పోస్ట్‌లు

నీ నవ్వే నా హృదిస్పందన...!

చిత్రం
  నీ నవ్వే నా హృదిస్పందన...! నా మస్తిష్కం లో నెలవై అక్షరాల మాలకూర్చే అలౌకిక శక్తినివ్వు నా మనసు గెలిచిన మహారాణివి నువ్వు నా కన్నుల తేలు వెలుగు రాసివి నువ్వు నా పెదవుల చిరునవ్వు పూయించ కదిలిన పారిజాతము నీవు నా శ్వాసలో కొలువు తీరిన దేవత నీవు నా జన్మ జన్మల పుణ్య ఫలముతో దొరికిన అదృష్ట తారక నీవు, నీ నవ్వు నీ నీడలో నేను నీ చెంత నా మనసు నీ పాదాలపై నా తనువు నా పరిసరాల తిరుగాడుతూ నన్ను పదే పదే చైతన్యం చేయు నీ నవ్వు నీ నవ్వుకై ఏమైనా చేస్తాను నీ నవ్వే దివెనగా తలుస్తాను ఎందుకంటే......! నీ నవ్వే స్పందనగా నడచు నా హృదయ యంత్రం ఆగిపోతుంది... రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

అందంగా ఆ'కట్టు'కునెలా....!

చిత్రం
  అందంగా ఆ'కట్టు'కునెలా....! అంజలి దేవి, సావిత్రి జయసుధ, జయప్రద మధుబాల, శ్రీదేవి ఆ తరం అందం వారిది ఈ తరం అందం నీది అబ్బా అబ్బబ్బ తన వెలుగు మోము, చూడనెంత సక్కన తన చెంత చేరి నిలిచానో, నేను కూడ వెలగనా పాలపుంత ఒడిలోన ఎన్ని గ్రహలుండినా తన చల్లని ఒడిలోన నా బ్రతుకే పండదా జానకమ్మ, సుశీలమ్మ, శైలజమ్మ, చిత్రమ్మ ఆ కాలం తీపి రాగం వారి సొంతం కోకిలలే చిన్నబోవు, జుంటి తేనె ఉటలూరు చెరుకు గడలు మాసిపోవు, కంఠస్వరం నీ దాసోహం దివి తార నెలజారి వంగినట్టి నడువొంపు నెలవంకే సేదతీరి అదిమి చూడు అను కెంపు ఆహా ఆ నడక చాలు కుర్రకారు బేజారు తన అంగీకార సంజ్ఞ కొరకు ఇంటి చుట్టు పరిచార్లు మల్లియలే పరిమళాన్ని ఆ తనువుకు అద్దెనేమో వెన్నెలలే తన యదనుపూసి నాకు వెలుగు పంచెనేమో నీ నవ్వుల గారడికి చింతలన్ని తీరునేమో అందినదా నీ చేయి, అదృష్టం లే హాయి దొరికినదా తన తోడు, నాకు లేదు ఏ కీడు తన నీడనే నాకు వెలుగు, తను లేని నే మోడు చలనమున్న శిలాజం, అస్తమించు రవి కిరణం...! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

కవిత కన్నులు....!

చిత్రం
కవిత కన్నులు....! మనసు పడిన ప్రేయసి, నవ్వు నేర్పిన నా ప్రియ సఖి కవితే నా కన్నులు, ఈ అక్షరాలే నా మది పలికే ఊసులు కవి ఆలోచనలకు మనసు వారధి, కవికి మెదడు మనోరధి కలమునకు ఉండదు ఈర్ష ఏది, రాసే కాగితం మాకు అమ్మ చెవి రాస్తాము మెదడుకు సానపట్టి, కలానికి భావాలను లంకెపెట్టి ఇది ఒక యాగము, అందరికీ దక్కని రాజయోగం నీ చప్పట్లే రాజపూజ్యం, నీ నగుమోముకు నే దన్యము అబద్దాలు కావు ఇవి, అందమైన ఆకృతులు మనసును మురిపించి ఆనందింప చేయు కీర్తి పతాకలు కవి కళ్ళతో చూడు అంతా నికే తెలియు కవి మనసుతో ఆలోచించు నీకంతా బోధపడు ఇది నిజం, నువ్వు కాదన్న నా కవితకు ఎది ఆదరణం నీది నాది ముచ్చటైన బంధం, మనం లేని ఈ జగతి వ్యర్థం కవితే మన అనురాగానికి ప్రతిరూపం కవితే మన మమకారానికి మరో అర్థం నీ నీడలోనే నా బ్రతుకు, నీ చేతిలోనే నా భవిష్యత్తు ఏ వేళ అయినా, ఏ రోజుకైనా కలిసే ఉందాం, కలిసే పోదాం..! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

ప్లవ నాయకి (The Love)..!

చిత్రం
ప్లవ నాయకి ( The Love )..! చెప్పనా చెలి! నీతో ఓ మాట చెప్పనా? ఆలన, నీ పాలన నాదిగా చెప్పనా కలువ కన్నులు నీవి, కాదనగలరా ఎవరైన సర్వ దేవతలు నీ దాసులని ఒప్పక తప్పునా.....! హిమల పవనములే కదిలి వచ్చి, నీ కురులను ముడవగా తొలకరి జల్లుల తడిసిన నేల, వీచే గంధం నీ మేనుకు అద్దగా గట్టి భూమిలో మెత్తటేరులు పొరలు కోయును, నీ కోపం మత్తడి తెగి ముంచకుండ కట్టవేయును, నా మది భాగం నీ కోపమే సంద్రమైన, నావికుడినై నేనోస్తా నీ మనసు గీటీ కవ్విస్తా, నీ ప్రేమ పొంది గెలిచోస్తా వెన్నెలనే రాట్నమలికి తెల చీరగ తెచ్చిస్తా మేఘాలను పూలు చేసి నీ కొప్పున ముడిచోస్తా చెందురునే పట్టి తెచ్చి నీ అరికాలికి చుక్కెడతా సూర్యుడిని తోలుకొచ్చి నీ గుమ్మంలో గుమ్మడిగా నిలబెడతా పంచ భూతాలు నీ వాకిటిలో, నవగ్రహాలు నీ కనుసన్నలలో ఈ జగతిని శాశించగ లేవా, భారతావనికి మహరాణివి కావా నా మది సింహాసనం అలంకరించి నవ నాయికగా వెలగవా.....! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

కథలో నిజానికి ఆడదంటే? (చివరి భాగము)

చిత్రం
ఆడుదాని మాయా,మర్మము తెలుసుకోవడం ఎలా? ఒకానొక కాలంలో ఒక రాజు దీర్ఘాలోచనలో పడ్డాడు అసలు ఆడుదాని యొక్క మనస్తత్వము, ఆలోచన సరళి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని అందుకు గల మార్గాన్ని అన్వేషించనారంభించాడు కానీ అతనికి ఏ మార్గము కనిపించకపోవడంతో కాస్త నిరాశ చెంది బేలగా కూర్చున్నాడు, అది గమనించిన అతని భార్య రాణిగారు ఎందుకు అలా దిగాలుగా ఉన్నారు అని ప్రశ్నించింది దానికి సమాధానంగా నేను ఎన్నో రోజులుగా ఆడవారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని లోతుగా అన్వేషణ సాగించాను కానీ నాకు ఎలాంటి మార్గము కనిపించలేదు, కానీ కొన్ని రోజులుగా మన రాజ్యం మధ్యలోని చేద బావి దగ్గరకు వెళ్లి కూర్చుంటున్నాను చాలామంది మహిళలు నన్ను చూసి దగ్గరకు రావడానికి కూడా జంకుతున్నారు.  అలా కొన్ని రోజుల తర్వాత ఒక ఆడది ధైర్యంగా బావి దగ్గరకు వచ్చి నీళ్ళు చేదడం ప్రారంభించింది, అయిపోగానే నేను ఆ ఆడుదాన్ని అడ్డగించి ఇలా అడిగాను ఆడదాని యొక్క మర్మము, మాటలలోని ఆంతర్యం తెలుసుకోడం ఎలాగో తెలపమని దానికి సమాధానంగా తను నాకు ఒక మాట చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది అది ఏమిటంటే రాజా ఇది సమయము కాదు, సందర్భం కాదు కానీ మీరు అంత దిగాలుగా కూర్చున్నారు కాబట్టి నేను మీ

స్త్రీ ఆలోచనా విధానము - వింత ప్రకృతి (అష్టమ భాగము)

