కవిత కన్నులు....!








కవిత కన్నులు....!

మనసు పడిన ప్రేయసి, నవ్వు నేర్పిన నా ప్రియ సఖి
కవితే నా కన్నులు, ఈ అక్షరాలే నా మది పలికే ఊసులు
కవి ఆలోచనలకు మనసు వారధి, కవికి మెదడు మనోరధి
కలమునకు ఉండదు ఈర్ష ఏది, రాసే కాగితం మాకు అమ్మ చెవి

రాస్తాము మెదడుకు సానపట్టి, కలానికి భావాలను లంకెపెట్టి
ఇది ఒక యాగము, అందరికీ దక్కని రాజయోగం
నీ చప్పట్లే రాజపూజ్యం, నీ నగుమోముకు నే దన్యము
అబద్దాలు కావు ఇవి, అందమైన ఆకృతులు
మనసును మురిపించి ఆనందింప చేయు కీర్తి పతాకలు

కవి కళ్ళతో చూడు అంతా నికే తెలియు
కవి మనసుతో ఆలోచించు నీకంతా బోధపడు
ఇది నిజం, నువ్వు కాదన్న నా కవితకు ఎది ఆదరణం
నీది నాది ముచ్చటైన బంధం, మనం లేని ఈ జగతి వ్యర్థం

కవితే మన అనురాగానికి ప్రతిరూపం
కవితే మన మమకారానికి మరో అర్థం
నీ నీడలోనే నా బ్రతుకు, నీ చేతిలోనే నా భవిష్యత్తు
ఏ వేళ అయినా, ఏ రోజుకైనా కలిసే ఉందాం, కలిసే పోదాం..!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...