పోస్ట్‌లు

సెప్టెంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

మరణించినా మరచిపోలేని ప్రేమను నేను...! (తిరస్కరణ)

చిత్రం
  ఎడారిలో సంద్రం లా నీ ప్రేమ ధార పొంగిందని అది ఆ క్షణం అమృతమై నన్నింతకాలం ఓదార్చిందని నా ' నీ ' అను పదాలు మాసిపోయి మన అను భందమేదో నెలకొని ఇల నన్ను నిలిపిందని నీకు నే అనేకానేక మార్లు విన్నవించాను నినదించాను, నివేదించాను నీ ప్రేమ వర్ష ధారల తడిసి మోడు నా మనసు పులకించిందని పూ రేకులా వికసించిందని నీకు తెలిపాను, తేటతెల్లం చేశాను అర్హత లేని అలగా వానిగా ఈనాడు నీ ముందు కూలపడ్డాను ఆసరా అందించే ఆపన్న నీ హస్త బంధాన్ని అశ్రు ధారలతో ఆలింగనం చేయాలనుకున్నా నా అభిలాషను నిజం చేయాలనుకున్నా నిన్ను దూరం చేసుకుని తెరచాప కూలి, చుక్కాని విరిగి ఒళ్లు చిల్లులు పడిన నావలా గమ్యం మరిచి రేవును విడిచి నీ ముందు దీనంగా కూర్చున్నాను గత్యంతరం లేక కాలగతిలో కరిగి తరిగి చిరిగి మునిగిపోతున్నాను ఒక్కసారి నిన్ను చూసి కన్ను మూయాలనే ఆలోచనలో ఉన్నాను..! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు (అనే అక్షరం అక్షయమై నిలిచింది)

చిత్రం
  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు (అనే అక్షరం అక్షయమై నిలిచింది) కల్వకుంట్ల వంశానికి కీర్తి పతాకమై రాఘవరావు వెంకటమ్మ కలలకు రూపానివై చంద్రుడల్లే గోచరిస్తు ఒడిలో నువు చేరావు కన్నతల్లి దీవెనతో మా గతిని మార్చ కదిలావు చంద్రశేఖరుడను నామంతో చిరంజీవివయ్యావు అరవయ్యేళ్ళ గోస చూసి రుద్రుడల్లే రగిలావు పరాయి పాలనపై కళ్లునురిమి ఉరికావు అయ్యోనివా పాలోనివిరా బై అని అడిగి కడిగేసావు ప్రో.జయశంకర్ సార్ ఆశయాల శిష్యుడవై రాజకీయ శక్తితోనే స్వరాష్ట్రం సాధ్యమని తెలంగాణ రాష్ట్రసమితి స్థాపనకై కదిలావు మలి తెలంగాణ ఉద్యమానికి రథ సారధివయ్యావు చలిచీమల దండువోలె సబ్బండ వర్ణాలను పోగేసి విషనాగుల తరుముటకై జంగుసైరన్ మోగించావు సకల జనుల తరుముటకై జంగుసైరన్ మోగించావు కవి గాయకులతో చేరి చలో ధూంధాం అని గర్జించావు గొచి ఊడపికి మరి సరిహద్దులు దాటించావు స్వరాష్ట్రమా కల కాదు కదా! అని విస్మయం కలిగిస్తూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమని సగర్వంగా వినిపించావు హృదయ సింహాసన డోలిపై ముఖ్యమంత్రివయ్యావు ఈ రోజుకు మా జీవితాల్లో నవ్వు పూవు చేరింది ప్రతిదినం పండగల్లే ఇల్లు వాకిలి పూసింది వర్ధిల్లు దైవమా, ఉద్యమ జోహార్లు నాయకా.. నా

దొంగ సొమ్ము..⚖️ (గూట్లో ఉంది)

చిత్రం
  దొంగ సొమ్ము.. ⚖️ (గూట్లో ఉంది) జీవిత పరమార్ధం ఇదేనా, దొంగిలించి దాచుడెనా మానవ జన్మ విధాత చేతిలో మరల బొమ్మ అలరించేది, ఆడించేది అంతా వాడయినపుడు లోభిగ మారి చేసేదెంటి నల్లధనం తో వెలిగేదెంటి దేశ సంపదకు రెక్కలు కూర్చి పరదేశానికి పరుగున చేర్చి ఏన్ని బ్రతుకులు కూల్చావో ఏన్ని ఆశలు రాల్చవో దొరికిన వాడు దొంగంటారు దొరకక పోతే రాజవుతాడు ఏదో నాడు దొరక్కపోరు రోడ్డున పెట్టి ఉమ్మకపోరు అన్ని తెలిసిన భారత ప్రభుత్వం అడుసుగనే అది చూసిన కాలం ప్రజలు ఊరికే ఉండరు సుమ్మి బట్టలు పీకి తంతరు తమ్మి...! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

నీ భారతాన్ని హాత్తుకో, నీ జానతనం దాచుకో..!

చిత్రం
  పాశ్చాత్య  సంస్కృతి (Fashion) అంతరించే మానవ సంబంధాలు  అంతేరుగని నాగరిక ప్రపంచాలు  వీరి దారి ఏ వైపు  ఈ అలంకారం ఏ మేరుపు  నీ అహాంకారం ఏవరి గెలుపు  అంత:సౌందర్యానికి బావ్య సౌందర్యానికి  అంతరుద్యం లేదా..? అరకొర దుస్తుల్లోనె ఆనందం ఉందా  సాంప్రదాయం అనె మాట గుర్తుకైన లెదా  మనసుల్లొ అలొచన మచుకైన రాదా  ప్రాచీన సంస్క్రుతికి మచ్చ తెచ్చినారా  పరాయి దేశాలకు వీరు దాసులెనా  కోత్త కోత్త హంగులలో కూరుకున్నారా తేరుకోలేరా  ప్రపంచమె కొనియాడిన నేల నాడు  కోరివి అంటి వివస్త్రగా మారెను ఈనాడు.. నీ భారతాన్ని హాత్తుకో, నీ జానతనం దాచుకో..! ---------------------------------------------------------+++🪄 రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

ప్రేమ చేసిన గాయం..

చిత్రం
  నా అంతరంగమున ఏదో అలజడి కలిగింది కాలబడి నా హృదయాంగము అడిగింది నిన్ను సాగిలబడి నా గుండె గుడిలో ప్రతిష్టించిన దేవత నువ్వని నా మది ఊగుతుంది ఉయ్యాల కలవరపడి నీ ప్రేమకు నోచుకోని జీవితం చాలించమని...! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు