పోస్ట్‌లు

మే, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి...!

చిత్రం
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి...! సమ్మోహన పవనాలు కమ్ముకున్న తిమిరాలు పడిలేచే అలల విహంగాలు నిష్క్రమించు అరుణ కిరణాలు ఆవేళ జాలరినై నే వల వేయగ ఓ పడుచు పిల్ల కానవచ్చే ఓ కలలాగ నను తాకగా వచ్చే నా మది నిండుగా పొంగినోచ్చే నవ్వులీను అధరాలు ముత్యాలా నయనాలు వగలు రువ్వు వొంపులు సుధలు రాలు కెంపులు కురులు అగరొత్తులు సిగలో పూ గుత్తులు మెడలో తారల జిలుగులు నడుముకు నాదు రెక్కలు నా గుండెను తట్టే ఆ పాద పట్టీలు నా కేశాలే నీ విసన కర్రలు నా నేత్రాలే నీ పాదరక్షలు నా గాత్రాలు నీకు జోల పాటలు నీ మనసంతా చల్ల దొంతులు నీ జతలో ఎన్ని పండుగలు నీ నడవడిలో ఎన్ని పాఠాలు నీ ఒడిలో పడగ పుణ్యాలు ఆ బ్రహ్మదేవుడే ఎదురొచ్చి నా దేవి నువ్వంటూ దీవించి నిండు నూరేళ్లు నాకందించి నిన్ను ఏలుకోమని శాసించే అరమరికలు లేకుండా ఆలుమగలుగా పాలు నీళ్ళలా ఒకరిని విడువక ఒకరుంటూ జీవించండి చివర కంటూ జత కూడమని వరమిచ్చే జగాలే జయహో అన్నమాట వినవచ్చే..! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

పెళ్ళాం ఊరెళితే..?

చిత్రం
  ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్ళకూ...! అమ్మి నాకియ్యల సెలవు ఒరయ్యో నాకియ్యాల సెలవు ఇది ఎన్నడు వినని పదము అంటుంటే బాగుందే స్వరము తోలిచేను మనసును మెదడు తడిమెను జెబును అగడగడు సినిమాకు పోతే బెటరు ఎక్కేస్తా జెల్దిన స్కూటరు పట్టెను భాగ్యము నుదురు తిరిగొస్తా తెలియని బజారులు..! కుషాల ఉంది మనసు తెగ హుషారుగుంది వయసు ఇరుపక్కల చూస్తే సొగసు హూ కొడితే అవుతా రివర్సు ఇదేమి బుద్ది అనకు....🧖 నాకియ్యాలా చుట్టి అని నీవు మరువకు చికెన్ తెచ్చిన మటన్ తెచ్చిన చూడు అరె బ్రాందీ కీసల ఉడక పెట్టిన మాడు కడుపునిండ తిని గురుక పెట్టితే నేడు ఇన్ని రోజులకు సందు దొరికే నాది తీడు నాది తీడు నాది తీడు మామ..........🤙                                       రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు నోట్ : ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్ళకూ (పెళ్ళాం ఊరెళితే) మొగుడు అతని ఆర్భాటం ఇదేనేమో...😀

వీడుకోలు వేడుక (Happy Trails)

చిత్రం
  వీడుకోలు వేడుక ( Happy Trails ) అజ్ఞానపు పందెరాన్ని తొలగించే తరుణాన విజ్ఞానపు దిపాలై వెలుగునిచ్చే మందిరాన వరుణునిలా జాలిపంచు ఆత్మీయపు స్నేహన తరుణునిగా తోడు నిలుచు అనుబంధపు నీడన సత్సంభంద భాందవ్యపు తీపి రుచులు చూసాము సోదరి సహోదర భావాన సంతృప్తిగా మసిలాము ఒడిదుడుకుల గాడి దారి బడి చేరగ కుదురుకుని తడి కన్నుల తడుముకుని తన్మయంగ తేరుకుని మిము వీడే వేడుకను కనులింపుగ నింపుకుని జ్ఞాపకాల పూగుత్తుల బహుమతులను పంచుకుని తరలిన ప్రతి దారులన్నీ విజయాలను నింపుకుని నూరేళ్ళు నిలిచిపోవు కిర్తులెన్నో అందుకుని స్పూర్తినిస్తూ నడిచాము సూత్రప్రాయంగా కదిలాము మిత్రులారా నేనుంటా....🙋 మీరోదిలిన గురుతులన్ని గుండెల్లో దాచుకుంటా....! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు ఈ విద్యా సంవత్సరం ముగించుకుని ఆ పై తరగతులకు వెళ్ళే విద్యార్థులకు, విద్యార్జన ముగించుకుని కోరుకున్న గమ్యం వైపు సాగే ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలు తెలుపుతూ అల్ ది బెస్ట్.....

సౌందర్య గళార్చన...!

చిత్రం
  సౌందర్య గళార్చన...! ప్రియా...... సుందర కాంతులీను సుమప్రభ నిన్ను చూడనే తొలగు నీడ, పీడ నిన్ను పలకరించిన చాలు జన్మకిగ నిన్ను చూసిన నా కన్నులలో కళ నిన్ను తాకగానే ఒళ్ళు పులకింతలే భళ కందిరీగ నడుము, కాంతులీను ముదము నున్ననైన బుగ్గ, దొర మామిడి మొగ్గ వెన్నెలోలే కన్నులు, కన్నులే కావు మొల్లలు తామరాకు మోము, తాయిలాల పెదవి ముద్దు ముద్దుకు తీపి తేనెలేవూరు ఒంపులూరు కెంపు కన్నుల్ల నిండు నిద్రమాని తనువు ఊల్లేళ్ళ తిరుగు హృదయమంత అలిగి నీ కొరకు వెదుకు అల్లతారకల్లే ఇలన నెమలి మల్లె చిలుకు తొలకరి జల్లు, నొచ్చు తీయగ ముళ్ళు మల్లె తోపులోన అలరారే చెమ్మ కన్నెలెందరికన్న తీరైన కొమ్మ తనువంత తన ప్రేమ నిండుగా పండెను కలలాంటి జీవితం రంగులే నిండెను.....! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు