పోస్ట్‌లు

గురువు చేతి బెత్తం

చిత్రం
నిశికమ్మిన వీధి చివర వెలిగిన ఓ లాంతరులా  ప్రచండమౌ సముద్రాన్ని జయించిన నావికుడిలా కరువు నేల పులకించగ కురిసిన ఆ చినుకులా అజ్ఞానం కరిగించి విజ్ఞానపు దారి చూపినా..? పూలమ్మిన నేల మీదే కట్టెలమ్మే దాపరికం దైవమనే స్తుతిని మరిచి చులకనగా చూస్తున్నాం గురువులపై భక్తి విడిచి భుజం రాసి వెళ్తున్నాం భయం లేదు భక్తి లేదు గౌరవంగ వాక్కు లేదు  అయ్యా..! అను పదం వదిలి ఏమయ్యా అంటున్నాం పసిడైనా కంసాలి కొలిమి చేరి మెరుస్తుంది పాశానమైన శిల్పి చెంత శిల్పమై నిలుస్తుంది  విద్యార్థికి గురువు తోడు జీవితమే గెలుస్తుంది గురువు చేతి బెత్తమే భవిషత్తు రాస్తుంది తన నోట రాలు అక్షరాలే సిరుల పంటనిస్తుంది🪄 ----------------------------------------++++++++++ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ తల్లిదండ్రుల తరువాత స్థానం గురువులకు ఇచ్చారు మన పెద్దలు వారందరికీ నా నమస్కారములు అలా నా విద్యార్థి జీవితంలో పాఠాలు, జీవితం లో గుణపాఠాలు చెప్పిన గురువులను స్మరిస్తూ వారికి ఈ కవిత అంకితం చేస్తున్నాను రచన : తాజ్  పల్లెటూరి పిల్లోడు

ఉగాది శభాకాంక్షలతో...!

చిత్రం
తెలుగు సంవత్సరాది ఉగాది, తెనుంగు సంసృతికిది పునాది చిగురు తోడిగేను ఊరి పానాది, చిందు లేసెను మా మదిసౌధి సాంప్రదాయము కాదు దయ్యం, సంపాదనే కాదు ద్యేయం జ్ఞానమేమి వనరుకాదు, ధనం తెచ్చే ఎరువు కాదు  జనవరిని జాతరనకు, కొత్త సాలును యాది మరవకు పంచాంగ శ్రవణం రేపటికి బరొసా, షడ్రుచుల పచ్చడి బతుకు తమాషా పాత రోజుల యాది, రేపు రూపం ఎది..? నేడు మాత్రమే నీది నేడే నిజం వద్దురా బేసిజం సాయగుణo నలుగురికి ప్రయోజనం  పండగని పోంగి పోకు నీ కడుపు నింపుకు నిద్రపొకు ఒక్కరికైనా అన్నం పెట్టు స్వర్గం అను కోటకదియే మొదటి మెట్టు  స్వార్ధం కూడే ధనార్జన వీడు పాపపుణ్యాల చదరంగం లో నిచ్చెనే జయం రా నలుగురు మెచ్చేలా బ్రతకరా సహో అనాలన్న సహస్రాబ్ది కి నీవు గుర్తుండాలన్నా మంచిని పెంచు కీడును తుంచు  నేర్పు నీది కావాలి మార్పు సమాజానికి రావాలి శ్రీ ప్లవ నామ సంవత్సర శుభాలు నీకే ఏ వ్యయాలు లేని జయాలు మీకే రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

అమృత మూర్తి మా అమ్మ

చిత్రం
  మాతృ మూర్తులందరికి నమస్కరిస్తూ...  నిర్వచించ లేని కొలమానం మా అమ్మ కష్టాల కల్లోలం లోను చెరగని చిరునవ్వు మా అమ్మ  కలిమి లో పుట్టిన, లేమిలో నెట్టినా మా నాన్నని మెట్టిన నుండి ఆగని పోరాటం కంటి బిగువున కన్నీటిని దాస్తూనే మాకై ఆరాటం గుండె నిండా నిబ్బరం, నాన్న తోడే ఆయుధం అమ్మ ప్రేమను వర్ణించడం కన్నా ఆకాశం లో నక్షత్రాలు లెక్కించడం తేలికైన పని అమ్మ అని పిలుపే ఔషధ ప్రదాయి పిల్లల అభ్యున్నతే తల్లి దండ్రులకు హాయి లాలి పాటల జాబిలి, ఒడి ఊయల కౌముది  మా అమ్మే మా ఆమని, జన్మకంతా సేవించడమే నా విధి మరి ఆ తల్లికి....? ఆపత్కాలమందు చేయి అందించు  ఆశీస్సులంది చిరంజీవి గా గర్వించు  అమ్మ ప్రేమను ఆస్వాదించు  అట్టి ప్రేమను అందించిన ఆ తల్లికి లేస్తూనే నమస్కరించు.. నా మాత్రుమూర్తికి అశ్రుబిందువులతో పాదాభిషేకం ఈ కవితా పద్మములు నా తల్లి పాదాలకంకితం కవితా లోకపు తీరాన, కవిగా మారిన సమయాన  అమ్మే స్ఫూర్తిగా నిలిచేనే, భుజం తట్టి నడిపెనే నా చేవ్రాలు తో  అమ్మ కి అమ్మ అయిన మా అమ్మాయికి (నా భార్య)  మాతృ దినోత్సవ శభాకాంక్షలు రచన : తాజ్ మీ పల్లెటూరి పిల్లోడు -------------++++++++++++

శ్రీ శ్రీ జయంతి వేడుక...

చిత్రం
శ్రీ శ్రీ జ్ఞాన గని, సాహిత్య ధుని అఖండ భారతం జోతలిడు మోని అభ్యుదయ కవితా కీర్తికి తానే నుడి తన కలం విదిల్చు అక్షరాలు వాడి వేడి  కొడిపెద్ది వెంకట రవణమ్మ అప్పలకొండ  తొలి కడుపు పంటవై వారి హృదయాల్లో గీసుకున్న రూపానికి సాక్షమై భానుడల్లే ప్రకాశిస్తూ ఒడిలో నువు చేరావు  నీ కన్న తల్లి ముద్దు చేస్తే ముసి ముసిగా నవ్వేవు దేవకిని వీడి యశోదను చేరిన కృష్ణయ్య మల్లె కోడి పెద్ది ఇంట వెలసి, శ్రీ రంగం పేరు బడసి  శ్రీ శ్రీ గా వెలిగావు నాలోని కవికి నీవు దిక్సూచి అయ్యావు  రేపన్నది ఉన్నదని నీవే నీ ఆయుధమని సోమరులకు చెంప చరిచి నిలవక పరిగెత్తమని నిప్పు రవ్వ లెగసి దూకు కవితలేన్నో రాసావు సుత్తి కొడవలి చేతబూని జ్ఞాన విత్తు వ్యవసాయం చేసావు కవితలనె పంట తీసి నా ముందర పొసావు శ్రీ శ్రీ జయంతి వేడుక... అభ్యుదయ కవితా యుగానికి అసలైన పండుగ  ఆ భానొదయ కిరణం వలె మీ రచనలు మాకు ప్రేరణ  నా చేతిలో కలం కదిలినన్నాల్లు మీ పేరే నాకు స్పురణ...! రచన : తాజ్ మీ పల్లెటూరి పిల్లోడు

శ్రీ సీతారాముల కళ్యాణం...!

చిత్రం
శ్రీ సీతారాముల కళ్యాణం చూసిన కన్నుల పరమానందం  విన్న మా చెవుల శ్రవణానందం దశరథ తనయ జనకుని పుత్రి  ఒక్కటి చేసే శుభగడియ మన జన్మకు దొరికిన పుణ్యమయ అంతఃపురమైన, అరణ్య మైన వైబోగ మైన, వైకుంఠ మైన  కలిసి నడవమని, ఒదిగి గెలవమని  నేర్పిన ఘనత, ధాత్రిన చరిత  తండ్రి మాటతో అడవి చేరినా ఆలి దూరమై పోగిలి ఏడ్చినా  ధర్మం తప్పని నడక  మనిషే కానీ..! దేవుడైన నడత  కాలం ఏదైనా వారిని అనుసరించడం మన ధర్మం  తనువెల్ల పులకించగ తిలకించడం  మన జన్మ జన్మల పుణ్యం.....! రచన : తాజ్ మీ పల్లెటూరి పిల్లోడు

శీర్షిక : గణేషునికి వీడుకోలు...🐘(ఊగుతూ ఊరేగింపు)

చిత్రం
గణతమాటున దూర్తులు గాడి తప్పిన భక్తులు పానకంలో మునుగుతూ పూనకంతో ఊగుతూ భక్తి గిట్టక, రక్తి హెచ్చగా దొర్లిన అపశృతులు భజన కీర్తనల ఊసెలేదు భరితెగించిన చేష్టలు చూడు చందాకొచ్చి చిందేస్తారు వందకు వంద అని ఎత్తేసారు ముందుగానే మందుకు వాటేస్తారు పెగ్గు పెగ్గుతో ఊగేస్తారు నిస్సిగ్గుగా నవ్వేసారు డప్పుల కూత, బాంబుల మోత భాహ భాహి సవాలు విసురుత ప్రధమ పూజనియునికి తప్పని పాట్లు ప్రతీ అడుగులోనూ సారా ప్యాకెట్లు ప్రసాదతీర్థం అంతా వ్యర్దం ప్రవాహమగును బ్రాందీ వర్షం తప్పు ఒప్పులను లౌకికమేది నాగరికతలో దౌర్భాగ్యం ఇది...! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

వయసు సోగసుల నిధి...!

చిత్రం
చెలి నా నిచ్చెలి........... అపురూపాల పదకోమలి  చిగురించె పసిరెమ్మవి  కురిసె వర దీప్తివి  తడిసె జడి ముక్తివి  అర విరిసిన ఓ జాబిలి  విర కాసిన తారల వెలుగువి  చెంగంచున చిలకల ముగ్గువి  కొంగు దాపులో పూల రెమ్మవి  వయసు సోగసుల నిధి నీవె  నీ సోగసు పిలుపులు నను చేరె  సుందరమంటి నీ మోము  వలపు బాణాలు ఇటు విసిరె  నాటు చూపులు గాటు మాటలు  పోటు వేసెటి నీటు మమతలు  నన్ను పిలిచెను పరద మాటుకు  మెల్లగ జారె వస్త్రాలు మత్తున జారె నేత్రాలు  హ...ఈ రాతిరి నాదే రక్తిలో జోరె  గెలుపోటములకు తావే లెక  ఈ తిమిరం ఊగుతు సాగవలె  మదు కౌగిట చెమటల జారవలె  మన కలయిక మనసుకు మంజిరమై  సంత్రుప్తి గీతాలు పాడవలె.. ---------------------------------------++++🪄 రచన : తాజ్  పల్లెటూరి పిల్లోడు