పోస్ట్‌లు

పెళ్ళాం ఊరెళితే..?

చిత్రం
  ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్ళకూ...! అమ్మి నాకియ్యల సెలవు ఒరయ్యో నాకియ్యాల సెలవు ఇది ఎన్నడు వినని పదము అంటుంటే బాగుందే స్వరము తోలిచేను మనసును మెదడు తడిమెను జెబును అగడగడు సినిమాకు పోతే బెటరు ఎక్కేస్తా జెల్దిన స్కూటరు పట్టెను భాగ్యము నుదురు తిరిగొస్తా తెలియని బజారులు..! కుషాల ఉంది మనసు తెగ హుషారుగుంది వయసు ఇరుపక్కల చూస్తే సొగసు హూ కొడితే అవుతా రివర్సు ఇదేమి బుద్ది అనకు....🧖 నాకియ్యాలా చుట్టి అని నీవు మరువకు చికెన్ తెచ్చిన మటన్ తెచ్చిన చూడు అరె బ్రాందీ కీసల ఉడక పెట్టిన మాడు కడుపునిండ తిని గురుక పెట్టితే నేడు ఇన్ని రోజులకు సందు దొరికే నాది తీడు నాది తీడు నాది తీడు మామ..........🤙                                       రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు నోట్ : ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్ళకూ (పెళ్ళాం ఊరెళితే) మొగుడు అతని ఆర్భాటం ఇదేనేమో...😀

వీడుకోలు వేడుక (Happy Trails)

చిత్రం
  వీడుకోలు వేడుక ( Happy Trails ) అజ్ఞానపు పందెరాన్ని తొలగించే తరుణాన విజ్ఞానపు దిపాలై వెలుగునిచ్చే మందిరాన వరుణునిలా జాలిపంచు ఆత్మీయపు స్నేహన తరుణునిగా తోడు నిలుచు అనుబంధపు నీడన సత్సంభంద భాందవ్యపు తీపి రుచులు చూసాము సోదరి సహోదర భావాన సంతృప్తిగా మసిలాము ఒడిదుడుకుల గాడి దారి బడి చేరగ కుదురుకుని తడి కన్నుల తడుముకుని తన్మయంగ తేరుకుని మిము వీడే వేడుకను కనులింపుగ నింపుకుని జ్ఞాపకాల పూగుత్తుల బహుమతులను పంచుకుని తరలిన ప్రతి దారులన్నీ విజయాలను నింపుకుని నూరేళ్ళు నిలిచిపోవు కిర్తులెన్నో అందుకుని స్పూర్తినిస్తూ నడిచాము సూత్రప్రాయంగా కదిలాము మిత్రులారా నేనుంటా....🙋 మీరోదిలిన గురుతులన్ని గుండెల్లో దాచుకుంటా....! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు ఈ విద్యా సంవత్సరం ముగించుకుని ఆ పై తరగతులకు వెళ్ళే విద్యార్థులకు, విద్యార్జన ముగించుకుని కోరుకున్న గమ్యం వైపు సాగే ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలు తెలుపుతూ అల్ ది బెస్ట్.....

సౌందర్య గళార్చన...!

చిత్రం
  సౌందర్య గళార్చన...! ప్రియా...... సుందర కాంతులీను సుమప్రభ నిన్ను చూడనే తొలగు నీడ, పీడ నిన్ను పలకరించిన చాలు జన్మకిగ నిన్ను చూసిన నా కన్నులలో కళ నిన్ను తాకగానే ఒళ్ళు పులకింతలే భళ కందిరీగ నడుము, కాంతులీను ముదము నున్ననైన బుగ్గ, దొర మామిడి మొగ్గ వెన్నెలోలే కన్నులు, కన్నులే కావు మొల్లలు తామరాకు మోము, తాయిలాల పెదవి ముద్దు ముద్దుకు తీపి తేనెలేవూరు ఒంపులూరు కెంపు కన్నుల్ల నిండు నిద్రమాని తనువు ఊల్లేళ్ళ తిరుగు హృదయమంత అలిగి నీ కొరకు వెదుకు అల్లతారకల్లే ఇలన నెమలి మల్లె చిలుకు తొలకరి జల్లు, నొచ్చు తీయగ ముళ్ళు మల్లె తోపులోన అలరారే చెమ్మ కన్నెలెందరికన్న తీరైన కొమ్మ తనువంత తన ప్రేమ నిండుగా పండెను కలలాంటి జీవితం రంగులే నిండెను.....! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

నీ నవ్వే నా హృదిస్పందన...!

చిత్రం
  నీ నవ్వే నా హృదిస్పందన...! నా మస్తిష్కం లో నెలవై అక్షరాల మాలకూర్చే అలౌకిక శక్తినివ్వు నా మనసు గెలిచిన మహారాణివి నువ్వు నా కన్నుల తేలు వెలుగు రాసివి నువ్వు నా పెదవుల చిరునవ్వు పూయించ కదిలిన పారిజాతము నీవు నా శ్వాసలో కొలువు తీరిన దేవత నీవు నా జన్మ జన్మల పుణ్య ఫలముతో దొరికిన అదృష్ట తారక నీవు, నీ నవ్వు నీ నీడలో నేను నీ చెంత నా మనసు నీ పాదాలపై నా తనువు నా పరిసరాల తిరుగాడుతూ నన్ను పదే పదే చైతన్యం చేయు నీ నవ్వు నీ నవ్వుకై ఏమైనా చేస్తాను నీ నవ్వే దివెనగా తలుస్తాను ఎందుకంటే......! నీ నవ్వే స్పందనగా నడచు నా హృదయ యంత్రం ఆగిపోతుంది... రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

అందంగా ఆ'కట్టు'కునెలా....!

చిత్రం
  అందంగా ఆ'కట్టు'కునెలా....! అంజలి దేవి, సావిత్రి జయసుధ, జయప్రద మధుబాల, శ్రీదేవి ఆ తరం అందం వారిది ఈ తరం అందం నీది అబ్బా అబ్బబ్బ తన వెలుగు మోము, చూడనెంత సక్కన తన చెంత చేరి నిలిచానో, నేను కూడ వెలగనా పాలపుంత ఒడిలోన ఎన్ని గ్రహలుండినా తన చల్లని ఒడిలోన నా బ్రతుకే పండదా జానకమ్మ, సుశీలమ్మ, శైలజమ్మ, చిత్రమ్మ ఆ కాలం తీపి రాగం వారి సొంతం కోకిలలే చిన్నబోవు, జుంటి తేనె ఉటలూరు చెరుకు గడలు మాసిపోవు, కంఠస్వరం నీ దాసోహం దివి తార నెలజారి వంగినట్టి నడువొంపు నెలవంకే సేదతీరి అదిమి చూడు అను కెంపు ఆహా ఆ నడక చాలు కుర్రకారు బేజారు తన అంగీకార సంజ్ఞ కొరకు ఇంటి చుట్టు పరిచార్లు మల్లియలే పరిమళాన్ని ఆ తనువుకు అద్దెనేమో వెన్నెలలే తన యదనుపూసి నాకు వెలుగు పంచెనేమో నీ నవ్వుల గారడికి చింతలన్ని తీరునేమో అందినదా నీ చేయి, అదృష్టం లే హాయి దొరికినదా తన తోడు, నాకు లేదు ఏ కీడు తన నీడనే నాకు వెలుగు, తను లేని నే మోడు చలనమున్న శిలాజం, అస్తమించు రవి కిరణం...! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

కవిత కన్నులు....!

చిత్రం
కవిత కన్నులు....! మనసు పడిన ప్రేయసి, నవ్వు నేర్పిన నా ప్రియ సఖి కవితే నా కన్నులు, ఈ అక్షరాలే నా మది పలికే ఊసులు కవి ఆలోచనలకు మనసు వారధి, కవికి మెదడు మనోరధి కలమునకు ఉండదు ఈర్ష ఏది, రాసే కాగితం మాకు అమ్మ చెవి రాస్తాము మెదడుకు సానపట్టి, కలానికి భావాలను లంకెపెట్టి ఇది ఒక యాగము, అందరికీ దక్కని రాజయోగం నీ చప్పట్లే రాజపూజ్యం, నీ నగుమోముకు నే దన్యము అబద్దాలు కావు ఇవి, అందమైన ఆకృతులు మనసును మురిపించి ఆనందింప చేయు కీర్తి పతాకలు కవి కళ్ళతో చూడు అంతా నికే తెలియు కవి మనసుతో ఆలోచించు నీకంతా బోధపడు ఇది నిజం, నువ్వు కాదన్న నా కవితకు ఎది ఆదరణం నీది నాది ముచ్చటైన బంధం, మనం లేని ఈ జగతి వ్యర్థం కవితే మన అనురాగానికి ప్రతిరూపం కవితే మన మమకారానికి మరో అర్థం నీ నీడలోనే నా బ్రతుకు, నీ చేతిలోనే నా భవిష్యత్తు ఏ వేళ అయినా, ఏ రోజుకైనా కలిసే ఉందాం, కలిసే పోదాం..! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

ప్లవ నాయకి (The Love)..!

చిత్రం
ప్లవ నాయకి ( The Love )..! చెప్పనా చెలి! నీతో ఓ మాట చెప్పనా? ఆలన, నీ పాలన నాదిగా చెప్పనా కలువ కన్నులు నీవి, కాదనగలరా ఎవరైన సర్వ దేవతలు నీ దాసులని ఒప్పక తప్పునా.....! హిమల పవనములే కదిలి వచ్చి, నీ కురులను ముడవగా తొలకరి జల్లుల తడిసిన నేల, వీచే గంధం నీ మేనుకు అద్దగా గట్టి భూమిలో మెత్తటేరులు పొరలు కోయును, నీ కోపం మత్తడి తెగి ముంచకుండ కట్టవేయును, నా మది భాగం నీ కోపమే సంద్రమైన, నావికుడినై నేనోస్తా నీ మనసు గీటీ కవ్విస్తా, నీ ప్రేమ పొంది గెలిచోస్తా వెన్నెలనే రాట్నమలికి తెల చీరగ తెచ్చిస్తా మేఘాలను పూలు చేసి నీ కొప్పున ముడిచోస్తా చెందురునే పట్టి తెచ్చి నీ అరికాలికి చుక్కెడతా సూర్యుడిని తోలుకొచ్చి నీ గుమ్మంలో గుమ్మడిగా నిలబెడతా పంచ భూతాలు నీ వాకిటిలో, నవగ్రహాలు నీ కనుసన్నలలో ఈ జగతిని శాశించగ లేవా, భారతావనికి మహరాణివి కావా నా మది సింహాసనం అలంకరించి నవ నాయికగా వెలగవా.....! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు