స్త్రీ ఆంతరంగికము (తృతీయ భాగము)

 








స్త్రీ ఆంతరంగికము...


భర్త తనకన్నా గొప్పవాడు అన్న భావం స్త్రీకుంటేనే సంసారం నిలబడుతుంది పురుషుడు స్త్రీని రెచ్చగొడతాడు ఆకర్షిస్తాడు అనుభవించి వదిలేస్తాడు అలా వదలని వాడు దేవుడిలా భావిస్తుంది, పెళ్లికాకముందు తనకు నచ్చిన దేవుడు లేదా సినిమా నటుడి బొమ్మను తన దగ్గర పెట్టుకొని వాళ్ళు తన వారైతే ఎలా ఉంటుందో ఊహించుకుంటుంది అలా అందని మగవాడిని దృష్టిలో పెట్టుకోవడం తన ప్రేమ ఆలోచనలను కేంద్రీకరించడం వల్ల ప్రమాదం లేదు ఏ పర పురుషుని మీద దృష్టి పడి అది త్వరగా సాఫల్యానికి వస్తే విషాద పరిణామాలకు దారి తీయవచ్చును ఊహజనితమైన ప్రేమ, ఆలోచనలో ఉన్న ఆనందము, నిజ జీవితంలో దొరకక పోవచ్చు కానీ ఆ ఊహల లో పరిపక్వమైన స్త్రీ పెళ్లి చేసుకోవడం జరిగితే చక్కని గృహిణిగా ఉంటుంది భర్తకు విధేయురాలిగా తన కలలకు రూపమిచ్చిన దేవునిలా చూసుకుంటుంది.


చేరని ప్రేమలేఖలు, బయటకు చెప్పని ప్రియ వచనాలు ఇచ్చే మధురానుభూతి గొప్పది తనకు ఏనాటికైనా మగవాడు అవసరం తనంతటి దాన్ని ఆకర్షించాలంటే ఆ మగవాడు తప్పక గొప్పవాడు అయి ఉంటాడు తను అదృష్టవంతురాలు అని స్త్రీ భావించాలి, కొందరు అమ్మాయిల మనస్తత్వం చిత్రంగా ఉంటుంది తను పెరిగి పెద్దదయింది ఇక అమ్మ నాన్న అన్నదమ్ములు తనని సరిగా చూడరు లోకంలో దుష్టులు, దుర్మార్గులు, ద్రోహులు, కష్టసుఖాలు ఎన్నో ఉంటాయి వాటిని అన్నింటికి మించి సుఖపడాలి అంటే మంచి వీరుడు, సాహసవంతుడైన మగవాడు ఆధారంగా దొరకాలి అనుకుంటారు, దానికి తోడు జానపద గాథలు, హత్య, నేరపరిశోధన చిత్రాలు, అందులో కథానాయకుల వీర ప్రతాప, శౌర్య ప్రకటనలు చూసి అలాంటి మొగుడు కావాలని కోరుకుంటారు.


అస్తమానం తన తప్పులు వేలెత్తి చూపి వేళాకోళం చేసే మొగుడు దొరికిన అమ్మాయి అవస్థ వర్ణనాతీతం తన తప్పులను దిద్ది సన్మార్గంలో పెట్టె మొగుడి పట్ల ఈమెకు గౌరవం హెచ్చు, అలా కాక తనను అగౌరవపరిచే మొగుడు త్వరగా చనిపోతే మరొకరితో కొంతకాలమైనా సుఖ పడవచ్చు అనుకుంటుంది భార్య.


మరికొంతమంది తనపై అధికారం చెలాయించే భర్తనే కోరుకుంటారు తన తప్పులు చూపి, కొట్టి, అల్లరి చేసినా భర్తలపై ఎంత మాత్రము కోపం ఉండదు, బాధ పెడుతున్న కొద్ది ప్రేమ ఎక్కువ అవుతుంది కారణం మగసిరిగల మగవాన్ని కోరుకోవడం స్త్రీ సహజ లక్షణం అంటే ఏ ఆడదైనా మగవాడు బలశాలి, ధైర్యశాలి, తనను అదుపులో పెట్టుకోగలవాడే మగాడు అలాంటి వాడు కావాలని కోరుకుంటుంది అలా తగిన మగాడిని వెతుక్కున్న ఆడదాని జీవితం స్వర్గం.


మరికొంతమందికి ఎంతో ప్రయత్నించి తగిన ప్రియుని వరుడుగా పొందాలని తాపత్రయం తమకు నచ్చిన యువకునిపై దృష్టి నిలిపి ఆకర్షించటానికి ప్రయత్నిస్తారు అలాంటప్పుడు పురుషుడు కొంచెం బెట్టు చేయాలి అబ్బ! నేను ఎంత కష్టపడ్డాను ఆయనను నా వాడుగా చేసుకోవడానికి అన్న గర్వం దక్కాలి, అమ్మాయి చూడగానే చల్లబడి వెంటపడితే ఆ అమ్మాయి తను పొరపాటు పడినట్లు ఊహించుకొని భయపడుతుంది


మరి కొంత మంది స్త్రీలు స్తిరచిత్తం లేక బాధపడే మగవాన్ని కోరుకుంటారు తాము వారిని పెళ్ళాడి ఒక దారికి తెచ్చి మంచివాడుగా సంస్కరించాలని మిగతా స్త్రీలకది చేత కాలేదని ఊహించుకుంటారు అలాంటి వారి కోసం వెదికి పట్టుకొని వెంట పడతారు అందుకే ఏ మనిషి గురించి అయినా అమ్మాయిల ముందు అంత మంచిగా అంత చెడ్డ గా చెప్పరాదు అంటారు పెద్దలు


ఆడపిల్లలది విచిత్రమైన ప్రకృతి మగవాడు కావాలి తన ఇష్ట ప్రకారం నడిచేవాడు కావాలి తనను అదుపులో పెట్టుకోవాలి తను ఎంత చెబితే అంత ఎంత చూపితే అంత అంతకుమించి అడిగేవాడు పనికిరాడు రెచ్చగొట్టడానికి స్త్రీ ప్రయత్నిస్తుంది రెచ్చగొట్టబడిన మగవాడు తన దగ్గరికి వస్తే అసహ్యించుకుంటుంది, మగవాడు ఎక్కువ స్వతంత్రం తన దగ్గర తీసుకోరాదు.


సాహసించి ముందుకు వెళుతుంది తీరా కోరికలు బాగా ఎక్కువైతే సిగ్గుతో కుంగిపోతుంది, నవ్వుతుంది, వెంటనే చిరబురలాడుతుంది, చూస్తుంది, తలవంచేసుకుంటుంది, ముద్దు పెట్టుకుంటే సంతోషపడుతుంది, మళ్లీ ముద్దు పెట్టుకోబోతే చేయి అడ్డం పెడుతుంది, రమ్మన్న చోటికి వస్తుంది, వచ్చి ఆగిపోతుంది, వచ్చేదాకా వున్న ఉత్సాహం తగ్గి భయం సిగ్గు పుట్టుకొస్తుంది ఇలాంటి ద్వంద వ్యక్తిత్వం పెళ్ళికాని పిల్లలకు ఉంటుంది అవునని, కాదని తనే అంటుంది స్త్రీ తత్వం తెలియని పురుషుడు దిగ్భ్రాంతి చెందుతాడు, మగవాడు కావాలి కానీ మగవాడికి తను బలి కాకూడదు ఈ విధమైన భిన్న తత్వాలతో అమ్మాయి ఆలోచనలు నడుస్తుంటాయి ఇంత నిశిత దృక్పథం ఒక్కోసారి అమ్మాయిని యువకునిపై రోత పుట్టించేస్తుంది, పెళ్లి, అనుభవం ఉన్నవారు ఆడపిల్లల పట్ల అసహ్యంగా ప్రవర్తించరు వాళ్లను ప్రేమిస్తే జీవితం హాయిగా ఉంటుందని ప్రేమించే అమ్మాయిలు కొందరు ఉన్నారు కోరికకు మనసుకు వ్యతిరేకమైన భావాన్ని వ్యక్తపరచడం అమ్మాయిలకు అలవాటు.


ఈ వయసులో వెకిలిగా నవ్వడం ఇతరుల గురించి వేళాకోళంగా చెప్పుకోవడం కనబడే వాళ్లని వెక్కిరించడం అలవాటు, మాటలు కత్తి కంటే పదునైనదిగా వదులుతారు అందరిని తీసిపారేసినట్టు మాట్లాడుతారు ప్రత్యేకించి మగవాళ్ళను చులకనగా మాట్లాడుతారు కారణం ఏమిటంటే ఆ మగవాడి ప్రభావం తన మీద పడకుండా రక్షించుకోవడం కోసం, మగవాడి మీద అసహ్యం పుట్టించు కోవడం కోసం అలాగే మాట్లాడతారు వాళ్ల మనసులో ఎలాంటి కోరికలు ఉంటే అలాంటి దాన్ని ఇతరులకు ఆపాదించి తృప్తి పొందుతారు.


బుర్ర బద్దలు కొట్టుకొని నిద్రమాత్రలు మింగి తనకు తానే హింస పెట్టుకొని చస్తాను కానీ నీకు లొంగను అని స్త్రీ అంటుంది,

పంజరంలో చిలక పారిపోవడానికి ప్రయత్నించకుండా అందులోనే ఉండి గిలగిల కొట్టుకునే విధంగా ఆడది బయటికి పోవడానికి ప్రయత్నించకుండా ఆ పంజరంలోనే గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది, తను పురుషులకు లొంగకూడదు, అయినా తనకు పురుషుడు కావాలి, సాహసం చేయకూడదు, చేస్తే కానీ దొరకడు, వయసులో పెద్దది కావడం ఇష్టం ఉండదు, అయినా చిన్న పిల్లగా ఉండడానికి ఒప్పుకోదు, పాత జీవితం మరిచిపోతుంది, కొత్త జీవితానికి అలవాటు పడదు, ఎప్పుడూ హడావిడిగా ఉంటుంది, పని ఏమీ చెయ్యదు, చేయడానికి ఏమీ ఉండదు, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంది, జరుగుతున్న జీవితం సంతృప్తికరంగా ఉండదు, తను జీవిస్తున్నది కథా, కలా, విషవలయమా, మగవాడి నిరంకుశత్వమా అని వాపోతూ ఉంటుంది, పదిహేను ఏళ్ళ ఆడ పిల్ల బుర్రలో ఇన్ని రకాల ఆందోళనలు ఉంటాయని మీలో ఎప్పుడైనా ఆలోచించారా? ఆశ, నిరాశ, కోపం, తాపం, భయం, ధైర్యం వీటి మధ్య గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది నిరాశ, నిస్పృహతో చేయరాని పనులు చేస్తుంది.


స్త్రీ చేసే ఈ వెకిలి చేష్టలు అన్నింటిని పురుషుడు సమర్థించి సానుభూతి చూపించి లొంగదీసుకుని అనుభవించి వదిలేస్తాడు పై చెప్పిన అమ్మాయి పెంకిది అనక ఇలాంటి అబ్బాయి సులువుగా అణచి వేయగలగాలి ప్రేమ, ఆదర్శం, అభిమానం, విశ్వాసం ఎన్నో నమ్మకాలు పెట్టుకొని గర్వముతో పురుషులను చులకనగా చూసే అమ్మాయిని కొంచెం ఓపిక పట్టి వదిలేస్తే ఆ తర్వాత చచ్చిన పాము వేలాడుతుంది, చిలిపితనం పోయి సిగ్గు తనను గురించి చులకన భావం ఆ అమ్మాయి మనసులో ఆవరిస్తుంది తన స్థిరత్వం తన మానసిక దౌర్భాగ్యం పురుషులకు ఆపాదించి దూషిస్తుంది, తన సంగతి తన వాళ్ళందరికీ తెలుసు గనుక అందరూ అసహ్యించుకుంటారు ఎవరు దగ్గరికి చేరరు అనుకొని కొత్తగా వచ్చిన మగవారు ఎవరైనా ఉంటే వారిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు.


ఈ వయసులో ఆడపిల్లలకు స్నేహితురాండ్రు కూడా శత్రువులుగా, అసూయ పరులుగా కనిపిస్తారు అన్ని తనకు కావాలని అవస్థ పడుతుంది తనదంటూ ఏమీ లేదు అని భయపడుతుంది, మగవాని సంతోషం కోసం తన కోరికలన్నీ వదులుకోవాలని మరొకవైపు అనుకుంటుంది ఈ విధమైన మానసిక సంక్షోభం స్త్రీలో చక్కని మార్పు అనుభవం తెచ్చుటకు చక్కని అవకాశం ఉన్నది ఎదుటివారి మనసుకు సంతృప్తిపరిచే సమాధానాలు చేష్టలు, అబ్బుతాయి, ప్రకృతి పుస్తకాలు, పూలు, బొమ్మలు వీటి మీద ఆసక్తి పెరుగుతుంది అందం గురించి ఆలోచించడం జరుగుతుంది తాను లొంగకుండా పురుషుని కోరిక తీర్చాలి అనుకుంటుంది, నమ్రత, సర్దుబాటు లక్షణాలు అలవర్చుకుంటుంది.


