పోస్ట్‌లు

కలల సభలో రతి క్రీడ..!

చిత్రం
నవ నవ లాదులు నీవే అనుచు నరము నరమున కోరిక రగులుచు అందమైన నీ పాదము తాకి రాతి హృదయమున రాగం పలికి రమ్యమైన నీ ఊపిరి గాలిన మన్మధ లీలలు నేర్పే సాయమున ఎత్తు పల్లముల ఇష్ట భాగమున హెచ్చు సుఖముల నిచ్చు ఆటన ఓటమి గెలుపులు ఒరుపుతూవున్నా కష్ట సుఖంబులు సలుపుతూవున్నా పనిలో నీ మోము చంద్ర బింబమై నీ పంటి బిగుతులే వెన్నెలలై నీ పిడికిలి బిగియగ మల్లెలు నలుగా మరులు గొల్పుతూ మత్తు చేరగా తొడలు సాయమై, యదలు చేరువై నీ మీద చేరి అది కానిస్తుంటే  నీ కైపు కన్నులే సై సై అంటుంటే  మన మది అలజడి తేలిక కాదా పెనవేసిన మన తనువు గాథ పున్నమి నాగుల పోలిక కాదా మొగలి పువ్వు వలె నీ పూవు అది చూడగానే మది పులకింపు నిన్న క్రీడలో నీ గెలుపు నేటి క్రీడలో నను గెలిపించు...! ------------------------------++++🪄 రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

దేశాన్ని నడిపించే నాయకుడు కావాలి...! (Happy independence day)

చిత్రం
  రాజులు, రాచరికాలు, దొరలు, భూస్వాముల చెర వీడి  1500 సంవత్సరములు పరాయి పాలనలో మగ్గి సాధించుకున్న స్వాతంత్య్రం ఒక కుటుంబం పాలనలో, రాజ్యాంగం ముసుగులో  60 ఏళ్లు ఏ అభివృద్ధికి నోచక వాడిన భీడులా,  పాడుబడిన రాజ సౌధంలా, పశువుల కొట్టంలా మారిపోయింది, సాధించిన స్వరాజ్యంలో కూడా అర్హులకు ఏ లబ్ది చేకూరడం లేదు అన్నమో రామచంద్ర అని అలమటించే రైతుల బలవన్మరణాలు బుక్కెడు అన్నం దొరకని అప్పులలో కూరుకున్న నేత కార్మికులు దేశమంతా కార్పొరేట్ చట్రంలో పరిమితి లేని పని గంటలతో వ్యర్దం ఈ జీవితం అని అలమటిస్తున్న నిరుద్యోగులు ఆర్థికంగా ఉన్నా ప్రభుత్వ సబ్సిడీ పొందే అభాగ్యులు చేతిలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా రేషన్ వీడని అదృష్టవంతులు ఉద్యోగం ఉద్యోగం అని నిరుద్యోగులు ఊరురా తిరుగుతున్నా  ఉద్యోగం ఉన్నవాడికి 40% ఫిట్మెంట్ ఇచ్చే ప్రభుత్వాలు ఇంటికో ఉద్యోగం ఉత్తి మాట.. ప్రగల్భాలతో ఎక్కి కూర్చున్నారు గద్దె పీట.. ఈ దుస్థితిని మాన్పూ చేసే నాయకునికై నా వెతుకులాట..! ................................................................…......++ రచన : తాజ్  పల్లెటూరి పిల్లోడు

మరో బిడ్డకు రూపం ఇస్తూ....!

చిత్రం
  తొలకరి చినుకుతో పరవశించిన నేల పగిలి పచ్చని పంట సిరులు కురిపించే చందంగా ఇద్దరు ముగ్గురై నలుగురు గా మారుతున్న వేళ..! రెండు మనుషుల (మనసుల) కలయిక మరో జీవికి బీజం కాగలదు పోషణ భారం అవుతుందన్న భాధ అనవసరం..🤱🏻 ఒక జీవికి ప్రాణం పోయడానికి ముందే తన ఆహారం సిద్దం చేస్తాడట దేవుడు..🙏 ఆ మాటకు నిదర్శనంగా.. ఒక బాబు లేదా పాపకు జన్మ ఇవ్వడానికి ముందే ఆకలి తీర్చడానికి ఆ తల్లి యదలో పాలు చేరుస్తాడట దేవుడు.. దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ... రచన : తాజ్

మాయల 'మని' షి (కులం పిచ్చి)

చిత్రం
*శీర్షిక : మాయల 'మని' షి (కులం పిచ్చి)*  ఘనమైన స్వతంత్ర రాజ్యంలో, నాడు మొదలు నేడు వరకు అగ్ర వర్ణ శోభితం, కడ జాతులతో పాద సేవనం గుణం చచ్చి, కులం రెచ్చి, మతం చొచ్చి మనిషిని మార్చి మనం అన్నది మరిచినాడు, మందిని ముంచేదిగినాడు కులం ఏదైనా మలం తినమనలేదు మతం ఏమైనా మరణానికి అడ్డురాదు పని ప్రాతిపాదికన పుట్టిన కులానికి అదో ప్రత్యేకత ఆపాదించకు సమస్త మానవాళి ఒక తల్లి పిల్లలం అని మరువకు మనిషి కుంచిత స్వేచ్చ విధానంలో స్వతంత్రం - స్వలాభం, స్వరాజ్యం - స్వబోజ్యం సానుకూలత - పేరు కులట, సమానత్వం - అమానుషత్వం అనుబంధం - అబద్దం, మానవత్వం - వినాశక మత్రం వినుతికెక్కిన గణతంత్ర దేశంలో ఎక్కడుంది ఘనం, మనిషి మనిషిలో ఖేదం ఎక్కువ తక్కువల తో ప్రాంతీయతల విభేదం,  ఎందుకు పంతం, ఎవనికి సొంతం  జీవితమంతా పరుగులతో అంతం రౌడీ రాజకీయకుల ఆయుధం ఈ కులం అన్నదమ్ముల మధ్య అగాధం ఈ మతం శాస్త్రోక్త గ్రంధములెవైనా సారం ఒక్కటే రాము, రహీమ్, రాబర్ట్ ల  కణములోని అనువంశిక పదార్థం(DNA 🧬) ఒక్కటే... రచన : తాజ్  అంశం : మత సామరస్యం

అరటి తోటలో ఆగని శృంగారం...

చిత్రం
  అరటి మాను తోటలోకి మనమిరువురం పోదూరి నీ అదరం వణుక జూసి నీ పరువం పొంగజూసి నీ లౌక్యం తిరగ జూసి నీ తాపం పెరగ జూసి నీ కనులలో సుడులు తిరుగు మరులు గొల్పు మత్తు జూసి నీ అదరములపై చేరి నేలదూకు అదరామృతాన్ని కలియ జూసి అరటి పత్ర దళములే ఆ పూటకు పాన్పుజేసి అల్లుకున్న మన తనువులు కరుపెక్కగ బిగియు జేసి నీ కాపుకు దొరనై, నీ హోయల సిరులకు ఎలికనై నీవన్ని దోచుకొని, నీ ముంగిట మూర్చిల్లని... నీ ప్రేమ ధారల మధువులను మీద జల్లగ మేల్కొని ఈ నా జీవితం నీ పాదాలకని నే చెప్పగలను నీ భానిసనని...! ----------------------------------------------------------+++++ రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

జన్మ జన్మలకు నీవే తోడు....!

చిత్రం
ఆమని వేళల వసంత పుష్పం నీ అందం కమ్మని కోకిల ఇంటిగానం నీ వాక్యం కారు మేఘములు కాటుక దిద్దిన నీ కనులు బారు సర్పముగ కాంచుచున్న నీ కురులు అంగ అంగమున అందచందములు ఆవహించిన హరిణి కోమలలు దాత్రిపై నీ పాద పద్మములు కమల రేకుల కాంతి దోనెలు ఆవహించిన హరిణి కొమలలు కనికరించిన నీదు హృదయము చేరనీ నను నీదు మధిరము జీవించగా మనమిరువురము కుటుంబమై అవనిలో ఆ జన్మంతములు...! -----------------------------------------------+++++ రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

తొలి ముద్దు..(ఓ తియ్యని అనుభూతి)

చిత్రం
  నీ అదర చుంబనముకై ఆరాటపడుతూ నీ అధరామృతం సేవించాలని ఆదుర్దా పడుతూ నీ చెంత చేరి కోరిక తీర్చ ఆలోచన చేస్తూ నీ అందాల రుచులన్ని ఆరగించాలని అవేశపడుతూ నీ మధురానంద రూపాన్ని అభివర్ణిస్తూనే నిను నా బిగి కౌగిలిన భందిస్తూ నీ అధరాలను నా ముని పంటితో ఒదిమి పట్టి నీ కాలి గజ్జెలు సర్దుజేయక, నా కాలి గోటితో అదిమి పట్టి నీ నయగారపు నడువొంపును, నవనీతపు మెడ సొంపును ఇరు చేతుల దుసివెస్తూ, ఇంపుగానే లింకుపెట్టి జోడు రాత్రులు గొలపెట్ట, ముద్దు మీద ముద్దు పెట్టి బిగి కౌగిలిన నలుపన, ప్రేమ ఉపిరూదన ముద్దు ముద్దు బాసలతో                 ధన్యజీవిగ వెలిగిపోనా...!                             మురిపెంగా చూసుకొనా ------------------------------------------------------------------- రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు