ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి...!








ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి...!

సమ్మోహన పవనాలు
కమ్ముకున్న తిమిరాలు
పడిలేచే అలల విహంగాలు
నిష్క్రమించు అరుణ కిరణాలు

ఆవేళ జాలరినై నే వల వేయగ
ఓ పడుచు పిల్ల కానవచ్చే
ఓ కలలాగ నను తాకగా వచ్చే
నా మది నిండుగా పొంగినోచ్చే

నవ్వులీను అధరాలు
ముత్యాలా నయనాలు
వగలు రువ్వు వొంపులు
సుధలు రాలు కెంపులు

కురులు అగరొత్తులు
సిగలో పూ గుత్తులు
మెడలో తారల జిలుగులు
నడుముకు నాదు రెక్కలు

నా గుండెను తట్టే ఆ పాద పట్టీలు
నా కేశాలే నీ విసన కర్రలు
నా నేత్రాలే నీ పాదరక్షలు
నా గాత్రాలు నీకు జోల పాటలు

నీ మనసంతా చల్ల దొంతులు
నీ జతలో ఎన్ని పండుగలు
నీ నడవడిలో ఎన్ని పాఠాలు
నీ ఒడిలో పడగ పుణ్యాలు

ఆ బ్రహ్మదేవుడే ఎదురొచ్చి
నా దేవి నువ్వంటూ దీవించి
నిండు నూరేళ్లు నాకందించి
నిన్ను ఏలుకోమని శాసించే

అరమరికలు లేకుండా
ఆలుమగలుగా పాలు నీళ్ళలా
ఒకరిని విడువక ఒకరుంటూ
జీవించండి చివర కంటూ
జత కూడమని వరమిచ్చే
జగాలే జయహో అన్నమాట వినవచ్చే..!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...