వివాహము - తొలి సమాగము (సప్తమ భాగము)








వివాహము - తొలి సమాగము....!


ఏడు అడుగులతో ముడిపడి నూరు వసంతాలు రెండు దేహాలు ఒకే ఆత్మగా రూపం దిద్దుకునే కమ్మని ఘట్టాన్ని నా సప్తమ భాగములో వివరించడం ఒక విశేషమే!

స్త్రీ పురుషులు : సాంఘికముగా ఏనాటికైనా వివాహము చేసుకోవాల్సిందే, స్త్రీ పురుషులు చాలా వరకు చేసుకుని లేదా చేసుకోవాలని తాపత్రయపడతారు, స్త్రీ పురుషులిద్దరూ కలిసి సమ్మతముతో పెళ్లి (ఆర్థిక, లైంగిక, రక్షణ అవసరముల నిమిత్తము, సంఘాభివృద్ది నిమిత్తము) చేసుకుంటారు, భారతదేశంలో విహవా వ్యవస్తను పవిత్రంగా భావిస్తారు, భార్య మళ్ళీ పెళ్ళి చేసుకోవడం కంటే చావడానికి సిద్ధపడుతుంది.

కొన్ని దేశాలలో మాత్రం ఆడ మగలిద్దరూ సమాన స్వతంత్రము హక్కు కలిగి ఉండి కొన్ని సంవత్సరాలపాటు భార్య భర్తలుగా కాంట్రాక్టు పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది, ఇప్పుడిప్పుడే కాంట్రాక్ట్ వివాహ పద్ధతి రద్దుచేయడానికి ఆలోచిస్తున్నారు, పురుషుడు ఆడవాళ్లపై పెద్దరికం వహించడం క్రమంగా తగ్గిపోతుంది, జీవితంలో స్త్రీలకి పురుషుడు, పురుషుడికి ఆడది అవసరం, కానీ ఆడది మగవాడిని పొందడంలో స్వతంత్య్రాన్ని కోల్పోతుంది.

పురుషుడు పెళ్లి చేసుకున్నా స్వతంత్ర వ్యక్తే, పిల్లలు కనడం, గృహ నిర్వహణ ఆడవారి భాధ్యత, వచ్చిన చిక్కేమిటంటే ఈ రోజుల్లో పై రెండు భాద్యతలు నిర్వహించినా ఆడవాళ్ళకి గౌరవము లేదు, మగవారికి వృత్తి వ్యాపకాలతోపాటు సెక్సు( సంభోగము) అవసరం, సంఘానికి పురుషుని అవసరం ఎంతో, పురుషుడికి ఆడదాని అవసరము అంతే, ఇంత ప్రాముఖ్యత వహిస్తున్న ఆడవాళ్లకు స్వయం నిర్ణయాధికారంలేదు, పెద్దలు చేసిన నిర్ణయం ఆడదాని మీద బలవంతంగా రుద్దబడింది, కట్నాలు, పెళ్లి కొడుకు విషయాలు ఎవి పెళ్ళికూతురుతో సంప్రదించరు. 

వితంతువుకు ఆర్థిక స్వతంత్రం ఉంది కానీ పెళ్ళికాని పిల్లలకు లేదు, పిల్లలు కనడం మాత్రమే ఆడవారు విధి అని ఆనాడే పురుషాగ్రేశ్వరులు నిర్ణయించారు, పురుషుని కామము కండూతిని తీర్చుకోవడానికే ఆడది అని నాటి నుండి నేటి వరకు అదే అభిప్రాయం, మగవానికి అనేక మంది భార్యలు, ఉంపుడుగత్తెలు ఉండవచ్చు, కానీ భార్యకు ఉన్న హక్కులు వారికి ఉండవు, పెళ్లి చేసుకున్న తరువాత అమ్మాయి విషయం ఎవరూ పట్టించుకోరు, సమయానికి పెళ్లికాని అమ్మాయి అంటే ఊరిలో కుర్రకారు దగ్గరనుంచి ముసలి తాతవరకు ఆడపిల్లలను అనుభవించడానికి అర్రులు చాస్తారు, అందుకే తల్లిదండ్రులు కూతురుకి ఏదో విధంగా పెళ్లి చేయాలని చూస్తారు.

పెళ్లికి ఈ కాలములో కూడా ఇంకా విలువవుంది, పెళ్లికాని అమ్మాయిని చూస్తే అందరూ వింతగా చెప్పుకుంటారు, ఇంట్లో అన్నదమ్ములకు, అక్కకు, అక్క మొగుడికి, తండ్రికి, తల్లికి దాసినిలాగా పని చేస్తూ ఉండాలి, పెద్దయ్యాక మొగుడికి బానిస, ఆర్థిక అవసరాలకైనా పెళ్లి చేసుకోవలసిందే, తనకంటే కాస్త ఎక్కువ అర్హత గలవాడో, సమానుడో అయినా పరవాలేదు, వయసు మళ్ళిన అమ్మాయి పెళ్ళి పేరుతో మగాడి సన్నిహిత్యం కొద్దీకాలం దొరికినా చాలు అనుకుంటుంది.

అమ్మాయి కట్నంతో సహా వచ్చి ఇంట్లో దాసిదానిలా పనిచేస్తూ, పిల్లల్నికంటూ, మగాడికి సాయంగా ఉన్నా ఆ అమ్మాయిని ఈ పురుషుడు దగ్గరికి చేర్చడానికి తటపటాయిస్తాడు, పెళ్లి కానిదే ఆడదానికి కామవాంఛ తీరడం కష్టం, పెళ్లి చేసుకుంటేనే ఆడదానికి పరిపూర్ణత, పురుషునికి ఆర్థిక పుష్టి చేకూరితేనే పరిపూర్ణత.

ఆడదానికి అవసరం అయినంతగా పురుషునికి పెళ్లి అవసరం లేదనుకుంటాడు, అతనికి సులువుగా అమ్మాయిలను పొందవచ్చు, కర్చు తక్కువ, పెళ్లి చేసుకుని కుటుంబ భాధ్యత వహించడం కన్నా చేసుకోకుండా ఉంటే సుఖం, అయితే ఏకాంతతపోయి సుఖంగా నిర్పూచిగా ఉండాలంటే పెళ్లి అవసరం, మనదేశంలో కొన్ని కులాలలో వధూవరులు పెళ్లి పందిరిలోకి వచ్చేదాకా ముఖ పరిచయము లేనివాళ్ళే, పురుషుడు ఆడదాన్ని భరించాలి కనుక అతడికి కొంత ఎన్నుకునే అవకాశం ఉన్నది, ఆడది కేవలం పురుషుడు తన కామవాంఛ తీర్చుకోవడానికి, తన తృష్ణ తీర్చుకోవాడానికే అమ్మాయిని ఉపయోగించుకుంటాడు.

భార్యలోని చైతన్యాన్ని కొందరు భర్తలు వెలికితీసే ప్రయత్నం చేస్తారు, కొందరు భర్తలు భార్య తెలివిగలదైతే తనకు గౌరవము తగ్గి మాట వినడని మూర్ఖత్వంతో ఉంచుతారు, సాంప్రదాయం పేరిట జరిగిన వివాహాలు ఆడదాని ఉత్సాహానికి తగిన అవకాశం ఇవ్వదు.

ఈ రోజుల్లో కన్నెపిల్లనే తనకు భార్యగా కావాలని వరుడు కోరుకుంటాడు, కన్నె పవిత్రంగా కేవలం అనాఘ్రాణిత పుష్పంగా తనతోటే సంభోగం జరగాలి అనుకుంటాడు, ఇప్పటికీ కార్యం గదిలోకి తెల్లని బట్టలు కట్టి వధూవరులను పంపుతారు, తొలిసమాగములో స్రవించిన మరకలు తెల్లని బట్టలపై పడితే వరుడు సగర్వంగా తృప్తి చెందుతాడు, కార్యం గదిలో ప్రవర్తన మీద వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, తమింత కాలం ఆలోచించుకున్న ఆలోచనలన్నీ ఆ తృటికాలంలో ఆచరణ సాధ్యం కాదు, పురుషులకు కూడా కార్యంగది పరిక్షలాంటిదే.

ఆడవాళ్ళకి ప్రాణం కన్నా శీలం ప్రధానం, శీలం చెడిన ఆడది శిలకు సమానం, సహజంగా ఆడవాళ్లకు పిరికితనం జాస్తి, దానికి తోడు విశ్వాస గుణము,మతము, దైవచింతన ఉగ్గుపాలతో వస్తుంది, సంప్రదాయ కుటుంబములో పుట్టిన ఆడవారు తల్లి అదుపు ఆజ్ఞలలో, పెద్దలకు కట్టుబడి ఉండటమే కాక ఆదర్శప్రాయమైన నడవడి అలవర్చుకుంటుంది, ఏ ఆడది అయినా తప్పు చేయాలి అని ఆలోచించే ముందు ఆ కుటుంబము మొత్తము గురించి ఆలోచించాలి, అందుకే ఆడపిల్ల చేడితే ఏడుతరాల వరకు ఆ యింట్లో సంబంధం నిరాకరించేవారు పూర్వులు.

పరస్పర విశ్వాసపూరితంగా ఉండవలసిన వివాహ వ్యవస్థలో ఎటువంటి అనుమానం రేకెత్తినా దానిని సర్దుకుపోవడం కష్టమే, అలాంటిది కలగకుండా ఉండాలంటే ధృఢ విశ్వాసముంటే తప్ప జరగదు, దానికి తోడు లైగింక అసంతృప్తి ఉండనే ఉంది.

స్త్రీకి అలంకారం మీద మోజు ఎక్కువ, ఆడవాళ్లు అడంబరాన్ని కోరుతారు, గుట్టు - రహస్యాలు ఎక్కువ, లేనిది ఉన్నట్టు నటించడం, డాబుగా ఉండటం ఆడది కోరుకుంటుంది, ప్రతిష్ట కోసం పెనుగులాడుతుంది, గత జీవితాన్ని సులువుగా మరిచిపోతుంది.

భర్తను ఎన్నుకునేటప్పుడు సహజంగా తనకన్నా తెలివితేటలు గలవారిని చూస్తారు, అలాకాక తమ మాటలు వినేవారిని, నమ్మేవారిని ఎన్నుకునే స్త్రీలు ఉంటారు, దీనికి తల్లి మద్దతు ఉంటుంది, తల్లి సలహాలను పాటించే కూతుర్ని చేసుకునే భర్త సుఖపడలేడు, తల్లి తన కూతురు సుఖం కొరినంతగా అల్లుడి సుఖం కొరజాలదు, తన విధానానికి అనుగుణంగా అల్లున్ని మలచడానికి కూతురు ద్వారా ప్రయత్నిస్తుంది, కూతురు అమ్మ మాటలు కాదనలేక భర్తను భాదపెట్టలేక నలిగి పోతుంది. 

అందుకే పెద్దలందరూ, కూతురు తప్పు చేస్తే అమ్మ కారణం, కొడుకు తప్పు చేస్తే తండ్రి కారణం అన్నారు, ఈడోచ్చిన కొడుకును గాని, కూతురును గాని స్నేహితులుగా చూడాలి తప్ప వారి కాపురాలలో జోక్యం చేసుకోరాదు, పురుషులు అంత పట్టించుకోరు గాని స్త్రీలు మాత్రం అదే పనిగా ప్రాముఖ్యత కోసం ఆలోచిస్తారు, కూతుళ్ళు అమ్మ మాటవిని చేడిపోతూ ఉంటారు.

ఆడవారికి భేదాభిప్రాయాలు కలిగించడం, శత్రుబావ మెర్పరచడం చాల తేలిక, కైకేయి మనసు రెండే నిమిషాలలో మందర పాడుచేసి రాముని అడవికి పంపింది, వరభక్తుడు నీతిమంతుడు అయిన రావణుని సోదరి శూర్పణఖ సీతాపహరణంనకు ప్రేరేపించి అతని నాశనానికి కారణం అయ్యింది! శ్రీ రాముడు కానీ లక్ష్మణుడు కానీ శూర్పణఖ మొహాన్ని తీర్చి ఉంటే ప్రపంచం గతి మారివుండేది, గాంధారి కుటిల రాజనీతి కౌరవ - పాండవ యుద్దానికి దారి తీసింది, కాలు జారిన కుంతి ప్రవర్తన కన్న కొడుకును చిత్రవధ చేసింది అందుకే రాజకీయాలు, ఆలనా, పాలనా, ఉదారస్వాభావులైన పురుషులకే కట్టబెట్టాలని శాసనాలు వెలిశాయి కానీ..

ఆడది శక్తి స్వరూపిణి, అగ్ని పర్వతం మీద నిల్చుని చల్లార్చగలదు, పరమ దుర్మార్గుని సన్మార్గునిగా మార్చగలదు, ఆడది తలుచుకుంటే జీవితములో నిప్పులు పోయగలదు, పట్టుదలతో కార్యవాదిగా భర్తను ప్రోత్సహించి కార్యములు సాధించగలదు, కుటుంబము అను సంఘానికి పునాది ఆడది, ఒక కుటుంబములో ఆడది తల్లిగా, చెల్లిగా, భార్యగా ఆ కుటుంబములో మగవాళ్ల ఆలోచనలు ఒకే విధంగా పెట్టగల సమర్దురాలు, ఆడది నిప్పులాంటిది ముట్టుకుంటే మండుతుంది వెలుగులా వాడుకోవచ్చు, స్త్రీలో ఏ రహస్యము దాగడు అన్న అపోహకూడా ఉంది, చంపినా నిజం చెప్పని ఆడవాళ్ళు ఉన్నారు.

దాసి, పన్నాభాయి లాంటి త్యాగమూర్తులు, శివాజి లాంటి దేశభక్తుని కన్న జీజీభాయి, భర్త కడగళ్ళలో చిరునవ్వుతో పాలుపంచుకున్న కస్తూరిభాయి లాంటి ఆడవాళ్లను భార్యలుగా పొందిన మహానుభావుల అదృష్టం ఏమని చెప్పగలము, జీవితమంతా దరిద్రం అనుభవించిన మన ప్రియతమ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి భార్య లలితాదేవి ఆదర్శం, ఎంతమంది పోగడగల కీర్తి.

ఏమీ చదువురాని ఆడది కొన్నాళ్ళ భర్తతో కాపురం చెయ్యగానే భర్త తెలివితేటలను పాల్పంచుకుంటుంది, భర్తకే సలహా ఇవ్వగల స్థితికి వస్తుంది, గుర్రాన్ని, పులిని, ఏనుగును చివరకు పామును కూడా మనిషి మచ్చిక చేసుకొనగలుగుతున్నాడు, అలాంటిది ఆడదానికి మలచుకోవడం పెద్ద కష్టం అయిన పని కాదు, ఏ స్థితిలో అయినా ఆడది కోరుకునేది తనకు రక్షణ, తిండి, బట్ట ప్రపంచములో ఆర్థిక విషయాలు మగవానికే పరిమితం, భగవంతుడు కూడా పురుష పక్షపాతి, ఆడదాని శరీర నిర్మాణంలో వున్న బలహీనతలు అన్ని మగవానిలో లేకుండా దారుడ్యంగా సృష్టించాడు.


తాజ్

పల్లెటూరి పిల్లోడు

ఇంకా ఉంది..............

గమనిక : ఈ రచన ఎవ్వరిని ఉద్దేశించి కాదు నా వ్యక్తిగత జీవిత అనుభవ పాఠాలని వివరించాను, పెద్దల మాటలకు ఇలా అక్షర రూపం అందించాను..🙏 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...