పోస్ట్‌లు

నా సోకు గత్తెకు స్వాగతం..!

చిత్రం
  సరసాల సావిడిలో పండగ ఘుమ ఘుమ లోగిలిలో మధురసాల నీ చల్లని ఒడిలో మృధువగు నీ చెక్కిలి కెరింతలలో గోపుర మణి ఎత్తులలో తీగ వంకల నడు కెంపులలో రాజహంస నడకలో రాజసం ఉంది సుమ నీవే నా దైవపు ప్రతిమ శ్రుతి నీ మాట, లయ నీ ఆట సరిగమలు నీ మేనులో పుట్టిన వంపులు నీ కదలికతో మారిన ఆకృతులు అవే మన పెళ్లి పండగకి బహుమతులు కరుణివో, రమణివో మధువులో సుమ రాణివో కన్నులు తెరువగనే కానవచ్చు ఆలివో కురుల సామ్రానితో ఇంట తిరుగు ఇల్లాలివో అదరముల పై కాచి వేడి రసంబులిడు అర్థాంగివో ఉదయ సంధ్యల నడుమ అలుపులేక నీ ప్రేమ లోకమున ఊరేగించు దేవతవో నా ప్రాణ ప్రియ దేవతా పుష్పానివో శుభోదయమా వందనం నా సోకు గత్తెకు అభివందనం...! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

ఉత్తమ సాహితీవేత్త (ఉగాది) పురస్కారం-2021

చిత్రం
 జోర్ధార్ తెలుగు దినపత్రిక వారు తెలుగు భాషా సాహిత్యంలో విశిష్ట కృషికి గాను అందించిన ఉత్తమ సాహితీవేత్త (ఉగాది) పురస్కారం మరియు ప్లవ నామ వాసంతి కవితా సంకలనం లో నా కవిత 🙏 ఉగాది శభాకాంక్షలతో...! తెలుగు సంవత్సరాది ఉగాది, తెనుంగు సంసృతికిది పునాది చిగురు తోడిగేను ఊరి పానాది, చిందు లేసెను మా మదిసౌధి సాంప్రదాయము కాదు దయ్యం, సంపాదనే కాదు ద్యేయం జ్ఞానమేమి వనరుకాదు, ధనం తెచ్చే ఎరువు కాదు  జనవరిని జాతరనకు, కొత్త సాలును యాది మరవకు పంచాంగ శ్రవణం రేపటికి బరొసా, షడ్రుచుల పచ్చడి బతుకు తమాషా పాత రోజుల యాది, రేపు రూపం ఎది..? నేడు మాత్రమే నీది నేడే నిజం వద్దురా బేసిజం సాయగుణం నలుగురికి ప్రయోజనం  పండగని పోంగి పోకు నీ కడుపు నింపుకు నిద్రపొకు ఒక్కరికైనా అన్నం పెట్టు స్వర్గం అను కోటకదియే మొదటి మెట్టు స్వార్ధం కూడే ధనార్జన వీడు పాపపుణ్యాల చదరంగం లో నిచ్చెనే జయం రా నలుగురు మెచ్చేలా బ్రతకరా సహో అనాలన్న సహస్రాబ్ది కి నీవు గుర్తుండాలన్నా మంచిని పెంచు కీడును తుంచు  నేర్పు నీది కావాలి మార్పు సమాజానికి రావాలి శ్రీ ప్లవ నామ సంవత్సర శుభాలు నీకే  ఏ వ్యయాలు లేని జయాలు మీకే రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

అందాల నీ రూపు అతివలకె తలవిరుపు (బిన్నంగా)

చిత్రం
  నీ రూపమే సుజల అమృతం నీ నవ్వే నాకు మరుల దీవెనం నీ సోయగం సిరుల తాపనం అన్నుల మిన్నుల లేదు లేదు ఈ అందం విరుల మారాణి నిత్య నీ యవ్వనం నా కనుల ముందరే సాగింది నృత్యమై.. అందాల నీ రూపు అతివలకె తలవిరుపు నీ అంద వర్ణణకు కవికులకు బహు బెణుకు ఎంత పొగిడినా గాని కలదురా వెలతి ఎన్ని జన్మల పుణ్య ఫలము నా కనులది నిన్ను చూస్తూ ఉంటే ప్రాణమే ఆగది ఆడ జాతిలో నీవు మేలైన దానివి జనం నిన్ను చూడ బారులే తీరని నీ కాలు తొక్కించి ఆశీర్వదించని చేతులనే పూబంతులుగా మలిచి పరుస్తాను నీవు రావగా జూసి కనుల నిన్ను దాచి, కన్నీరు తుడిచి కర్మ ఫలములెల్ల అనుకూలగా జేసి అందలం లేకున్న, మేడ మిద్దెలు బోగ భాగ్యాలు రాకున్న నా గుండె రాజ్యాన పట్టపు రాణిగా నన్ను పాలించవే నాకు ఆర్ధాంగిగా మన జంట నూరేళ్ళు హాయిగా ఉండని పిల్ల పాపల తోని చల్లగా వర్దిల్లి కాటికైన మనం కలిసే చేరాలి కాయమున్నన్నాల్లు కాస్తాను మిమ్మల్ని... రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

మరణించినా మరచిపోలేని ప్రేమను నేను...! (తిరస్కరణ)

చిత్రం
  ఎడారిలో సంద్రం లా నీ ప్రేమ ధార పొంగిందని అది ఆ క్షణం అమృతమై నన్నింతకాలం ఓదార్చిందని నా ' నీ ' అను పదాలు మాసిపోయి మన అను భందమేదో నెలకొని ఇల నన్ను నిలిపిందని నీకు నే అనేకానేక మార్లు విన్నవించాను నినదించాను, నివేదించాను నీ ప్రేమ వర్ష ధారల తడిసి మోడు నా మనసు పులకించిందని పూ రేకులా వికసించిందని నీకు తెలిపాను, తేటతెల్లం చేశాను అర్హత లేని అలగా వానిగా ఈనాడు నీ ముందు కూలపడ్డాను ఆసరా అందించే ఆపన్న నీ హస్త బంధాన్ని అశ్రు ధారలతో ఆలింగనం చేయాలనుకున్నా నా అభిలాషను నిజం చేయాలనుకున్నా నిన్ను దూరం చేసుకుని తెరచాప కూలి, చుక్కాని విరిగి ఒళ్లు చిల్లులు పడిన నావలా గమ్యం మరిచి రేవును విడిచి నీ ముందు దీనంగా కూర్చున్నాను గత్యంతరం లేక కాలగతిలో కరిగి తరిగి చిరిగి మునిగిపోతున్నాను ఒక్కసారి నిన్ను చూసి కన్ను మూయాలనే ఆలోచనలో ఉన్నాను..! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు (అనే అక్షరం అక్షయమై నిలిచింది)

చిత్రం
  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు (అనే అక్షరం అక్షయమై నిలిచింది) కల్వకుంట్ల వంశానికి కీర్తి పతాకమై రాఘవరావు వెంకటమ్మ కలలకు రూపానివై చంద్రుడల్లే గోచరిస్తు ఒడిలో నువు చేరావు కన్నతల్లి దీవెనతో మా గతిని మార్చ కదిలావు చంద్రశేఖరుడను నామంతో చిరంజీవివయ్యావు అరవయ్యేళ్ళ గోస చూసి రుద్రుడల్లే రగిలావు పరాయి పాలనపై కళ్లునురిమి ఉరికావు అయ్యోనివా పాలోనివిరా బై అని అడిగి కడిగేసావు ప్రో.జయశంకర్ సార్ ఆశయాల శిష్యుడవై రాజకీయ శక్తితోనే స్వరాష్ట్రం సాధ్యమని తెలంగాణ రాష్ట్రసమితి స్థాపనకై కదిలావు మలి తెలంగాణ ఉద్యమానికి రథ సారధివయ్యావు చలిచీమల దండువోలె సబ్బండ వర్ణాలను పోగేసి విషనాగుల తరుముటకై జంగుసైరన్ మోగించావు సకల జనుల తరుముటకై జంగుసైరన్ మోగించావు కవి గాయకులతో చేరి చలో ధూంధాం అని గర్జించావు గొచి ఊడపికి మరి సరిహద్దులు దాటించావు స్వరాష్ట్రమా కల కాదు కదా! అని విస్మయం కలిగిస్తూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమని సగర్వంగా వినిపించావు హృదయ సింహాసన డోలిపై ముఖ్యమంత్రివయ్యావు ఈ రోజుకు మా జీవితాల్లో నవ్వు పూవు చేరింది ప్రతిదినం పండగల్లే ఇల్లు వాకిలి పూసింది వర్ధిల్లు దైవమా, ఉద్యమ జోహార్లు నాయకా.. నా

దొంగ సొమ్ము..⚖️ (గూట్లో ఉంది)

చిత్రం
  దొంగ సొమ్ము.. ⚖️ (గూట్లో ఉంది) జీవిత పరమార్ధం ఇదేనా, దొంగిలించి దాచుడెనా మానవ జన్మ విధాత చేతిలో మరల బొమ్మ అలరించేది, ఆడించేది అంతా వాడయినపుడు లోభిగ మారి చేసేదెంటి నల్లధనం తో వెలిగేదెంటి దేశ సంపదకు రెక్కలు కూర్చి పరదేశానికి పరుగున చేర్చి ఏన్ని బ్రతుకులు కూల్చావో ఏన్ని ఆశలు రాల్చవో దొరికిన వాడు దొంగంటారు దొరకక పోతే రాజవుతాడు ఏదో నాడు దొరక్కపోరు రోడ్డున పెట్టి ఉమ్మకపోరు అన్ని తెలిసిన భారత ప్రభుత్వం అడుసుగనే అది చూసిన కాలం ప్రజలు ఊరికే ఉండరు సుమ్మి బట్టలు పీకి తంతరు తమ్మి...! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

నీ భారతాన్ని హాత్తుకో, నీ జానతనం దాచుకో..!

చిత్రం
  పాశ్చాత్య  సంస్కృతి (Fashion) అంతరించే మానవ సంబంధాలు  అంతేరుగని నాగరిక ప్రపంచాలు  వీరి దారి ఏ వైపు  ఈ అలంకారం ఏ మేరుపు  నీ అహాంకారం ఏవరి గెలుపు  అంత:సౌందర్యానికి బావ్య సౌందర్యానికి  అంతరుద్యం లేదా..? అరకొర దుస్తుల్లోనె ఆనందం ఉందా  సాంప్రదాయం అనె మాట గుర్తుకైన లెదా  మనసుల్లొ అలొచన మచుకైన రాదా  ప్రాచీన సంస్క్రుతికి మచ్చ తెచ్చినారా  పరాయి దేశాలకు వీరు దాసులెనా  కోత్త కోత్త హంగులలో కూరుకున్నారా తేరుకోలేరా  ప్రపంచమె కొనియాడిన నేల నాడు  కోరివి అంటి వివస్త్రగా మారెను ఈనాడు.. నీ భారతాన్ని హాత్తుకో, నీ జానతనం దాచుకో..! ---------------------------------------------------------+++🪄 రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు