పోస్ట్‌లు

ఒంటి నిట్టాడు గుడిసె

చిత్రం
ఒంటి నిట్టాడు గుడిసె ................................................✨ ఇగో ఇక్కన్నె వాన జల్లుకు వణుకుతూ రెక్కల సంటి పిల్లల్ని ఒదిగిన  తల్లి కోడోలె చూరు నీళ్లు రాలుస్తూ  మా ఒంటి నిట్టాడు గుడిసె ఉండేది ఒళ్ళంతా నల్ల మట్టి రాసుకుని  తెల్లని గీతల గంధం పూసుకుని పీర్ల పండుగ షర్బత్ పటవ చిమ్మటించినట్టు  ఎప్పుడు చెరువు అలుగువడ్డా  బురద నీరు మా గుడిసెలకు రాగానే తేటగా పారేది వానెలిసే దాక కాలు కింద పెట్టనియ్యక నులక మంచం చూరు సుక్కల తాళమేస్తూ నిద్ర పుచ్చేది ఈ తూర్పు మూలకు ఎర్రమన్నలికిన మూడు రాళ్ళ పొయ్యి ఉండేది ముదునష్టపు వాన ఎప్పుడు పోతదో అని  దాది పచ్చి కట్టెలు పొయిల వెడుతుంటే  వాన మిత్రుని వెనకేసుకొస్తున్నట్టు  చిట పటమని అగ్గి రాజేసుకునేది ఎసరు వంపిన గంజి నీళ్ళే కడుపు నిండెది  అన్నం వద్దే వద్దు అనేటోల్లం దాని కుడిబాజు వాసానికి జనపనార ఉట్టి బువ్వ పెళ్ళ నెత్తి నేసుకుని చూసేది మాపటికి సుట్టం ఎవలన్న వస్తరెమో అని అక్క పుట్టినప్పుడే వానలకు మట్టి గోడ మెత్తబడి బయటి బాజుకు కూలింది ఆడపిల్ల మీద అల్లా వెలుగు దీవెనలిస్తున్నట్టు ఆయాల్ల గోడ మీదపడ్డా ఈ కట్టం తప్పేదిరా అని అమ్మి గోడేళ్ల పొస్తది మతిలపడ్డప్పుడల్ల ఇం

వాకిలి కొమ్ము....!

  పొద్దాక పని చేసి అలిసి గూడు చేరగానే ఎదురుగా గులాబి సెట్టు Bunches Bunches గా విరగపూసి స్వాగత తోరణం కడుతుంది  పక్కనే తులసి కోట కనబడని దేవేరులకు ప్రతిగా పసుపు పులుముకుని దీవెనార్థులు కురిపిస్తుంది నీడగా దాపునే ఉన్న ఎర్ర మందార సెట్టు  రంగుల పుప్పొడిని అత్తరుగా జల్లుతుంది ఇంటికి ఎనకాతల  పసుపు అంగీలు ఎసుకున్న పసిపోరగాళ్ళ సంకనేసుకున్న నిమ్మ చెట్టు కానొస్తుంది చిలక కోరుకుతున్న జామ పండు బుక్క బుక్కకు నెలల సందమామకు జన్మనిస్తుంది ఆ జామ చెట్టు పూట పూటకు వేల పచ్చురాల ఆకలి కడుపుల పెల్లై మురిసి పోతుంది ఇస్వాసానికి పేరైన కుక్క పిల్ల పాతవడ్డా జాలి అరుపుల జాబు పంపుతది  మా ఓనరమ్మ బొట్టు వెట్టిన గడప లెక్క మోచేతికి అందోచ్చిన పిల్లలు  ఉర్రు ఖర్చులు తగ్గియ్యూర్రి అని  తన అనుభవాల పొట్లం చేతిల పెడ్తది మాట గట్టిదనమె గాని మనసు ఎన్నెల పూత మా ఒనరంకుల్ పెరట్లో ఉన్న కొబ్బరి సెట్టొలె నవ్వితే పాల నీళ్లు కుడుస్తాడు అద్దెకు ఉన్నామన్న మాటే కానీ అందమైన నవ్వుల సావిడి ఈ ఇల్లు...! ఈ ప్రేమల ముల్లె నెత్తినేసుకుని ఇంట్లకు పోతే పసుపు కొమ్ముకు కళ్లు చెవులు ఒత్తినట్టు పాల పోర్క నడుముకు తిప్పుకున్న  जोरू ఎదురొచ్చి నవ్వుల పువ్వుల

నేస్తాలు....!

