వీడుకోలు వేడుక (Happy Trails)

 

వీడుకోలు వేడుక (Happy Trails)

అజ్ఞానపు పందెరాన్ని తొలగించే తరుణాన
విజ్ఞానపు దిపాలై వెలుగునిచ్చే మందిరాన
వరుణునిలా జాలిపంచు ఆత్మీయపు స్నేహన


తరుణునిగా తోడు నిలుచు అనుబంధపు నీడన
సత్సంభంద భాందవ్యపు తీపి రుచులు చూసాము
సోదరి సహోదర భావాన సంతృప్తిగా మసిలాము

ఒడిదుడుకుల గాడి దారి బడి చేరగ కుదురుకుని
తడి కన్నుల తడుముకుని తన్మయంగ తేరుకుని
మిము వీడే వేడుకను కనులింపుగ నింపుకుని
జ్ఞాపకాల పూగుత్తుల బహుమతులను పంచుకుని

తరలిన ప్రతి దారులన్నీ విజయాలను నింపుకుని
నూరేళ్ళు నిలిచిపోవు కిర్తులెన్నో అందుకుని
స్పూర్తినిస్తూ నడిచాము సూత్రప్రాయంగా కదిలాము

మిత్రులారా నేనుంటా....🙋
మీరోదిలిన గురుతులన్ని గుండెల్లో దాచుకుంటా....!

రచన : తాజ్
పల్లెటూరి పిల్లోడు

ఈ విద్యా సంవత్సరం ముగించుకుని ఆ పై తరగతులకు వెళ్ళే విద్యార్థులకు, విద్యార్జన ముగించుకుని కోరుకున్న గమ్యం వైపు సాగే ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలు తెలుపుతూ

అల్ ది బెస్ట్.....



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నేస్తాలు....!

ఒంటి నిట్టాడు గుడిసె

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...