తను ప్రేమించబడాలని కోరుకుంటుంది ప్రేమను అర్థం చేసుకోవడానికి అతని అభిమతం కోసం నడుచుకోవడానికి ప్రయత్నిస్తుంది అందంగా ఆకర్షణీయంగా అలంకరించుకుంటుంది పురుషుడికి లొంగినా తనదే పై చేయిలాగ పురుషుడే కోరి వచ్చినట్టు అమ్మాయి అభిప్రాయం పెంపొందించుకుంటుంది అనుకున్న సమయానికి అబ్బాయి రాకపోతే రోజూ కనిపించే సమయానికి రాకపోతే రాలేదే అని బెంగ పెట్టుకుంటుంది అలా చూస్తూ ఉండి పోతుంది అబ్బాయి రాగానే తటాలున తలుపు వేసుకుంటుంది.


గొప్పకోసం పది మందిని ఆకర్షించడం కోసం అందరి పనులు నెత్తిన వేసుకొని చేస్తుంది అన్ని పనులు సమర్థంగా నిర్వహించ గలదు అని పేరు తెచ్చుకుంటుంది ప్రేమ కోసం తాపత్రయ పడి అది లభ్యం కాకపోతే ప్రేమ కథల చిత్రాలు చూస్తుంది ఇతరుల మనసు స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది ప్రపంచమంతా కళకళలాడుతున్నట్లు అనిపిస్తుంది పిల్ల గాలి, పచ్చని మొక్క, ఎర్రని గులాబి, సంధ్యా సమయంలో సూర్యుడు, శరద్రాత్రులు లాంటి దృశ్యాలు ఊహించుకుంటుంది.


ఇంటి పనుల పై శ్రద్ధ క్రమంగా తగ్గడం మొదలుపెడుతుంది తల్లిదండ్రుల ఇల్లు తనది కాదు ఆ ఇంట్లో తన పెత్తనం ఉండదు అనవసరంగా చాకిరీ చేయాలి, ఇన్నాళ్ళు నేర్చుకున్న పని చాలు అనుకుంటుంది అమ్మ అధికారం సహించదు తల్లి తనకు పోటీగా ఉన్నట్లు భావిస్తుంది, బయట ఉద్యోగం చేస్తున్న అమ్మాయి ఇంటికి రావాలని అనుకోదు కారణం ఇంట్లో తనకు ప్రత్యేక స్థానం లేదు అందరిలాగా తను ఇన్నాళ్ళు ఎదుగుతున్న శరీరంమీద ఉన్న అసహ్య భావం తగ్గి మమకారం అభిమానం పెరుగుతుంది కొంతమంది స్త్రీలకు ఎంత వయసు వచ్చినా పసి పిల్లల మనస్తత్వం పోదు తన చుట్టూ ఎంతమంది ఉన్నా అమ్మాయికి అవసరం లేదు తనను కోరి తనతో జీవితం పంచుకోగల ఒక వ్యక్తి తన పక్కనుంటే చాలు.


అయినా అందరి జీవితాలలో చక్కని మగమహారాజు ప్రవేశించి ఇదివరకు ప్రేమ అని ఆలోచించేవన్ని ఇప్పుడు స్థిరత్వం కావాలి తనని పెళ్లి చేసుకొని ఒక సముచిత స్థానం ఇవ్వాలి అని నా ఉద్దేశం ఆడపిల్లలు ఒక రోజు కాకపోయినా మరొక రోజైన తమ లైంగిక ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు అది వారికిగల అవసరాలను గడిచిన రోజుల అనుభవాలు, చదువు, సాంప్రదాయము మీద ఆధారపడి ఉంటుంది, ఇప్పటిదాకా స్వతంత్ర భావాలు ఆలోచనలు ఊహలతో యవ్వనంలో ప్రేమించింది అమ్మాయి, మరో కొత్త స్థితిని లైంగిక వాంఛ అనే నా తదుపరి భాగంలో చర్చిద్దాం.


ఇంకా ఉంది.....


తాజ్ 

పల్లెటూరి పిల్లోడు


నోట్ : ఈ రచన పూర్తిగా నా వ్యక్తిగత జీవితములో ఎదురుపడిన కొన్ని సంఘటనలు కొందరు పెద్దల మాటల సారమే తప్ప ఎవరినీ కించపరచడం నా ఉద్దేశ్యం కాదు ఎవరినైనా నా ఈ రచన ఇబ్బంది కలిగిస్తే క్షేమించ ప్రార్థన..🙏



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...