అందంగా ఆ'కట్టు'కునెలా....!

 


అందంగా ఆ'కట్టు'కునెలా....!

అంజలి దేవి, సావిత్రి
జయసుధ, జయప్రద
మధుబాల, శ్రీదేవి
ఆ తరం అందం వారిది
ఈ తరం అందం నీది

అబ్బా అబ్బబ్బ తన వెలుగు మోము, చూడనెంత సక్కన
తన చెంత చేరి నిలిచానో, నేను కూడ వెలగనా
పాలపుంత ఒడిలోన ఎన్ని గ్రహలుండినా
తన చల్లని ఒడిలోన నా బ్రతుకే పండదా

జానకమ్మ, సుశీలమ్మ, శైలజమ్మ, చిత్రమ్మ
ఆ కాలం తీపి రాగం వారి సొంతం
కోకిలలే చిన్నబోవు, జుంటి తేనె ఉటలూరు
చెరుకు గడలు మాసిపోవు, కంఠస్వరం నీ దాసోహం

దివి తార నెలజారి వంగినట్టి నడువొంపు
నెలవంకే సేదతీరి అదిమి చూడు అను కెంపు
ఆహా ఆ నడక చాలు కుర్రకారు బేజారు
తన అంగీకార సంజ్ఞ కొరకు ఇంటి చుట్టు పరిచార్లు

మల్లియలే పరిమళాన్ని ఆ తనువుకు అద్దెనేమో
వెన్నెలలే తన యదనుపూసి నాకు వెలుగు పంచెనేమో
నీ నవ్వుల గారడికి చింతలన్ని తీరునేమో

అందినదా నీ చేయి, అదృష్టం లే హాయి
దొరికినదా తన తోడు, నాకు లేదు ఏ కీడు
తన నీడనే నాకు వెలుగు, తను లేని నే మోడు
చలనమున్న శిలాజం, అస్తమించు రవి కిరణం...!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...