చిత్రం
  శీర్షిక : నేస్తాలు....! నిశీధి, భానుడు, ఘని, ధుని,  పడతి, అని రాస్తున్నప్పుడు ముసి ముసిగా  దాపున కూసోని నవ్వుతున్నడు తగుళ్ల గోపాల్ అన్న తప్పంటే ఏమన్నా తప్పుతీసుకుంటడో ఏమో తమ్ముడు అని సర్రున ఇపుల సరిసి  కోపం సేస్తుండు నాగిల్ల రమేష్ అన్న ఎన్ని సార్లు సేప్పిన చెవిన ఎక్కదురా నీకు అని ఎన్నో ఎవలో అన్నది నూవిన్నది కాదురా నీ బతుకు సిత్రాన్ని శాత్రంగా మలువు అంటడు అన్వర్ భాయి సాయిబుల బాస ఎంత పొంకంగా ఉంటదయ్య ఇదేం రాసినవ్ అసహనపు కనుల ముడి విప్పారిస్తూ అంటది దాసోజు లలితక్క పదం పల్లె పానాది పొంట  పసి మొగ్గలు విప్పుకుంటున్నట్లు ముండ్ల దాపున దాక్కున్న రేగు పండ్లను  నేర్పుగా ఒడిసి, రుమాలులో పోసుకునే నీ పదాలు  నలుగురికి పంచాలయ అంటాడు యాకుబ్ చాచా శిలాలోలితమ్మి  నీ కవితలన్నీ కవి సంగమంలో తూర్పార బట్టు గట్టి  భావాలు మనసులో ఆగి తాలు మల్కులకెళ్లి ఉరుకుద్ది అంటది ఇగ వశం గాక చీర బొంత తలాపునేసి  ఇంటి ముందల నులక మంచంల ఒరుసుక పన్న నాకు పాణం అసొంటి దోస్త్ గాళ్ళు గట్టిగ కొట్టి లేపిర్రు గవే "దండకడియం", "నల్ల కోడిసె వన్నేకాడు"  అవి ముందల ఏసుకుంటే నెత్తి గిన్నెల గడ్డ  కట్టిన కన్నీటి తడ కాలువలై కి

ప్రేమ లేఖ...!

చిత్రం
  ప్రేమ లేఖ...! ఓ మాట నా నోట ఈ పూట చెప్పాలి అనుకున్నా చెప్పేందుకు భాష రాక మౌనంగా నిలుచున్న నా గుండెలో ఆ మాటలే ఇష్క్ ఇష్క అని ద్వనించినా నీకు వినిపించగా ఓ రాగంకై నా గొంతు వేచి చూసెనే నీ ప్రేమ ఒప్పు సంకేతాలు చలి వెన్నెలలా మది తాకు తిరస్కరించేవా నా గుండెలో పేలు ఆగ్నిలావాలు🔥 నీ మాటలతో మాయ చేయక తొలినాళ్ళ బాస మరిచిపోవక....! నా బ్రతుకు బండి చివరి మజిలీ ఆగిపోవాలి నీ ఒడిలో ఆయువు నిండిన నా కాయం కన్ను మూయాలి నీ కౌగిలిలో నా ఆశ తీరి శ్వాస ఆగి నీ ఊపిరిలో కలవాలి అది పరిపూర్ణమైన బతుకని నా ఆత్మ తరలిపోవాలి నా చివరి నవ్వు నీ చేతులపై వెండి గాజులై మెరవాలి. రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

సిగ్గేస్తోంది.....!