చిత్రం
స్త్రీ ఆలోచనా విధానము....! స్త్రీ బావ్యాప్రపంచంలో వ్యవహరించేటప్పుడు చుట్టూ ఉన్నవారి మెప్పుకోసమే చూస్తుంది, ఊహలో రాజకుమారుడు, లక్షలు సంపాదించేవాడు, అడులకు మడుగులోత్తు బానిసని కోరుకుంటుంది, తన చుట్టూ వున్నవారు తనని చూస్తున్నారా లేదా అని పరిశీలించే అలవాటు చిన్నతనం నుంచి వస్తుంది, తల వంచుకునే అన్ని వైపులా గమనించడం స్త్రీ ప్రత్యేకత, తూర్పు వైపు చూసి ఎడమవైపు ఏముందో చెప్పగలదు, దక్షిణం వైపు చూసి ఉత్తరం వైపు ఏముందో చెప్పగలదు. ఆడది తనను రక్షించే మగాడు కావాలని కోరుకుంటుంది, అప్పుడప్పుడు ఆ మగాణ్ణి పరీక్షిస్తుంది కూడా, లోగుబాటు తనం ఎంత ఉందో పగబట్టి కసితీర్చుకునే తత్వంకూడా అంత ఉంది, నవ్వుతూ విషం ఇవ్వగలదు, పాడుతూ ప్రాణం తియ్యగలదు, తనకు తగ్గ మగాడు దొరక్కపోయినా తీర్చిదిద్ది పది మందిలో నిలబెట్టగలదు. యుద్ధం చేస్తుంది, యుద్ధం ఆపిస్తుంది, నరకములో నెడుతుంది, స్వర్గాన్ని చూపిస్తుంది, అంతా ఆడదాని చేతిలో పని అనుకున్నది నెరవేరేదాకా నిద్రపోదు, అందుకు సాధనగా అన్ని మార్గాలు వెతుకుతుంది, మానసికంగా ఎంత దృఢంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుందో అంత చపల చిత్తముతో మగాడి మాటలకు లొంగిపోతుంది. తనకు కానప్పుడు ఇతరులకు దక్కకూడదన్న

వివాహము - తొలి సమాగము (సప్తమ భాగము)

చిత్రం
వివాహము - తొలి సమాగము....! ఏడు అడుగులతో ముడిపడి నూరు వసంతాలు రెండు దేహాలు ఒకే ఆత్మగా రూపం దిద్దుకునే కమ్మని ఘట్టాన్ని నా సప్తమ భాగములో వివరించడం ఒక విశేషమే! స్త్రీ పురుషులు : సాంఘికముగా ఏనాటికైనా వివాహము చేసుకోవాల్సిందే, స్త్రీ పురుషులు చాలా వరకు చేసుకుని లేదా చేసుకోవాలని తాపత్రయపడతారు, స్త్రీ పురుషులిద్దరూ కలిసి సమ్మతముతో పెళ్లి (ఆర్థిక, లైంగిక, రక్షణ అవసరముల నిమిత్తము, సంఘాభివృద్ది నిమిత్తము) చేసుకుంటారు, భారతదేశంలో విహవా వ్యవస్తను పవిత్రంగా భావిస్తారు, భార్య మళ్ళీ పెళ్ళి చేసుకోవడం కంటే చావడానికి సిద్ధపడుతుంది. కొన్ని దేశాలలో మాత్రం ఆడ మగలిద్దరూ సమాన స్వతంత్రము హక్కు కలిగి ఉండి కొన్ని సంవత్సరాలపాటు భార్య భర్తలుగా కాంట్రాక్టు పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది, ఇప్పుడిప్పుడే కాంట్రాక్ట్ వివాహ పద్ధతి రద్దుచేయడానికి ఆలోచిస్తున్నారు, పురుషుడు ఆడవాళ్లపై పెద్దరికం వహించడం క్రమంగా తగ్గిపోతుంది, జీవితంలో స్త్రీలకి పురుషుడు, పురుషుడికి ఆడది అవసరం, కానీ ఆడది మగవాడిని పొందడంలో స్వతంత్య్రాన్ని కోల్పోతుంది. పురుషుడు పెళ్లి చేసుకున్నా స్వతంత్ర వ్యక్తే, పిల్లలు కనడం, గృహ నిర్వహణ ఆడవారి భాధ్యత, వచ్చిన