సౌందర్య గళార్చన...!

 

సౌందర్య గళార్చన...!

ప్రియా......
సుందర కాంతులీను సుమప్రభ
నిన్ను చూడనే తొలగు నీడ, పీడ
నిన్ను పలకరించిన చాలు జన్మకిగ

నిన్ను చూసిన నా కన్నులలో కళ
నిన్ను తాకగానే ఒళ్ళు పులకింతలే భళ
కందిరీగ నడుము, కాంతులీను ముదము
నున్ననైన బుగ్గ, దొర మామిడి మొగ్గ

వెన్నెలోలే కన్నులు, కన్నులే కావు మొల్లలు
తామరాకు మోము, తాయిలాల పెదవి
ముద్దు ముద్దుకు తీపి తేనెలేవూరు
ఒంపులూరు కెంపు కన్నుల్ల నిండు

నిద్రమాని తనువు ఊల్లేళ్ళ తిరుగు
హృదయమంత అలిగి నీ కొరకు వెదుకు
అల్లతారకల్లే ఇలన నెమలి మల్లె
చిలుకు తొలకరి జల్లు, నొచ్చు తీయగ ముళ్ళు

మల్లె తోపులోన అలరారే చెమ్మ
కన్నెలెందరికన్న తీరైన కొమ్మ
తనువంత తన ప్రేమ నిండుగా పండెను
కలలాంటి జీవితం రంగులే నిండెను.....!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...