వ్యభిచారిణి(వేశ్య) (షష్ఠి భాగము)








వ్యభిచారిణి(వేశ్య).....

పెళ్లికి, వ్యభిచారానికి వెలుగు నీడల సంబంధము ఉంది, మగవాడు తన భార్య పవిత్రంగా ఉండాలని కోరుకుంటాడు కానీ తను మాత్రం ఇష్టం వచ్చిన విధంగా వ్యభిచరిస్తాడు, రెండో పెళ్లివాడయిన కన్నెపిల్లనే భార్యగా కోరుకుంటాడు, సాంఘికంగా స్త్రీకి విలువనివ్వరు కొన్ని ప్రదేశాలలో సన్మానాలకు విందులకు భార్యలను తీసుకువెళ్ళరు, అలా తీసుకువెళడానికి ప్రత్యేకంగా కొంతమంది స్త్రీలను ఉంచుకుంటారు, వ్యభిచారిణిని కాసేపు అనుభవానికి డబ్బిచ్చి అనుభవించి వదిలేస్తారు, భార్యకు వ్యభిచారిణికి తేడా ఏమిటంటే భార్య శరీరానికి మూల్యం యావజ్జీవం అందుకే కన్నెపిల్లగా పవిత్రంగా ఉండాలని కోరుకుంటాడు, వ్యభిచారిణి శరీరానికి మూల్యం అనుభవించిన మగవాళ్ళందరూ కొద్ది కొద్దిగా భరిస్తారు, రెండిటిలోనూ ఆడదానికి ఇచ్చే విలువ కామసంబంధమైనదే, వివాహ బంధములో ఒక పురుషుడు బాధ్యత స్వీకరించి అనేక పురుషుల బారినుండి రక్షించి తాను అనుభవిస్తాడు, వ్యభిచారిణి అందరూ అనుభవించేలా ఉండాలి కాని ఎవరో ఒకరు భయపెట్టి స్వంతంగా వాడుకోవడానికి వీల్లేకుండా చేస్తారు, స్త్రీ వ్యభిచరించిననా ఎక్కువ మూల్యం ఒకే పురుషుడు చెల్లించవలసిన బాధ లేకుండా అనేకమంది పురుషులు పోటీ ఉంటారు, అంతేకాదు పురుషుడు ఉద్రేకానికి ఫలానా స్త్రీ శరీరం అన్న భావన లేదు ఎవరైనా తన వాంఛ, కండూతి తీర్చుకుంటాడు, తెలివిగల ఆడది వివిధ ఆకర్షణలతో ఆ మగవాన్ని వశం చేసుకుంటే తప్ప ఏ స్త్రీ అయినా అతనికి ఒక్కటే, భార్యకు సాంఘికమైన విలువ, మనిషిగా జీవించగలిగే అవకాశము ఉంది, వ్యభిచారిణికి ఎటువంటి గౌరవం లేదు, స్త్రీ వ్యభిచారిణిగా ఎందుకు మారుతున్నది నిర్ధారణ చేసి చెప్పడానికి ఆధారములు లేవు, వారసత్వములు లేవు,శారీరక లోపములు లేవు పైగా సంసార స్త్రీలకు ఏమాత్రము తీసిపోని ఆకర్షణలు, తెలివితేటలు, ఆరోగ్యము, వ్యభిచారిణుల కున్నవి.

ఆర్థిక కారణాల వలన, సులువుగా ఎక్కువ సంపాదించగల వృత్తి వ్యభిచారమని ఇందులో ఆడవారు దిగుతారు, బీదతనమే వ్యభిచారానికి కారణం అన్నది చాలామంది పెద్దలు ఒప్పుకోరు, బ్రతకడానికి వ్యభిచారమే చేయాలా దాసిపని చేసి బ్రతకరాదా అంటారు దగ్గరి బంధువులు, భర్త నిరాదరణకు గురి అయిన ఆడది వ్యభిచారము స్వీకరించును, ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో, ఆడపిల్లలను సులువుగా లోంగదీయవచ్చు మధ్యతరగతి కుటుంబాలలో వ్యభిచారము సర్వసామాన్యమైనది, చదువు లేని అమ్మాయి, ఉద్యోగం లేని అమ్మాయి, బలహీనము లేక జబ్బుగా ఉన్న అమ్మాయిలు సులువుగా వ్యభిచారమునకు పాల్పడుతారు, యుద్ధకాలంలో, విప్లవ కాలములలో వ్యభిచారము వృద్ధి చెందును.

ఒక విధంగా వ్యభిచారిణులకు మగవాడు అవసరం, ఆ మగావాన్ని నమ్మి వృత్తి సాగించును, కొంతమంది వ్యభిచారిణులు వచ్చిన మగవాని దగ్గర డబ్బు నిరాకరించుట కూడా జరుగును, పురుషుడు ఇష్టం వచ్చిన రీతిగా ఉపయోగించుకొనును, ఇంటి దగ్గర భార్యను తమకు కావలసిన విధంగా వెకిలి చేష్టలు చేయడానికి, వాడుకొనడానికి వీలుండదు, నిజానికి డబ్బులు ఇచ్చేది అనుభవించడంలో భార్య లాగా, పువ్వు లాగా నిన్ను చూడాలని కాదు, మా మనసులో ఉన్న విధంగా ప్రవర్తించడం కోసమే నీకు డబ్బులు ఇస్తున్నాము అంటాడు, ఎంత పెద్ద మనిషి అయినా వాళ్ళని చూడగానే పశువులా కఠినంగా ప్రవర్తిస్తాడు, నీతులు బోధించే పెద్దమనుషులు కూడా వారితో వ్యభిచారం చేయడానికి వెనుకాడరు, డబ్బు ఇచ్చిన వారికంటే ఇవ్వకుండా ఇంట్లో దూరినవాడు చేసే హంగామా అంతా ఇంతా కాదు.

వ్యభిచారం వృత్తిగా స్వీకరించిన ఐదు సంవత్సరాలలో సగం మందికి సెగ, గనేరియా మిగతా వారికి టీ.బీ, కేన్సర్ వ్యాధులు వచ్చును.

కొందరు ఆడవారు తెలివిగా ఒక విశ్వాసపాత్రుడైన మగవాని ఏరుకొని వాడితో గడిపేస్తారు, అందమునకు, వ్యభిచారమునకు అవినాభావసంబంధము ఉన్నది, కొన్ని దేశాలలో చాలా మంది పెద్ద మనుషులు కళా ఖండము పేరిట నగ్నంగా ఉన్న ఆడవారి బొమ్మలను సేకరిస్తారు వాటికి చాలా ఎక్కువ మూల్యం చెల్లించవలసి ఉంటుంది కూడా.

ఏదో విధంగా వ్యభిచార వృత్తి స్వీకరించిన ఆడది స్వతంత్రులుగా ఉండును, అంతమంది మగవారితో సంబంధం ఉన్న ఎవరికీ చెందదు, సంపాదించిన డబ్బు ఆర్థిక స్వతంత్రం ఇచ్చును, ఆడది వ్యభిచారము స్వీకరించినప్పుడు చుట్టూ చాలా మగవాతావరణం, సిగ్గు లేని తనం ఇవన్నీ ఆడవాళ్లకు గర్వకారణం, హత్యకు, పోట్లాటలకు అలవాలమై తమ ధైర్యమును నిరూపించుటకు కొందరు ఆడవారు సిద్ధపడతారు, ప్రముఖ రాజకీయ నాయకులను అధికారులను చేజిక్కించుకుని వీర విహారం చేయుదురు, మగవాడు డబ్బు ఇచ్చి అనుభవించగలడే కానీ తనదిగా చేసుకోలేడు, సహజమైన ప్రేమ, విశ్వాసం ఈ వృత్తిలో రాణించవు.

వచ్చిన మగవాడు మళ్లీమళ్లీ వచ్చుటకు వీలుగా వారిని ఆకర్షించుటకు అనేక మార్గాలు ఉపాయములు కనిపెట్టిరి, భార్యలపై అపనమ్మకం పుట్టించుట ముఖ్యమైన పథకము, నచ్చిన మాటలు చెప్పుట మరొక విధము, తన పట్ల అసహ్యం కలగకుండా చూసుకోనుట ముఖ్యము, ఈ విషయములలో తెలివిగా ప్రవర్తించిన ఆడది ఒకరిద్దరితో సుఖముగా కాలము గడపగలదు, కానీ ఆకర్షణలో పోటీ పడుటకు అనేక మంది ఆడవారు గలరు.

కొంతకాలము పడుపు వృత్తిని చేసిన తరువాత విటుల రాక తగ్గినప్పుడు తమను వదలకుండా నుండుటకై బాగా వయసుమళ్ళిన ఒకరిద్దరిని చెప్పుచేతలలో వుంచుకుందురు, పిల్లలను ఈ వృత్తిలోకి దింపరు, ఆదర్శ గృహిణి కంటే ఎక్కువ పవిత్రంగా జీవితం గడుపుదురు, ఈ విచిత్ర మనస్తత్వం ఆడవారికే చెల్లింది, ఎంత ఉధృతంగా వ్యభిచారం సాగించిన వయస్సు వచ్చిన తర్వాత ఎవరో ఒక పురుషునికి విధేయతగా ఆడది ఉండును, అంటే ఏ పురుషుని అసహ్యించుకునినదో, ఏ పురుషుల కామమునకు బలియై, పతనము చెంది, వ్యక్తిత్వము నాశనం చేసుకునినదో తిరిగి ఆ పురుషుని వద్దే సంసారివలె ప్రవర్తించును.....!


తాజ్ 

పల్లెటూరి పిల్లోడు

ఇంకా ఉంది....

నోట్ : ఏ వ్యక్తులను కానీ వ్యవస్థలను కానీ కించపరచడం నా ఉద్దేశ్యం కాదు ఈ రచనతోఎవరి మనోభావాలు దెబ్బతిన్న మనస్ఫూర్తిగా క్షమాపణ వేడుతున్నాను 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...