పురుషుడు ఏనాటికైనా స్త్రీని అర్థం చేసుకుంటాడా?(ద్వితీయ భాగము)

 








పురుషుడు ఏనాటికైనా స్త్రీని అర్థం చేసుకుంటాడా?(ద్వితీయ భాగము)

స్త్రీ చిత్ర విచిత్ర ప్రకృతులు , పడుచు పిల్ల వేషాలు, భార్యగా కామపిశాచిగా, ప్రియురాలిగా, స్వేచ్ఛా జీవిగా అన్ని కోణాలలో స్త్రీ ఆంతరంగిక మేమిటో? మహామహులు కూడా కనుక్కోలేక చతికిల పడ్డారు కానీ స్త్రీకి పురుషునితో గల సంబంధం ముఖ్యమైనది ఎందుకంటే స్త్రీ లేకుండా పురుషుడు గడుపుకోగలడు కానీ పురుషుడు  లేకుండా స్త్రీకి జీవితమే లేదు.

అయ్యో నీకు చీర తీసుకురావాలని అనుకున్నాను కానీ మరిచిపోయాను అని మొగుడు అంటే పొంగి పోతారు బోలెడు చీరలు ఉన్నాయి ఇప్పుడు ఎందుకులే అంటుంది, మరి కొందరు స్త్రీలకు కామవాంఛ ఎక్కువగా ఉంటుంది కామ వాంఛ తీరకపోతే భర్తతో లేక పిల్లలతో తగాదా పెట్టుకుంటారు తన అసంతృప్తి తన లోపంగా భావించి సంతృప్తి కోసం అనేక మంది పురుషులతో పరిచయం పెంచుకుంటారు కానీ కొందరు స్త్రీలు భర్తతోనే సుఖంగా గడుపుతారు తనంత తెలివి తేటలు లేకున్నా తనకు దిక్కుగా తను చెప్పిన మాట వినగలిగితే చాలు అని అందం కోసం చూడరు తెలివి తేటలు ఉన్నవాన్ని చేసుకుని అనవసరమైన భాధలు పడటం కంటే సామాన్యుని చేసుకుని తన మాట చెలామణి చేసుకోగలిగితే చాలు అని స్త్రీ అభిప్రాయం.

కొంతమంది స్త్రీలు తమకు కావాల్సింది ఏమిటో తెలుసుకోలేరు మగ దిక్కు కావాలని మాత్రం తెలుసు కానీ ఆకర్షించలేరు అందరూ కలిసి ఎవడినో ఒక మగాణ్ణి అంటగడతారు ఆలోచన లేని ఆకర్షించలేని మనిషి ఆ మగాణ్ణి దక్కించుకోలేదు కానీ వారి కోరికలు తెలుసుకుని సర్దుకుపోగల మగాడు దొరికితే జీవితం హాయిగా  సాగుతుంది లేదా స్థిరత్వం లేక ఇబ్బంది పడుతుంది

ఈ మగాడి కంటే ఆ మగాడు మంచివాడు అని ఆడది దీనికంటే అది బాగుంటుందేమో అని మగాడు తప్పటడుగులు వేస్తుంటారు అసూయ, పోటీ, ద్వేషం ఈ మూడు గుణాలు స్త్రీలో బాగా జీర్ణించుకుపోయి ఉంటాయి భర్తను అనుమానించి అకారణ ద్వేషం తో జీవితాలను నిప్పులలో తోసుకుంటారు తనకు దక్కనప్పుడు ఇతరులకు కూడా దక్కకూడదన్న తత్వం స్త్రీలలో చాలా మందికి ఉంటుంది పురుషులతో సంబంధం పెట్టుకున్నప్పుడు మానసికోద్రేకానికి ప్రాముఖ్యత ఉంటుంది పరిచయం పెరుగుతున్నకొద్దీ స్వార్థం, అసూయ, అనుమానం పెరుగుతుంది తను మంచి మగాడి కోసం వెతుకుతున్నట్లు మగవాడు నమ్మకమైన స్త్రీని వెతుకుతారు అని ఆలోచించరు.

తన సర్వస్వం అర్పించాను ఇంకేం కావాలి అని అనుకుంటారు కానీ తన మగవాడికి కావాల్సిందేమిటో ఆలోచించరు, డబ్బు మీద మోజుతో వయస్సు తారతమ్యాలను గమనించకుండా ఇటువంటి సంబంధాలు పెట్టుకుంటారు నేను కాబట్టి ఆ మగాడితో కాపురం చేస్తున్నారు ఇంకొతైతే ఏనాడో వదిలేసి పారిపోయి ఉండేది అని ప్రతి ఆడది అనుకుంటుంది తన అవసరం తన బలహీనత తీర్చుకోవడానికి మగాడు కావాలి అందుకే మగాడిని ఆశ్రయించింది ఈ విషయం ఆ ఆడది ఒప్పుకోదు.

మగాడు తన కోరిక తీర్చుకోవడానికి ఆడదాన్ని వాడుకున్నట్టు చెబుతారు నిజానికి కోరుకున్నది మగాడి కంటే ఆడదానికే హెచ్చు మగాడు బయటపడతాడు ఆడది బయటపడదు కాస్త చదువు సాహసం చేయడానికి అవకాశం ఇస్తే స్త్రీ మనసు విప్పి చెబితే మామూలు మగాడు అదిరిపోతాడు, భగవంతుడు స్త్రీకి అన్ని ఇచ్చాడు కానీ సాహసం సమయోచితం ఇవ్వలేదు సమయోచిత జ్ఞానం వుండి చపలత్వము లేకుండా సాహసం చేయగల స్త్రీలు చాలా అరుదు, ఎంత ముందుకు వెళ్ళిన ఎక్కడో మగాడు తోడు కావాలని మగాడి  వైపు చూస్తుంది మనసు అనుమానంతో నిండి ఉంటుంది అందుచేత ఎవ్వరిని నమ్మలేదు ఈ స్థితి చిత్ర విచిత్ర పరిణామాలకు దారితీస్తుంది అందుకే పెద్దలు వివాహ బంధం విడదీయరానిది గా నిర్దేశించారు.

దీనివల్ల స్త్రీకి చపలత్వం లేకుండా కొంత నమ్మకం దృఢ చిత్తం కలిగి ఉండడానికి పనికి వస్తుంది సృష్టి నుంచి ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు హత్యలు తగాదాలకు మూలం స్త్రీ గా కనిపిస్తుంది, పురుషుడు అష్టకష్టాలు పడి స్త్రీకి సకల సదుపాయాలు కలిగిస్తాడు దానికి ఫలంగా దక్కేది అనుమానం చులకన నిష్ఠూరము పుట్టిన పిల్లలు కూడా తల్లికి అనుబంధంగా ఉంటారు కానీ తండ్రికి అనుబంధంగా ఉండరు అయినా మగాడు లెక్కచేయడు స్త్రీ ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటుంది ఎక్కువగా మాట్లాడితే చులకన అయినట్టు భావిస్తోంది తక్కువ మాట్లాడితే నిర్లక్ష్యం చేసినట్టు బాధపడుతుంది

బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగే స్వేచ్ఛ ఇచ్చిన ఆ స్వేచ్ఛ లో కూడా బాధపడుతుంది బజారెంట నడిచిపోతూ తనను ఎంతమంది చూస్తున్నారని గమనిస్తుంది చూసిన ప్రతివాడు తన పట్ల మోజుతో ఆశతో చూస్తున్నట్లు అనుకుంటుంది చూడకుండా మగాడు వెళ్ళిపోతుంటే దగ్గి ఎవరినో పిలిచిన శబ్దం చేసి మరి మగాడి చూపును ఆకర్షిస్తుంది అలంకరణ మాటవయ్యారంతో ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది స్త్రీ వలలో పడితే ఆ మగాడు సాలెగూటిలో చిక్కుకున్న పురుగు లాగే, అందుకే అబద్ధాలు, నటనలు, తగాదాలు, ఇష్టం లేకపోయినా మగాడు ఆడాల్సి వస్తుంది

ఈనాడు స్త్రీలు పురుషులతో అన్ని రంగాలలో ఉద్ధృతంగా పోటీ పడుతున్నారు కానీ విజయవంతంగా జీవించిన ప్రతి స్త్రీ వెనుక ఎవరో పురుషుడు ఉన్నాడన్నది సత్యము, ఎప్పటికీ భార్య భర్తకు లొంగీ ఉండవలసిందే అన్న భావన మాసి పోలేదు అయినా స్త్రీ ఈ బంధము నుంచి విముక్తి పడాలని తాపత్రయ పడుతూనే ఉంటుంది అది వృధా ప్రయాస అని తెలివి తక్కువ తనము అని పురుషుడు లేనిదే తను జీవించడం సాధ్యం కాదని స్త్రీ తెలుసుకునేసరికి చాలా కాలం పడుతుంది.

పిల్లలు పుట్టగానే మెత్తటి వెచ్చని తల్లి ఒడిలో ముద్దుల మధ్య పెరుగుతారు మరో పిల్ల పుట్టినప్పుడు తల్లి ప్రేమను ఆ పిల్ల పంచుకోవడం పట్ల అసూయ చెందుతారు ఆ విధంగా పుట్టినపుడు శారీరక ఆకర్షణ ప్రారంభమవుతుంది పాలు త్రాగి తల్లి ఒడిలో ఉన్న స్థితిని దాటి పెద్దవాడిగా విడదీయబడిన ప్పుడు తనను దూరం చేస్తున్నట్లు బాధపడి పిల్లలు ఇతరులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు మూడు నాలుగు సంవత్సరాల వయసు వచ్చేవరకు ఆడ పిల్లలకు మగ పిల్లలకు తల్లిదండ్రులు ఏ వ్యత్యాసం చూపించారు ముద్దులు కౌగలింతలు మామూలుగానే ఉంటాయి క్రమక్రమంగా మగపిల్లలు ఎదుగుతున్న కొద్దీ తల్లి దగ్గర ఇదివరకున్నంత చనువుగా వుండే అవకాశం లేదు ఆడపిల్ల మాత్రం సక్కని దుస్తులలో ముస్తాబు చేసి తల్లి ఒడిలో ఒదిగిపోతుంది అదే వయసుగల మగ పిల్లవానికి ఆ అవకాశం ఉండదు అలా దూర దూరంగా ఉండటంతో పాటు స్వేచ్ఛ కూడా అబ్బుతుంది తల్లి ఒడిలో తీయదనం బావుంటుంది నేను ఆడ పిల్లని అయి ఉంటే ఎంత బాగుండేది మా అక్క అమ్మ ప్రక్కనే హాయిగా నిద్రపోయే వాన్ని అనుకుంటారు

మనం మగాళ్ళం ఆడవాళ్ళతో ఉండకూడదు అని మన పెద్దలు మనల్ని గదినుంచి వారి నుంచి వెలుపలికి తెచ్చారు క్షణం క్షణం మగాడివి, పెద్దవాడివి అంటుంటే లోలోపల మగాన్ని అనే గర్వము సంతోషము మొదలవుతుంది పన్నెండు ఏళ్లు వచ్చే వరకు కూడా ఆడపిల్ల మగ పిల్లవాడికి సమానమైన బలము కలిగి ఉన్నా క్రమంగా మానసిక స్థితిలో మాత్రం మార్పు వస్తుంటుంది, మగాళ్లు గొప్ప వాళ్ళు అని సంతోషించే కుర్రాడు ఒకవైపు తల్లి దగ్గర నుంచి దూరం అవుతున్నా ఈ విధమైన పురుష గర్వంతో సంతోషిస్తూ ఉంటాడు

అందుచేత సమాజంలో ఆడపిల్లను తనలాగే చక్కటి గృహిణిగా తయారుచేయాలని తల్లులు తాపత్రయపడతారు ఆడపిల్లల బడిలో చేర్చి ఆడ ప్రవర్తన నేర్పాలని తాపత్రయపడతారు కానీ ఆడపిల్లలు మగవారిలా ప్రవర్తించాలని తమ బలాన్ని ప్రదర్శించాలని ఉబలాటపడతారు కానీ సాగనివ్వరు చెట్లు ఎక్కనివ్వరు గోడలు దూకనివ్వరు నిచ్చెనలు ఎక్కనివ్వరు  ప్రతి చిన్న విషయంలో అదుపు ఆజ్ఞ లో ఉంచుతారు, సరిగా నిలబడు అంటారు, మగాడిలా మాట్లాడకు, దెబ్బలాడకు, పరిగెత్తకు పెద్దవాళ్లలా బుద్ధిగా ఉండాలని ఆదర్శప్రాయంగా ఉండాలని చెబుతారు చదువు నేర్పినా ఆటల పోటీల్లో పాల్గొన్నా ఆడపిల్లలు వాటిలో ప్రవీణత చూపే అవకాశం లేదు, ఏ పరిస్థితిలోనూ ఆడతనానికి భిన్నం కాకుండా ప్రవర్తించాలి ఏది చేయాలో ఏది చేయరాదో నిర్దేశిస్తారు తండ్రి కంటే తల్లి ఎక్కువగా శాసిస్తుంది పిల్లలను కనడం పోషించడం బాధ్యతగా ఆడపిల్లలకు బోధిస్తారు

పెద్దల మాదిరి బాధ్యత పంచుకోడానికి ఆడపిల్ల వేనకాడదు సరికదా ముచ్చట పడుతుంది తండ్రి బాధ్యతగా ప్రవర్తించడానికి కొడుకుకు చాలా కాలం పడుతుంది కానీ ఆడపిల్ల తల్లి బాధ్యతగా ఉండడానికి పద్నాలుగేళ్ళ వయసు వచ్చే సరికి సిద్ధపడుతుంది ఆడపిల్ల ఎదుగుతున్న కొద్దీ పురుషుని ఆధిక్యత ఒప్పుకోక తప్పదు, తల్లి ఇంటి సంగతులు అన్నీ చూస్తున్నా అది తండ్రి అజ్ఞాను సారమే జరుగుతుందని అతనికి కోపం తెప్పించరాదని తెలుసుకుంటుంది తండ్రి సహజంగా కూతురును ఎక్కువగా ప్రేమిస్తాడు ఆ ప్రేమతోనే ఆడపిల్ల తృప్తిగా జీవితం సాగిస్తుంది, కానీ తనకంటే చిన్నవాడైన తమ్ముడు కూడా తండ్రితోపాటు స్వేచ్ఛా అధికారాలు కలిగి ఉండడం అమ్మాయికి అసూయ, పురాణగాథ విన్న చరిత్ర చదివిన మగవాడి శౌర్య ప్రతాప సాహస గాథలే ఉన్నాయి ఆడవాళ్ళ సంగతి ఎక్కడా కనిపించదు ఒకవేళ కనిపించినా పతిసేవ పారాయణులై లేక దాసిగానో ఉన్నట్లు వ్రాయబడి ఉంటుంది భర్త లేని స్త్రీ కి సాంఘిక విలువ లేదు తల్లి ప్రస్తావన ఎక్కడ ఉండదు కొన్ని కులాల్లో తండ్రిని పూజించే ఆచారం ఉంది పురుషులు ప్రపంచాన్ని నడిపిస్తారని అన్ని సంఘటనలు రుజువు చేస్తాయి రాజకీయాల దగ్గరనుంచి ప్రవీణతా ఘనత పురుషులకే ఉంటుంది మతం కూడా పురుషుల అధిక్యతనే సూచిస్తుంది దేవతల్లో ఎక్కువమంది మగవారే మతాచార్యులు కూడా మగవారే అందుచేత స్త్రీ చిన్నప్పటినుంచి పురుషుడిని ఆరాధించడం అలవాటు పడుతుంది

ఈ ఆరాధన కేవలం తాను ప్రవృత్తిగా భావించక పోయినా యుక్తవయస్సు వచ్చిన తర్వాత మగవారి స్పర్శ పరిచయం శరీరంలో ఒక విధమైన ఉద్రేకం రెచ్చగొడుతుంది వంచిన తలతో సిగ్గుతో మొహానికి చేతులు అడ్డం పెట్టుకుని మగవాని చేతిలోకి జారి పోతుంది ఆ స్పర్శతో స్వర్గ సుఖాలు ఊహించుకుంటుంది సుఖంగా ఉండాలంటే ప్రేమించబడాలి అనుకుంటుంది తనకోసం ప్రియుడు యుద్ధం చేసి రక్షించాలి గదిలోనో గుహలోనో  కట్టివేసి ఉంటే ఎవరో బాధపడుతూ ఉంటే తనను రక్షించాలి ఈ విధంగా అమ్మాయి ప్రియుని గురించి కలలు కంటుంది ఈ విధంగా ఈడొచ్చిన అమ్మాయి కలలు కంటూ ఎప్పుడు పురుషుని మేప్పించాలని మార్గాలు అన్వేషిస్తూ ఉంటుంది సామాన్యంగా స్త్రీ శరీరం రూపము మాత్రమే చాలామంది చూస్తారు పురుషుడు లభించగానే అతనికి లొంగిపోయి సర్వస్వం అర్పిస్తుంది ఒక అమ్మాయి నాతో ఇలా అంది "నేను పురుషుడిని ఆకర్షించి అతని రక్షణ పొంది ప్రేమతో కాలం గడిపి అతని చేతిలో చనిపోవాలి అది నా కోరిక" అని

ఇంకా ఉంది....

తాజ్
పల్లెటూరి పిల్లోడు

నోట్ : ఇది నా నిజ జీవితంలో నాకు ఎదురు పడ్డ పాత్రల రూపమే తప్ప ఏ వ్యక్తులు వ్యవహారాలకు కించపరచడం కాదు అలా ఎవరికి ఇబ్బంది కలిగిన క్షంతవ్యుడను 🙏


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...