పోస్ట్‌లు

దేవేంద్రునితో యుద్దం...!

చిత్రం
పడుచుదనం పరుగు తీయగ పల్లకినై నే నీ ధరి చేరగ  నీ పరువం మోస్తూ నేను, మై మరచి గానమెత్తగా  నీ కన్నుల వెలుగె నాకు దారి చూపు దీపము కాగా  నా ఊపిరి లయలో మ్రోగుతు నీ కాలి గజ్జే తాళమెయగా  నీ కంటి రెప్ప సవ్వడి వింటూ వడి వడి గా పరుగెడగా  దారి పోడుగు దాసి కన్నెలు చెమంతుల బంతులెయగా  అపహరించు దేవకన్యయని దేవేంద్రుడు యుద్దం చేయగ  నిలువరించి మెడలను తుంచి తరమనా నీను గెలవగా  సంబ్రమాశ్చర్యం తో భూ నభుంతరాలు దీవేనలిడగా  పాల బుగ్గ లోలికె సిగ్గు బుగ్గపైన ఎర్రని ముగ్గు  పెదవిపైన పూసిన పువ్వు మదువు జారు నీ చిరునవ్వు  పసిడి మెరుపు కసిరెపె రూపు మాటు వేసి వేస్తా కాటు  నీకు నాకె ఇక పోటి నీవు లేని జీవితం ఏపాటి  పూట పూటకు నీ తోటి సందర్శిస్తా స్వర్గ నగరి  జన్మ చివరన వాలిపోదాం ఆ వారణాసి (కాశి) -------------------------------------------------++++++🪄 రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

భగ్న ప్రేమికుడు( దేవదాసు)

చిత్రం
రాళ్లపై తన పేరు రాయలేదెన్నడు రాతి గుండె తనదని తెలియరాలేదెన్నడు నా కంట శోకాన్ని రాల్చలేదెన్నడు ఆ శిలను కరిగించే రోజు రానెన్నడు ఆ మనసు కే ఇంత అలుసైతినినాడు నా మనసులో తనని నలిపితే ఏనాడూ అవమాన బారముతో అలసితిని ఈనాడు అక్కరకు ఆడించి వంచించే ప్రతినాడు ఆడదే నా పాలు హాలహాలమాయేనే చూడు నా బ్రతుకు మారింది పస లేని బీడు చివరగా చెదిరింది ఆశల గూడు ఆఖరకు నా బ్రతుకు ఎనలేని మోడు చూడరా బాబు ఆడదో క్రీడ కై నీడ అనుసరిస్తుంది అభినయిస్తుంది వెలుతురు లోనే తోడోస్తుంది అందులోనే అంతరిస్తుంది చీకటి చేరిన పారిపోతుంది ఒంటరి చేసి బాధిస్తుంది..👤 ------------------------++++++++ రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

తెలుగు తల్లి నీకు వందనం..🙏

చిత్రం
తెలుగు తల్లి నీకు వందనం.. తెలుగు లిపికి నేను పాదాక్రాంతం ....✍️ ఏమిటయ్యా ఈ నిరాశ నిస్సహయత  నిజానికి నీడ లెనట్టు నీతికి జాడ కరువైనట్టు ఆకాశపు నీటదార అలిగి దిగిరానట్టు నా గొంది లొని బావాలు గురి తప్పినవా అన్నట్టు బుద్ది మనసు ఒక్కటవగ నీకు దిక్కెవరు అన్నట్టు నా కలం విదిల్చి రాల్చ అక్షరాలె కరువైనట్టు శూన్యం లొ దూరి పొయి దారి మరిచి పొయినట్టు అంతా అయొమయం నాలొని కవికి పొయె కాలం.. అంతటా అమావాస్య ద్యయం కారు చీకంట్లొ నాతొ నాకె రణం ఝరులా సాగె నా జన పదులు జీవంకొల్పొయాయ  జనావళిని జనరంజకం చెయు జీతాసులు  కలం మాటుజారలెక జొగుతున్నాయా  నీరసించి నిద్రలొనె తూగుతున్నాయా   జంజామారుతమైన జన చైతన్య పంక్తులు  కావాతు మరిచి కాలిపొయాయా.. కవితె లొకంగా జీవించాను  బావవ్యక్తికరణకు కలమె నా ఆయుదమని గర్వించాను  కలం ముందు కానిదెదని బ్రమించాను  అంతటి నా ప్రతిభా శైలి ఎమయినది  కనుల పడునదెది మనసును ద్రవించలెక పొతున్నది  తెలుగు తల్లి నీకు వందనం,నన్ను కటాక్షించు కవితా కుసుమాలు నా మనసున విరసించు  నాలొని బావాలు అక్షర మార్గమై  కవితాక్షర మాలికల తో నిను అర్చించె ఆజ్ఞ ఇవ్వు  తెలుగు లిపికి వందనం... నాలొని కవిని సత్కరింపమని ఆవ్వానం... ర

లక్షి దేవి ( నీ జడన జెగంటను నేను )

