స్త్రీ ఆలోచనా విధానము - వింత ప్రకృతి (అష్టమ భాగము)








స్త్రీ ఆలోచనా విధానము....!

స్త్రీ బావ్యాప్రపంచంలో వ్యవహరించేటప్పుడు చుట్టూ ఉన్నవారి మెప్పుకోసమే చూస్తుంది, ఊహలో రాజకుమారుడు, లక్షలు సంపాదించేవాడు, అడులకు మడుగులోత్తు బానిసని కోరుకుంటుంది, తన చుట్టూ వున్నవారు తనని చూస్తున్నారా లేదా అని పరిశీలించే అలవాటు చిన్నతనం నుంచి వస్తుంది, తల వంచుకునే అన్ని వైపులా గమనించడం స్త్రీ ప్రత్యేకత, తూర్పు వైపు చూసి ఎడమవైపు ఏముందో చెప్పగలదు, దక్షిణం వైపు చూసి ఉత్తరం వైపు ఏముందో చెప్పగలదు.

ఆడది తనను రక్షించే మగాడు కావాలని కోరుకుంటుంది, అప్పుడప్పుడు ఆ మగాణ్ణి పరీక్షిస్తుంది కూడా, లోగుబాటు తనం ఎంత ఉందో పగబట్టి కసితీర్చుకునే తత్వంకూడా అంత ఉంది, నవ్వుతూ విషం ఇవ్వగలదు, పాడుతూ ప్రాణం తియ్యగలదు, తనకు తగ్గ మగాడు దొరక్కపోయినా తీర్చిదిద్ది పది మందిలో నిలబెట్టగలదు.

యుద్ధం చేస్తుంది, యుద్ధం ఆపిస్తుంది, నరకములో నెడుతుంది, స్వర్గాన్ని చూపిస్తుంది, అంతా ఆడదాని చేతిలో పని అనుకున్నది నెరవేరేదాకా నిద్రపోదు, అందుకు సాధనగా అన్ని మార్గాలు వెతుకుతుంది, మానసికంగా ఎంత దృఢంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుందో అంత చపల చిత్తముతో మగాడి మాటలకు లొంగిపోతుంది.

తనకు కానప్పుడు ఇతరులకు దక్కకూడదన్న పట్టుదల ఉంటుంది, ప్రతి మాటని ఎత్తిపొడుపుగా, సవాలుగా తీసుకోవడం మగువలకు అలవాటు, ఎంత కోమల మనస్తత్వమో అంత పైశాచికత్వం కూడా ఉంటుంది.

సాటి ఆడదాని తప్పులను బ్రహ్మాండంగా ప్రచారం చేయడానికి అభిలాష ఉంటుంది చూశారా అది ఎలాంటిదో అని తన గొప్పతనాన్ని చాటుకోవడం కోసం ఇతరుల లోటుపాట్లను వేలుపెట్టి చూపుతారు, అంతటితో ఆగక ప్రచారం చేసే దాకా నిద్ర పట్టదు, మగాడు చూస్తున్నాడా లేదా అని పరిశీలిస్తారు చూస్తున్నాడు అని తెలియగానే తన ప్రాతివ్రత్యాన్ని ప్రదర్శించడానికి పూనుకుంటారు, తను తప్పు చేస్తే క్షేమార్హురాలు, సాటి ఆడది తప్పు చేస్తే ఘోరమైన నేరం, తను తెలియక జేసినట్లు ఇతరులు తల పొగరుతో చేసినట్లు చెబుతారు.

ఇన్ని తెలివితేటలు గల ఆడది మగాడికి బానిసగా ఎందుకు ఉండగలుగుతుంది? అని ప్రశ్నించాలనుకుంటే మనకు స్పష్టంగా కనబడేది చపల చిత్తము, బలహీనత, భయం, స్వార్థం ఈ కారణాల వల్ల మగాడి చేతిలో కీలుబొమ్మగా ఉండగలుగుతుంది, విచిత్రమేమిటంటే తను ఏ మగాడి రక్షణలో ఉందో ఆ మగాడినే బొమ్మను చేసి ఆడించడానికి ప్రయత్నం చేస్తుంది.

చదువుకొని ఉద్యోగం చేస్తున్న స్త్రీలు తమ భర్తలను అలంకారప్రాయుడుగా చేసి ప్రదర్శిస్తారు, ఇదిగో నా భర్త అని అందరికీ పరిచయం చేస్తుంది మగవాళ్ల అందరితో పాటు ఆడ వాళ్లకు కూడా పరిచయం చేస్తుంది, మగవాళ్లకు పరిచయం చేస్తున్నప్పుడు ఏమీ తదపడదు, ఆడవాళ్ళను పరిచయం చేసినప్పుడు అంతా హుషారుగా కనిపించదు పరిచయం చేసేటప్పుడు ఇద్దరి మొహాలు కనిపెడుతూ పరిచయం చేస్తుంది, తన మొగుడు ప్రాతివత్యం ఆ స్త్రీలు నాశనం చేస్తారనే భయం ఆమె అంతరంగములో ఉన్నట్లు చూపులలో కనుక్కోవచ్చు, లొంగిన మొగుణ్ణి బంట్రోతు కంటే నికృష్టంగా చూసే భార్యలు చాలామంది ఉన్నారు.

ఇదంతా స్త్రీ తన గొప్పతనం చాటుకోవడానికి చేసే పిచ్చి చేష్టలు, వాక్యం, సమయస్ఫూర్తి స్త్రీలకు లేకపోవడంతో వాళ్ల తెలివితక్కువతనం బయట పడుతుంది, వాళ్లను అనుసరిస్తున్న మగవారు కూడా ఒక్కొక్కప్పుడు అవమానాల పాలు అవుతారు.

భర్త బంధువులను దూరం చేస్తున్నట్టు, తాను వారిని దగ్గరకు చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆత్మీయత ఒలకబోస్తుంది, కానీ చేతలలో బయటపడదు, లేదు, పొండి అని భర్తచేత అనిపిస్తుంది, భార్య పలుకులను చిలుకపలుకులుగా భర్త పలుకుతాడు, మనసులో బంధువులు, ఆత్మీయులు అని అభిమానం ఉన్నా భార్య మాట వినే మగాడు ఏమి చేయలేడు, తల్లి చుట్టము వారు తలకింద శత్రువులు, ఆలి చుట్టము వారు ఆత్మ బంధువులుగా మారిపోతారు.


వింత ప్రకృతి.....

ఆడవాళ్లకు స్వార్థం హెచ్చు, పురుష సాంగత్యం కూడా తమ కోసమే, మగవారి వ్యాపకాలు ఆడది నిర్వహించడానికి కట్టుబాటు చేయడం జరిగింది, ఫలానా వాడి భార్య అని అనిపించుకోవడం ఆవిడ వ్యక్తిత్వానికి కీర్తి లేకపోవడం అన్ని చేసేది నేను నాకేమీ లేదు ఎవరూ పట్టించుకోరు అనుకుంటుంది.

తన శరీరాన్ని అద్దములో చూసుకుని ఆడుకునే బొమ్మలతో పోల్చుకుని సంతోషపడుతుంది, ఈ పోల్చుకోవడం చిన్న తనం నుండి అబ్బుతుంది, పదేళ్ల అమ్మాయి వోణి కట్టుకోవాలని, చీర కట్టుకోవాలని ఆరాటపడుతుంది, ఆడవారికి బట్టలు ఎంత ఇష్టమో పోచికొలు కబుర్లు కూడా అంత ఇష్టం, గంటలు క్షేణాలుగా గడిచిపోతాయి, ఆ మాటలు తీరిగ్గా వింటే ఆ మాట్లాడుతున్న ఇద్దరిని మినహాయించి మిగతా వారందరూ చెడ్డవారనిపిస్తుంది, అందరి మీద అన్ని నిందలు మోపుతారు, వాళ్ళిద్దరినీ విడివిడిగా కలుసుకుంటే ఒకరి మీద ఒకరు లక్ష నేరాలు చెబుతారు, ఏ ఆడది మరో ఆడదాని గురించి అక్క చెల్లెళ్ళు అయినా సరే మంచిగా మాత్రం చెప్పదు.

ఇతరులు బాగుపడతారు అని తెలిస్తే చెడ గొట్టడానికి మార్గం వెతుకుతుంది, బాగు పడితే హేళన చేస్తుంది, ఈ అమ్మలక్కల భాద తప్పాలంటే వారికి కొద్దిపాటి ప్రాముఖ్యము ఇచ్చినట్లు వారి సలహా కోరుతున్నట్లు నటించాలి, పేరంటానికి, పండగ పబ్బాలకి ఆడవాళ్లను పిలవటములో ఆంతర్యము ఇదే.

ఆడదానికి నాది అని ఎంత మమకారం ఉందో అంతకంటే నేను అన్న అహం హెచ్చు, చదువుకున్న ప్రతి అమ్మాయి ఏమంటుందో తెలుసా నేను ఎవరిని అడగడం లేదు, ఆధారపడటం లేదు, నా అంతట నేను చదువుకున్నాను అంటుంది.

సందర్భాన్ని బట్టి ఆడది మాట్లాడుతుంది, ఇప్పుడున్న అభిప్రాయం కాసేపట్లో ఉండదు, అవునంటే కాదంటుంది, కాదంటే అవుననే అర్దం వచ్చేలా మాట్లాడుతుంది, కోపం చూపించిన ఆడదాని మనసులో అతనిపట్ల అభిమానం ఉండే అవకాశం కూడా ఉంది, నవ్వే ఆడదాన్ని నమ్మరాదు అన్న భావం ఉంది, నవ్వుతూ విషపాత్ర అందివ్వగలదు, అందుకే ఆడది అబద్దం ఆడితే గోడ కట్టినట్లు అంటారు, అనుమాన పూరిత హృదయం కాబట్టే ఆడది సులువుగా బోల్తా పడుతుంది, ఎంతో తెలివిగా ఉన్న ఆడది కూడా హఠాత్తుగా ఘటనలు జరిగినప్పుడు ఏమీ తోచక ఉక్కిరిబిక్కిరి అవుతుంది, ఏదో ఒక దారికి లేక నిర్ణయానికి ఆడది రాలేదు, పురుషుడు నడిపించవలసిందే తనకు తానై ఏమి చేసినా ఏదో లోపం, భయం ఆవరిస్తుంది, స్త్రీ పురుషునికి నీడలా ఉండవలసిందే, అదే జీవిత సత్యం అయితే దాసిగా కాక సమాన హక్కు, చొరవ, అవకాశం ఇచ్చి ఆడదాని వివేకానికి తోడ్పడాలి, వారిలో గొప్పతనం మెచ్చుకుంటూ ఉండాలి.

సిగ్గు ఆడవారికి అలంకారము, మగవారిని చిత్తుచేయడానికి పనికి వచ్చే గొప్ప ఆయుధం, ఏడ్పు తరువాత అంతకు మించిన ఆయుధం సిగ్గు, ఈ సిగ్గు పరిచయం అయ్యేదాకానే పరిచయం అయ్యాక ఉండదు.

పదిమంది మగవారి మధ్య ఒక స్త్రీ సుఖంగా ఉండగలదు, కానీ పదిమంది స్త్రీల మధ్య ఒక మగవాడు వుండడం కష్టం.

జీవితంలో పురుషుడు ఆడదాన్ని వశం చేసుకోవడం ఎంత దుర్లభవమో వదిలించుకోవడం కూడా అంతే భాధ, మంచి విషయాలలో కూడా త్యాగం చేయగల దైర్యం స్త్రీకి ఉంది.

తాజ్

పల్లెటూరి పిల్లోడు

గమనిక : ఈ రచన ఇతరులేవ్వరిని తక్కువ చేసి చెప్పడానికి కాదు, అందరిని ఒకే జట్టుగా కట్టాలని నా ఉద్దేశ్యం కాదు, నాకు ఎదురుపడి, నేను విని, చదివిన కొన్ని సంఘటనలు ఆధారంగా తీసుకోని రాసింది.

ఆడవారి మనసు, మర్మం తెలుసుకోవాలని ఒక రాజు లేదా వ్యక్తి ప్రయత్నం దానికి ఎదురయినా సవాళ్లు నా తదుపరి రచనలో తెలియపరుస్తూ ఈ రచన ముగిస్తాను స్వస్తి 🙏



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...