువ్వు లేనిదే నేను బతకగలనా అని అంటే ఆవిడకి ఎంతో సంతోషం, సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటే తన అభిప్రాయాలకు అనుగుణంగా ఊహించుకుంటుంది, ఏమి సమాధానం చెప్పకపోతే ప్రేమ లేదని ఎందుకు అనుకోవాలి కానీ స్త్రీ దృష్టిలో సమాధానం రాయని మగవాడు విశ్వాసఘాతకుడు, దేయ్యం మూర్ఖుడు.


నన్ను ప్రేమిస్తున్నారా అన్న ప్రశ్న కంటే ఆడదాని బాధ పెట్టే ప్రశ్న మరొకటి ఉంది "అతను ఎవరినైనా ప్రేమిస్తున్నాడా?" అని దానికి సమాధానము తానే చెప్పుకుంటుంది తను లేకపోతే ప్రియుడు బతకలేడు తను చేసిన త్యాగం ఎవరూ చేయలేరు కాకపోతే చెప్పుడు మాటలు విని చెడిపోయి ఉండవచ్చు అనుకుంటుంది.


తన ప్రేమకు ఎప్పుడైనా ఎవరైనా పోటీ తగలవచ్చు, మనిషి దూరంగా ఉండడం అంటే ప్రేమ తగ్గడమే ఏ చిన్న మార్పు కనిపించినా ప్రేమలో కొరత ఏర్పడినట్లే పరస్త్రీని కన్నెత్తి చూస్తే తన భవిష్యత్తు కూలిపోయినట్లు పొరపాటున చూసిన చికాకే అని ఆడదాని భయాలు.


అమ్మాయిని కంటితో చూసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు రావాలి తన కౌగిలిలో ఇమిడి తన శరీరము అర్పించాలి అనేది మగవాని దృక్పథం, దృష్టి చాలించినంతనే ఊహలతో భవిష్యత్తు అల్లేసుకోవడం ఆడదాని లక్షణం, అందుకనే లేనిపోని అనుమానాలు, ప్రతి అమ్మాయిని తనకు పోటీగా ఊహించుకుంటుంది, ఎలాగైనా ప్రియుని ప్రేమ వాత్సల్యం తనకే దక్కించుకోవాలని ఆరాటపడుతుంది, ఈ వింత ధోరణికి మగవాడు అసహ్యించుకొని దెబ్బలాడుతాడు, ఎంత దెబ్బలాడినా ఆడది అదే అనుమానంతో ఉంటుంది కానీ ఆమెలో మార్పు ఉండదు.


ప్రేమించడం అనేది బలహీనమని కాక అదొక శక్తివంతమైన ప్రభావము, ఆకర్షణ, అనుబంధం, లొంగుబాటు వల్ల కాక అతడికి అనుగుణంగా ప్రవర్తించడం వలననే సాధించవచ్చు అన్న సత్యం తెలుసుకుంటుంది అదే ఆమెకు మోక్షము.


ఆదర్శం పేరిట ఆడవాళ్లను పిరికివారిగా ఆలోచనా రహితులుగా సూటిగా చెప్పవలసివస్తే కొజ్జాలుగా తయారుచేస్తుంది ఈ సంఘం, పురుషునికి ఆధిక్యత ఆపాదించి స్త్రీని చులకన చేసి అనవసరమైన మానసిక సంక్షోభం స్త్రీలలో కలుగజేస్తుంది, స్త్రీని స్త్రీగా అర్ధంచేసుకుని జీవిస్తే ఈ వ్యభిచారము, పురుష ద్వేషము, అసహ్యతాబావము ప్రపంచంలోనే ఉండవు.


ప్రతి విషయముపై విముఖత, పిరికితనము, గర్వము, దీనికితోడు పురుషునితో పోటీపడి నెగ్గలేకపోవడంతో ఆడవారికి ధైర్యం సడలుతుంది, మహిళా సంఘాలు, క్లబ్బులుపెట్టి "మేము సాధించగలం" అని తీర్మానాలు చేస్తుంటారు, ఎన్ని చేసినా జీవితంలో ఎవరో ఒక మగాణ్ణి ఆధారంగా తీసుకోక తప్పడం లేదు..........


తాజ్

పల్లెటూరి పిల్లోడు


గమనిక : ఈ రచన నేను చదివిన పుస్తక జ్ఞానము, పెద్దల మాటలలోని విశేష విషయ పరిజ్ఞానం తప్ప అన్యులను భాదించాలని కాదు, ఈ రచన ఎవరి మనోభావాలు దెబ్బతినేలా ఉన్నా పెద్ద మనసుతో క్షేమిస్తారని నా మనవి...


ఇంకా ఉంది....

వ్యభిచారిణి.... అను నా తరువాత భావముతో మీ ముందుకు వస్తాను స్వస్తి...🙏



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...