చిత్రం
పసుపు వస్త్రమున పసిడి కాంతగా  చెవుల లోలాకు చిందె వెలుగునా  మెడన ఆడు ఆ హారమంచునా  రంగు రాళ్ళను పోదిగినందున  లక్ష్మీ దేవిలా కాచె కన్నుల  సిరులు ఓలికెరా మణులు కురిసెరా  నీ నడుము నాట్యాన నా చేయి సాయగా  చుట్టు చుట్టనా వడ్డాన మవ్వనా  గంధం విరజిల్లు ఆ కురుల అంచున  జేడ గంటనై సేదతిరనా  సర్పమంటి ఆ నాసికంచున  తీపి పలుకునై నే నిలవన  శంఖమంటి నీ చెవుల నిత్యము  నా ప్రెమ బాసలు వల్లెవేయన  నీ అదర చుంబనల తో అలసిపోనా  నీ అందాల విందామరలు చూసి చూసి మూర్చపోనా నీకు దూరం అయిన  మన యదల భందం విడిపోయిన ఈ లోకాన్ని విడిచి పోనా జీవితాన్ని నిలువరించనా  ఆకాశ మార్గాన కదిలిపోనా  అల్లంత దూరాన ఓ తారలా  నీను చూస్తూ నే నే మిగిలిపోనా  ఆ జాబిలి వేలుగు నీవె కాదా  నీ దాపున నేనే ఓదిగిపోనా  నీవు అలిగిన నాడు చీకటి కాదా  అందుకైనా నువ్వు నవ్వాల నీ నవ్వున నే కూడా వెలగాలా..! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

మనుషుల తీరే ఇంత..! (నమో హైద్రాబాద్)

చిత్రం
మారిన జీవన ప్రమాణం  బంధాలు అనుబంధాలకు దూరమై   శాంతి సంతృప్తి లేక   మనుషుల్లా కాక మర యంత్రాలుగా మారిన మనం  మారేది ఏనాటికో చేరేది ఏ గూటికో  గతుకుల దారిలో గమ్యం ఏమిటో ....? అందనిదే గొప్పంటారు   ఆత్రంగా పరిగెడతారు  అయోమయమై అంతా భ్రమయై  అస్తవ్యస్తపు అలజడి బ్రతుకై   భాగ్యనగర భోగాలల్లో భోగ లాలస క్రీడలు కొరివై   సంపాదన సహేతుకమైన సిరిని గిరిగా పోగేయాలని  సహనానికి సవాలు చేస్తూ పైసాపై సవారీ చేస్తూ కోరికలను కుంపటి పోసి వేడి ధగల సంతృప్తిని కాచి    అశాంతిలో అడుగులు వెసి నూతిలోని రొట్టెను కూడా  నేతి అని చేతులు తోసి అభద్రతను ఆలింగనం చేసి  ఉరుకులు.. పరుగులు..నిరాశల చూపులు   రేపటితో నేటిని మరిచి   మూకుటిలో పేలాలవుతూ   ఆ తెలుపే శాశ్వతమనుచూ  సంబరంతో గెంతును అంటే   మంట తాప తూలిక తనది   జాలి అంటే అమాయకం మనది   రంగుకారమే ఒంటికి పూసి  జోడు బాధలే మనసుని దోసి   నిరంతరం తరం తరం   పరంపరల తదనంతరం   జీవితమే బొంగరం  కోరికలకు ఆశలకు అనువైన మందిరం   మనశాంతిని దోచే యంత్రాంగం..! రచన : తాజ్  పట్నం చేరిన పొరడు

మనిషికి మనిషే శత్రువు...🔨

చిత్రం
ఆ సూర్యుని అస్తమ కిరణం నా కన్నుల ఆశావరణం ఈ జగతే చిక్కుల వలయం అడుడడుగున భంగపు పర్వం కష్టకులకు లేదే కాలం సోమరులకే అందల పీఠం ఈ జీవితం ఆకలి గీతం పేద బతుకు అంధ:కూపం అనుదినము క్షణమొక నరకం కడ బ్రతుకే చికటిమయం కాటికి చేరిన కూరదు మోక్షం కర్మ ఫలితం కారణాతీతం ప్రపంచమే నాటకరంగం రక్షణ ఎరుగని రంగుల గోళం మనిషికి మనిషే యమపురిపాశం రచన : తాజ్  పల్లెటూరి పిల్లోడు

నీవే కదా నా ప్రశాంత జీవనం..

చిత్రం
ఇదేమి జీవితం, కానీ ఇదే జీవితం అన్నివున్నా లేమి జీవితం మనసు కన్నీట జారు జీవితం ఓర్పు లేక ఏ తీర్పు నోప్పక కడుపు కాల్చినా నిద్రకోర్చినా మర్మం తెలియని వనితంట లోతే ఎరుగని మా జంట తప్పు ఏమైంది చిక్కు రగిలింది హక్కు యాడుంది చివాక్కు మిగిలింది అర్దం మారి పెడర్థం దూరి నమ్మకం కరిగి అపనమ్మకం పెరిగి పరం తూలనాడి మిగిలిందేది..?నీది/నాది ఉరిమే నింగి విరిగితే ఏమీ తిరిగే భూమి కంపనలేమి ఒక్క నిమిషం ఆలోచిస్తే ఉలికిపాటులో అంతా మాయం అతలం వితలం అంతా శూన్యం అట్లే.. అలిగినా నీవే నను అల్లినా నీవే నీ కోపం ఉప్పెన నాకు, నీ ప్రేమ చంద్రుని తాకు నీ చేతుల అలరారని రోజు, నా రేపటి బ్రతుకే చేటు నీవే కదా నా జీవితం నీ తోడుంటేనే ప్రశాంతమైన జీవితం ఇప్పటికీ ఎప్పటికీ నీ తోడే నా జీవనం నీ నవ్వే నందనవనం..! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు