పోస్ట్‌లు

డిసెంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

చిత్తభ్రంశమే కానీ ప్రత్యక్షీకరణ....!

చిత్రం
  చిత్తభ్రంశమే కానీ ప్రత్యక్షీకరణ....! ఇది నిజమా లేక నా భ్రమనా...! పిలిస్తే పలికే పలికే దైవం తలిస్తే ప్రత్యక్షమయ్యే రూపం అడగగానే వరాలిచ్చు ఇలవేల్పు అంతం కోరి, పంతం పట్టి కరుణించకుంది, కటాక్షించకుంది నా ఊసు ధ్యాస మరిచి కొండేక్కింది ఆ గుండె రాయిని కరిగించే లావా కరువైంది అన్నార్తినై శరణార్తినై వేడుకున్నా ఫలం లేకుంది ఫలితం అందకుంది కన్నీటి నైవేద్యాలు ఉపవాస నిష్టలు జాగారాలు భజనా స్తుతులు ఏది తన మనసు గెలవలేదు, ఆ గుండె కరగలేదు అర్జునుడు రగిలించిన అగ్నికి వాయువు తోడై అరణ్యాన్ని కాల్చినట్లు గొంతెండిన పృధ్వీ ఆకాశానికేసి చూసినట్లు తన మౌనానికి క్రోధం తోడై నన్ను నిలువెల్లా దహిస్తుంది కాటిలో అనాధ ప్రేతంలా అలమటిస్తూ గతించబోయే నా చూపు నీ కొరకు వెతికింది నీ ప్రేమామృత ఫల హాస్తాలకై నలు దిశలా చూస్తుంది...! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

జలవాహం పై తీరిన మోహం...!

చిత్రం
జలవాహం పై తీరిన మోహం...! కురిసే ఈ ప్రతి చినుకు నీ రూపు చూపెడుతూ పారె ప్రతి చిరు వరద నీ నడుముగా బ్రమపడుతూ ఉరు మెరుపులు నా కనులై టార్చి వేసి నిను వెతుకుతూ నల్లని ఆ పొగ మంచు నీ కురులుగా గాలినేగురుతూ పలికే నా గుండె లయ నీ పేరుగా వినబడుతూ పచ్చదనం పరుచుకున్న లోగిల్లే నీ కౌగిలవుతూ కనికట్టు చేసావో, ఆకట్టుకున్నావో...! గమ్యమయి నీ చుట్టూ గానుగలా తిప్పావో జాబిలి కరుణించినా భానుడు దయతలచినా ప్రాణమైన నీ కోసం పరుగుపెట్టి రావాలా ఈ పొద్దు నీతో పదం కలిపి, నీ గొంతు విని శుభం పలికి ఈ అనుభూతికి పొంగిపోతూ పాన్పుపైనే తెలాల...! ఇదో భలే హాయి మరి..! నేలపైన నిలిచే స్థాయి లేని నాకు ఆకాశం విడిదిస్తానంటే తారా లోకం తరలి వచ్చి తావునిస్తుంటే ఆ మెరుపే చెంత చేరి ఇంటి దీపమవుతుంటే ఆ మేఘమే మా జంట వేడుకకు విడిదవుతుంటే మనసుకు రెక్కలొచ్చి సాగిన మా సరసోల్లాసం చాలులే ఈ జన్మకు సాగుదాం పై జన్మకు....! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

విధి విలయములో సంసార రథం...!

చిత్రం
  విధి విలయములో సంసార రథం...! వరించింది నిజమైతే మన్నించడం తేలిక సహించడం తెలిస్తే జయించడం తేలిక నిజాయితీతో నిట్టూరుస్తుంటే నిజం గ్రహించమని నినదిస్తుంటే నువ్వే నువ్వే కావాలని రోదిస్తుంటే నేను కాను నీవు, నీతో కాదు నాకు అంటుంటే ఇంకెలా ఈ వివాహ విధి వలయం భరించేది ఎలా ఎలా ఈ క్షణాన్ని నిందించేది నివారించేది నీకెలా వివరించాలి.....? నా కన్నీరే ఆవిరై ఆకాశం నలుపెక్కి కురుస్తుందని చెప్పనా నా రక్తం వరదలై ఈ నేలపైన జాలువారుతుందని చెప్పనా నా రొదకు చలించి సూర్యుడు దాగున్నాడని చెప్పనా నా మనసులో చీకటికి ఈ వాతావరణం ఉదాహరణగా చెప్పనా క్షేమాపణ కు అర్హుడను కానని నివంటుంటే నీ రూపు చూడలేని దరిదృడనని కడజాతి సైతం వెలివేసిన పాపాత్ముడనని చెప్పనా నా బెదురు చూపులు నీ గుండెను పలకరించడం లేదా నా కన్నీరు నీకు కనికరం నేర్పడం లేదా చెప్పు భామ చెప్పు....! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

అమృత సుతయే ధ్యుమణిగా మారితే...!

చిత్రం
  అమృత సుతయే ధ్యుమణిగా మారితే...! అమృత సుతయే ధ్యుమణిగా మారి అపర భామిని ఎరుపు కన్నుల నిప్పు రవ్వలే రాల్చి కరుణ పంచే కిరణాలన్ని ప్రకోపాలుగా పరిణమించే ఏడ్చి ఏడ్చి మూర్చ వచ్చిన, ఎదురు కన్నుల కాయ కాచిన అచేతనమై నేల రాలిన, దప్పికంటూ అరుపుపెట్టిన దరికి రాదు గోడు వినదు, దయించమన్న గోస కనదు తోడు లేదు జాడ లేదు, నేటి రోజు తీపి లేదు బ్రతుకు లేదు భవిత లేదు, నీ నవ్వు లేని రోజు చేదు అమ్మ కన్నా అంటూ ఉన్నా, నీ పాద మేగి మ్రొక్కుతున్న నీ నవ్వు మబ్బు కమ్ముకొగ ధ్యుమణి సెగలు ఆరిపోగ అలక మాను పాన్పు వీడు, చెంత చేరి ఆర్తి తీర్చు తప్పు కాయి ఒప్పు చేయి, నీ మాట విన్నా అదే హాయి...! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

జన్మదిన శుభాకాంక్షలు..!

చిత్రం
  జన్మదిన శుభాకాంక్షలు..! వేకువ తొలి పొద్దులలో ప్రసరించిన తొలి కిరణం వంశాభివృద్ధి చేసే వంశాంకురం అమ్మ ఆయేషా ఆశా దీపం నాన్న తాజ్ కలల రూపం తాతా నానమ్మల గారాబాల ముద్దుల మనుమడిగా ఆటల పాటల అల్లరి పిడుగులా అలరారే అందాల అబ్దుల్ ఆయిష్ ఆచంద్రార్కం...... ఆయురారోగ్యాల తో, అష్టఐశ్వర్యాల తో నీ భావి జీవితం వికసించి, విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎల్లప్పుడూ సుఖ శాంతులతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ హృదయ పూర్వకంగా ఆశీర్వదిస్తూ... చి|| ఆయిష్ కు జన్మదిన శుభాకాంక్షలు.. సదా నీ క్షేమం కోరే..... నీకు తెలియని తాతయ్య ఈ రోజు నా కుమారుని పుట్టిన రోజు సందర్భంగా మా గురువు   లగిశెట్టి ప్రభాకర్ గారు అందించిన కవితా ఆశీర్వాదం 🙏

ఆమెతో నా తీయని తీరని బంధం...!

చిత్రం
  ఆమెతో నా తీయని తీరని బంధం...! ఓ సుకుమారీ, నా సుమరాణి సుందరి నివని, అందం నిదని పసి పసి మొలకల ప్రకృతి నీవని పురులు విప్పుకు, కురులు విత్తుకు నాట్యసించు ఆ దేవత నీవని...... ఇల కలగా నీవొక కథలా భాధలు మరిపే ఔషదమా భాగ్యం కాదా నా జనుమా గుండెల్లో భాధ ఏదో గొంతు దాటనంటుంది దోరయిన నీ పరువం దోసి తీరమంటుంది రంగులోన రూపులోన రంజుగున్న రమణివని చల్లంగా క్రిడించు కిలాడివి నివేనని కావాలని ఆశ ఏదో తీరాలని కోర్కె నాలో తియంగా నిను గని నీవందుకు నెయ్యమని నిను వెతుకుతు నడిచింది నిను చేరగా కదిలింది నీతో ఈ బంధం ఇంపుగానే తోచింది నీ ఒడిలోన నిద్రించగ ఇష్టమని పలికింది రావాలమ్మ రావాలి నీ ఊపిరి నాది కావాలి నీ ప్రాణం నేనే కావాలి నీ ధ్యానం నేనై పోవాలి నీ సరసం విరసం ప్రేమామృత రసం నాకే చెందాలి..! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

స్వార్థమనే కీలు లేని సహనమయి మిత్రత్వము

చిత్రం
  స్వార్థమనే కీలు లేని సహనమయి మిత్రత్వము కుచేలుడు గొని తెచ్చిన అటుకులనే అమృతమని ఆరగించే యశోద తనయ సుయోధను స్నేహానికి పొంగిపోయి తన మన ప్రాణాలనే ధారపోసే కుంతి తనయ స్వార్థమనే కీలు లేని సహనమయి స్నేహితుడు చెంత ఉండి మంత్రివలే సూచనలిడు ఆప్తుడు జీవితపు వైకుంఠపాళి ఆటలో నిచ్చెన ఈ చెలికాడు ఓటమిలో ఉతమిచ్చు మనుసఖుడీ మిత్రుడు స్నేహమనే యాగముతో జన సంద్రాన దొరికిన ఓ రక్షకుడు మన మను సంద్రములో తేలియాడు ముత్యం నా సచివుడు భాధలనే అలల మునుగువేళ నావికుడీ సంగడీడు జీవిత గమనాన్ని తీర్చి పేర్చు ప్రేమికుడీ సహాయుడు కలం పట్టి రాసున్నా తన కీర్తి పొగడ తరుగునా బలం తాను తోడుంటే జగం నీకు మ్రొక్కదా...! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు