నీ నవ్వే నా హృదిస్పందన...!

 


నీ నవ్వే నా హృదిస్పందన...!

నా మస్తిష్కం లో నెలవై
అక్షరాల మాలకూర్చే అలౌకిక శక్తినివ్వు
నా మనసు గెలిచిన మహారాణివి నువ్వు
నా కన్నుల తేలు వెలుగు రాసివి నువ్వు

నా పెదవుల చిరునవ్వు పూయించ
కదిలిన పారిజాతము నీవు
నా శ్వాసలో కొలువు తీరిన దేవత నీవు
నా జన్మ జన్మల పుణ్య ఫలముతో
దొరికిన అదృష్ట తారక నీవు, నీ నవ్వు

నీ నీడలో నేను
నీ చెంత నా మనసు
నీ పాదాలపై నా తనువు
నా పరిసరాల తిరుగాడుతూ నన్ను
పదే పదే చైతన్యం చేయు నీ నవ్వు

నీ నవ్వుకై ఏమైనా చేస్తాను
నీ నవ్వే దివెనగా తలుస్తాను
ఎందుకంటే......!
నీ నవ్వే స్పందనగా నడచు
నా హృదయ యంత్రం ఆగిపోతుంది...

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...