ప్లవ నాయకి (The Love)..!








ప్లవ నాయకి (The Love)..!

చెప్పనా చెలి! నీతో ఓ మాట చెప్పనా?
ఆలన, నీ పాలన నాదిగా చెప్పనా
కలువ కన్నులు నీవి, కాదనగలరా ఎవరైన
సర్వ దేవతలు నీ దాసులని ఒప్పక తప్పునా.....!

హిమల పవనములే కదిలి వచ్చి, నీ కురులను ముడవగా
తొలకరి జల్లుల తడిసిన నేల, వీచే గంధం నీ మేనుకు అద్దగా
గట్టి భూమిలో మెత్తటేరులు పొరలు కోయును, నీ కోపం
మత్తడి తెగి ముంచకుండ కట్టవేయును, నా మది భాగం

నీ కోపమే సంద్రమైన, నావికుడినై నేనోస్తా
నీ మనసు గీటీ కవ్విస్తా, నీ ప్రేమ పొంది గెలిచోస్తా
వెన్నెలనే రాట్నమలికి తెల చీరగ తెచ్చిస్తా
మేఘాలను పూలు చేసి నీ కొప్పున ముడిచోస్తా

చెందురునే పట్టి తెచ్చి నీ అరికాలికి చుక్కెడతా
సూర్యుడిని తోలుకొచ్చి నీ గుమ్మంలో గుమ్మడిగా నిలబెడతా
పంచ భూతాలు నీ వాకిటిలో, నవగ్రహాలు నీ కనుసన్నలలో
ఈ జగతిని శాశించగ లేవా, భారతావనికి మహరాణివి కావా
నా మది సింహాసనం అలంకరించి నవ నాయికగా వెలగవా.....!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...