కథలో నిజానికి ఆడదంటే? (చివరి భాగము)








ఆడుదాని మాయా,మర్మము తెలుసుకోవడం ఎలా?


ఒకానొక కాలంలో ఒక రాజు దీర్ఘాలోచనలో పడ్డాడు అసలు ఆడుదాని యొక్క మనస్తత్వము, ఆలోచన సరళి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని అందుకు గల మార్గాన్ని అన్వేషించనారంభించాడు కానీ అతనికి ఏ మార్గము కనిపించకపోవడంతో కాస్త నిరాశ చెంది బేలగా కూర్చున్నాడు, అది గమనించిన అతని భార్య రాణిగారు ఎందుకు అలా దిగాలుగా ఉన్నారు అని ప్రశ్నించింది దానికి సమాధానంగా నేను ఎన్నో రోజులుగా ఆడవారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని లోతుగా అన్వేషణ సాగించాను కానీ నాకు ఎలాంటి మార్గము కనిపించలేదు, కానీ కొన్ని రోజులుగా మన రాజ్యం మధ్యలోని చేద బావి దగ్గరకు వెళ్లి కూర్చుంటున్నాను చాలామంది మహిళలు నన్ను చూసి దగ్గరకు రావడానికి కూడా జంకుతున్నారు. 

అలా కొన్ని రోజుల తర్వాత ఒక ఆడది ధైర్యంగా బావి దగ్గరకు వచ్చి నీళ్ళు చేదడం ప్రారంభించింది, అయిపోగానే నేను ఆ ఆడుదాన్ని అడ్డగించి ఇలా అడిగాను ఆడదాని యొక్క మర్మము, మాటలలోని ఆంతర్యం తెలుసుకోడం ఎలాగో తెలపమని దానికి సమాధానంగా తను నాకు ఒక మాట చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది అది ఏమిటంటే రాజా ఇది సమయము కాదు, సందర్భం కాదు కానీ మీరు అంత దిగాలుగా కూర్చున్నారు కాబట్టి నేను మీకు సమాధానం చెప్పగలను అందుకు మీరు ఒక పని చేయాలి నేను వేసే ఈ చిక్కుముడి సమాధానంగా తెలుసుకుని వచ్చి నన్ను కలవండి మీకు నేను తప్పకుండా సమాధానం ఇవ్వగలను అని ఇలా చెప్పింది, ఒకటి చేత పట్టుకోండి, రెండింటి పైకి ఎక్కండి, మూడు నోట్లో పెట్టుకోండి, కర్రు నాగలి సందులో నుంచి, అటు రాకండి, ఇటు రాకండి, అని చెప్పి వెళ్ళింది, నాకు దానికి సమాధానము అవగతము కావడం లేదు అని.

అప్పుడు రాణి గారు ఇలా చెప్పుకొచ్చారు తను అన్న దానికి సమాధానం నేను చెప్పగలను ఆ మాట వినగానే హుషారుతో ఆ రాజు తన భార్యని సమాధానం చెప్పవలసిందిగా కోరాడు తను ఇలా వివరించసాగింది, ఒకటి చేతిలో పట్టుకోండి అంటే చేతి కర్రను చేతిలోకి తీసుకోమని, రెండింటి పైకి ఎక్కండి అంటే చెప్పులు వేసుకోమని, మూడు నోటిలో పెట్టుకోమంటే ఆకు సున్నము పొకవక్క , కర్రు నాగలి సందు అంటే తన ఇల్లు కమ్మరి మరియు వడ్రంగి వారి ఇంటి మధ్యలో వెళితే ఉంటుందని, ఇక ఇటు రాకు అంటే పూర్తిగా వెలుతురు ఉన్నప్పుడు రాకు అంటే చీకటి పడిన తరువాత అని, అటు రాకు అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత రాకు అని.

అది వినగానే రాజు సంతోషంతో లేచి అందుకు గల ప్రణాళిక సిద్ధం చేసుకుని కాస్త చీకటి పడగానే తన ఇంటి వైపు చేతిలో కర్ర, కిర్రు చెప్పులు, నోటిలో కిల్లి వేసుకుని తన ఇంటి వైపు బయలు దేరాడు కానీ అనుకోని అవాంతరం ఒకటి ఎదురైంది, ఆ అడుదాని భర్త వ్యాపారం నిమిత్తం ప్రాంతాల వారీగా తిరుగుతూ అదే రోజు ఇంటికి తిరిగి వచ్చాడు.

వస్తున్న రాజును గమనించిన ఆడది ఏమి చేయాలో పాలుపోక ఒక మట్టి ముంతను తీసుకొని దానికి సున్నము రాసి కుంకుమ బొట్లు పెట్టి వస్తున్న రాజు కేసు కొట్టింది, అది చూసిన రాజు నిర్ఘాంతపోయాడు అరెరే ఇదేమి రమ్మని చెప్పి నన్ను ఇలా ముంతతో కొట్టినదేమి అని నిట్టూర్చాడు, మళ్ళీ దిగాలుగా ఇంటికి చేరుకున్నాదు రాణి అతని విషాన్నవదనం చూసి అసలు ఏం జరిగింది అని ప్రశ్నించింది, దానితో రాజు బేలగా తను చెప్పినట్టే నేను సరంజామా సిద్దం చేసుకొని వెళ్ళాను కానీ నన్ను చూసి ఒక ముంతతో నా మొహానికేసి కొట్టింది పైగా దానికి సున్నము, కుంకుమ బోట్లు రాసి మరి అని చెప్పాడు, అది విని చిరునవ్వు నవ్వి ఓ అదా ఆమె నీకో విషయాన్ని చెప్పాలని చెప్పకనే చెప్పింది అని అనేసరికి రాజుకి మళ్ళీ ఉత్సాహం పొంగుకొచ్చి అవునా అయితే అది ఏమిటో చెప్పగలవా అని ఎదురు ప్రశ్నించాడు.

అందుకు రాణిగారు సమాధానంగా ఇలా చెబుతుంది మీరు వెళ్లేసరికి ఆమె ఇంట్లో తన భర్త ఉండటం వల్ల మిమ్మల్ని కలవడం ఇబ్బంది కలిగి ఉంటుంది అందుకు సూచనగా మిమ్మల్ని ఇంట్లో కలవడం కుదరదు కాబట్టి ఊరు బయట ఉన్న శివాలయానికి రమ్మని చెప్పింది.

విన్నదే తడవుగా రాజుగారు లేచి గుడి వైపు పరుగులు తీశాడు తను అక్కడికి చేరుకునెలోగా అప్పటికే గుడిలో ఉన్న పడతిని చూసి ఒకింత ఆశ్చర్యం నిండిన కంఠముతో రాజు ఏదో మాట్లాడాలని అనుకునే లోపే వీరి అలికిడి విన్న రాజభటులు గుడిలో దొంగలు పడ్డారు అనే అనుమానముతో బయట గొళ్లెం బిగించారు, ఎరక్కపోయి వచ్చి ఇరుక్కు పోయాము అన్న చందంగా ఆడదాని గురించి తెలుసుకుందాము అని రాజు వస్తె తనో స్త్రీ లోలుడు మరో స్త్రీతో గుడిలో ఉన్నాడని నలుగురు నవ్వుకుపోయేలా ఉన్నారేమి అని దిగాలు పడ్డాడు రాజు.

కాసేపు ఆలోచన తరువాత రాజా మీరు ఇన్ని విధాల నేను వేసిన చిక్కు ప్రశ్నలు విప్పి వచ్చారు అంటే మీ మేధాశక్తి అమోఘం అని చెప్పాలి ఇప్పుడు మీరా మేథస్సు ఉపయోగించి మనం బయటపడే మార్గం చెప్పండి అని అందా ఆడది అది విన్న రాజు నేను కాదు నీ ప్రశ్నలు చేదించి వచ్చింది వాటికి సమాధానము చెప్పి నన్ను నీ వద్దకు పంపింది నా భార్య అని చెప్పాడు, దానితో కంగుతిన్న ఆ ఆడది ఈ ఆపదను గట్టెంకించేది కూడా మీ ఆవిడే అని ద్వారం దగ్గరకు వెళ్ళి ఒక బంగారు నాణెం ఆ రాజభటులకు అందించి మీరు రాజ్యంలోకి వెళ్లి రాజు దర్బార్ సమీపములో మధం పట్టిన దున్నపోతు భంజరుదోద్దిలో పడ్డదహో అని అరవమని రాజు వస్తె వీరిని పట్టిస్తే మరిన్ని బహుమానాలు రాజు దగ్గర తీసుకోవచ్చని ఆ రాజభటుడు అలాగే చేశాడు.

ఆ అరుపులు విన్న రాణి చిక్కుల్లో పడ్డది తన భర్త రాజుగారే అని గ్రహించి భోనం వండుకుని తెల్లచీర ధరించి గుడి దగ్గరకు చేరుకుంది, తన భర్త దూర దేశం పోయి వచ్చాడని అతను జాగ్రత్తగా వస్తె అమ్మవారికి భోనము సమర్పిస్తాను అని మొక్కుకున్నాను చెల్లించకపోతే అమ్మవారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తది మీకు అంతగా అనుమానంగా ఉంటే మీరు నా చీర చివరి కొంగును పట్టుకోండి నేను వెళ్లి మొక్కు అప్పగించి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది, తను వెళ్ళిన వెంటనే ఆ లోపల ఆడు మనిషి ఆ చీర కొంగును అందుకుని బయటకు వెళ్లి ఇంటికి చేరుకుంది, అప్పటికే ఇంట్లో ఉన్న భర్త ఎక్కడికి పోయావని ఆరా తీయడం మొదలు పెట్టాడు మీరు క్షేమంగా ఇల్లు చేరితే అమ్మవారికి బొనము బొట్టు పెడతానని మొక్కుకున్నాను అది ముట్టజెప్పి వస్తున్న అని చెప్పగానే తన భార్యకు తనమీద ఉన్న ప్రేమకు ముచ్చటపడి పొంగిపోయాడు ఆ మగాడు,

మెల్లగా తెలతెలవారుతుండగా లోపల ఉన్న రాజు లేచి గుమ్మం వద్దకు వచ్చి బయట నుంచి గొళ్లెం పెట్టింది ఎవరు అని వాకబు చేశాడు, ఇది రాజుగారి గొంతులా ఉందేమి అని కంగుతిన్న రాజభటులు భయపడి తలుపు తెరిచాడు ఎదురుగా రాజుగారు రాణి గారితో ఉన్న దృశ్యం చూసి క్షేమాపనలు అడిగి వారు అక్కడి నుంచి జారుకున్నారు, రాజ్యం రాజ్య ప్రజల క్షేమం కోసం ఒక రోజు శివుని సన్నిధిలో నిద్రించాను అని ప్రకటించుకుని రాజమందిరానికి చేరుకుని గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు రాజు.

అందుకే అంటారు మన పెద్దలు ఆడుదాని మర్మం మరో ఆడదానికే తెలుసు, బుద్ది మేదస్సులో వారిని మించినవారు లేరు, మహామహులకే సాధ్యపడలేదు నువ్వెంత్త అని, ఆడది తప్పు చెయ్యాలి అనుకుంటే దాటిన గడపకు కూడా తెలియదు తను ఎందుకు దాటేసింది అన్నది అంటారు.

ఆడదాని మాయా, మర్మము తెలుసుకోవడం ఎలా? అంటే అది సాధ్యము కాదనే చెప్పాలి, వెర్రి ఆశలతో వెంపర్లాడి పర స్త్రీని కోరి ముప్పు తెచ్చుకోవడం వద్దు, ఆడదానికి మొగవాడికి పెద్ద తేడా ఏమీ లేదు వారికి ఒకచోట ఎత్తుగాను ఒక చోట సత్తుగాను, మగాడికి ఒక చోట ఎత్తుగాని మరోచోట దిట్టంగా ఉంటాడు, దానికే ఏదో మోహం పెంచుకుని కోరి కష్టాలపాలు కావద్దు, ఎప్పుడు నడుముకి కింద ఉన్నదాని గురించి కాక మేడ మీద ఉన్నది కూడా వాడితే ఎలాంటి పోర్పొచ్చాలు లేకుండా ఆడ మగ ఆనందంగా జీవించవచ్చు.

ముగిసింది....

తాజ్

పల్లెటూరి పిల్లోడు

గమనిక : ఇందులో కొంత భాగము నా చిన్నతనంలో మా తాతయ్య ఒడిలో నిద్రిస్తున్నపుడు చెప్పిన కథ, ఇది ఎవరినీ ఇబ్బంది కలిగించినా క్షేమాపణలు తెలుపుకుంటున్నాను, 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...