చిత్రం
  సిగ్గేస్తోంది.....! ప్రియసఖి నిన్ను కలవరించగా నా కలలో నీవు నడయాడంగా నిజమైతే నీ పాదమేగి ఆర్ధించనా నా రాణిగా నా హృదయ సామ్రాజ్యమతిష్టించమని అందమైన నీ రూపాన్ని అప్సర అన్నా తక్కువని భువిపై లేనిది నీ అందం భువనమంత నీ దాసోహం ఆకాశాన్ని అరువుగ తెచ్చి ఎండపొడ సొకక గొడుగుగ మార్చి నక్షత్రాలే కోసుకు తెచ్చి దారిని చూపగ దివిటిగ మార్చి సూర్య చంద్రులను బందించి నీ ఇరు కన్నులలో అరమర్చి సముద్రాలనే మళ్లించి నువు స్నానమాడ కొలను జేసి రెక్కల గుర్రం ఎక్కించి, లోకాలన్నీ చూపించి మన జంటను చూసి మురిసిన సురలు పూల అక్షితలు కురిపించే నీ తోడు ఉన్నంత కాలం చిరంజీవివని దివించే ఒక్క క్షణం దూరం అయిన ఆ దూరం మరణం అనిపించే మృత్యువుకై ఎదురు చూచే అన్నపానీయం అనవసరమని సహించక మనసు నిద్రించే భరింపక కనులు రోదించే కన్నీటికి ఓ ప్రయోజనం అది మనసును చెయును నిర్మలం...! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

ఒంటరికి తుంటరి ఆలోచన...!

చిత్రం
ఒంటరికి తుంటరి ఆలోచన...! ఒంటరిగా నే వేచివుంటిని తుంటరినై నిను రమ్మంటిని రాగమందుకు పాట పాడితి నువు కదిలోస్తుంటే పల్లవైతిని నీ పాద స్పర్శకై పూవునైతిని రంభ లాంటి నీ ఒంటి మెరుపుకి కనులతోనే నువు ఆడించు క్రీడకి బానిసనై మోకరిల్లితి, నీ బాహులలో దూరవలెనని బావురుమంటిని నీ జడతోనే జయించేవు నన్ను అది తాచు పాములా బుసలే ఈను నీ నవ్వు చాలు, నీ పలుకే చాలు ఆ వెన్నెలయిన కోయిలైన కళ్ళు చెదిరి నేలవ్రాలు ఉన్నదే నీ పెదవి రంగు సంధ్య వర్ణము తేలిపోవు నీ బుగ్గలే బూరలంట అవి కోరుకుతుంటే మజాలంట నీ హస్తములపై హర్ష రేఖలు రాశులన్ని దాసోహం, నవ గ్రహాలు దాసి ఘణం పాదములా అవి పసిడులా పసుపు పూతతో మెరిసే పారిజాతాలా నీ చిటికన వేలు తోడు చాలు నీ చీర కొంగు జతగా ముడివేయు నీతో వేసే ప్రతి అడుగు వంద జన్మలకు ప్రణాళికలు నా చూపు నీ వైపు, నా బతుకు నీ కొరకు ఉండవా నా చెంత ఒకరికి ఒకరుగా...? రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి...!

చిత్రం
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి...! సమ్మోహన పవనాలు కమ్ముకున్న తిమిరాలు పడిలేచే అలల విహంగాలు నిష్క్రమించు అరుణ కిరణాలు ఆవేళ జాలరినై నే వల వేయగ ఓ పడుచు పిల్ల కానవచ్చే ఓ కలలాగ నను తాకగా వచ్చే నా మది నిండుగా పొంగినోచ్చే నవ్వులీను అధరాలు ముత్యాలా నయనాలు వగలు రువ్వు వొంపులు సుధలు రాలు కెంపులు కురులు అగరొత్తులు సిగలో పూ గుత్తులు మెడలో తారల జిలుగులు నడుముకు నాదు రెక్కలు నా గుండెను తట్టే ఆ పాద పట్టీలు నా కేశాలే నీ విసన కర్రలు నా నేత్రాలే నీ పాదరక్షలు నా గాత్రాలు నీకు జోల పాటలు నీ మనసంతా చల్ల దొంతులు నీ జతలో ఎన్ని పండుగలు నీ నడవడిలో ఎన్ని పాఠాలు నీ ఒడిలో పడగ పుణ్యాలు ఆ బ్రహ్మదేవుడే ఎదురొచ్చి నా దేవి నువ్వంటూ దీవించి నిండు నూరేళ్లు నాకందించి నిన్ను ఏలుకోమని శాసించే అరమరికలు లేకుండా ఆలుమగలుగా పాలు నీళ్ళలా ఒకరిని విడువక ఒకరుంటూ జీవించండి చివర కంటూ జత కూడమని వరమిచ్చే జగాలే జయహో అన్నమాట వినవచ్చే..! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు