పోస్ట్‌లు

ఏప్రిల్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

ఉద్యమ నాయకుడు, ప్రజా సేవకుడు..!

చిత్రం
ఈ ఆటవిక లోకంలో దైవత్వం అందత్వం పొందింది న్యాయదేవత కళ్లుకట్టి, అన్యాయం సృష్టించే అలజడులు బడుగు పేదల ఆక్రందనలను బోయిల పాటలు గా విని ఆనందిస్తున్నారు ధనికుల ఇంటి గుమ్మాలకు, శోభావైబోగాలకు నా శ్రామికులు శ్రమ దోపిడీకి గురవుతున్నరు సమానత్వం, స్వేచ్చ, స్వతంత్రం ప్రజల కోసమే అన్న మాట అవాస్తవం అని రుజువయ్యింది మనిషిని మనిషే పిశాచాల్లా పీడిస్తున్నరు అధికారం ఉన్నొడికే అన్ని పూటలా విజయం వరించి ఆకలి కేకల ఆక్రందనలు చిన్న చూపు చూస్తున్నరు ఆ అరాచకాలు, దురాగతాలు, ప్రశ్నించే జాతి పురుషునికై భావితరాలకైన ఈ దుస్థితిని మాన్పు చేసే ధీశాలికై నా రాష్ట్రం కంట శోషతో ఎదురు చూస్తున్నది జీవించడం అంటే సంపాదన కాదని నలుగురిని నీడన చేర్చాలని రోదిస్తున్నది నిస్వార్థ రాజకీయ ప్రతిష్టాపనకై ఓ శక్తి కదిలి రావాలి రాజకీయకులకు చెంపపెట్టులా సిద్ధాంతాలు రచించాలి అలాంటి నాయకునికై నా జాతి నిరీక్షణ ఫలిస్తూ తన సన్నిధిలోనే రాష్ట్రప్రజలకు విమోచనమనిపిస్తూ 2000 సంవత్సరం శుభశకునం అనిపిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి మార్గమని భావిస్తూ అరవయ్యేళ్ళ చింత తీర్చే అసాధరణ శక్తివై ప్రో జయ శంకర్ సార్ ఆశయాల రూపనివై సబ్బండ వర్ణాల ఒక్కటి చేసి, చావు నోట్లో తలపె

దేశం లో రా'నీచ'జకీయం..👈

చిత్రం
ఈ దేశ భవితవ్యం  అంతరిస్తున్న మానవత్వం  బుద్ది లో దాగుంది అంగవైకల్యం  కంటతడి పెడుతుంది మా నేటితరం అదికార ధురాగతం, అభివ్రుద్దికి ఆమడ దూరం  పెద్దరికం ముసుగులోన ఆధిపత్య పోరాటం  దోరికినంత దోస్తారు, దోచినంత దాస్తారు  నిర్మూళన అనగానే సక్క గుద్ది వస్తారు  ఉద్యమాలు ఏవైన అనుకూలగ మలుచుకునురు  ఇదే నేటీ పాలన జాతికి పట్టిన కీడురా  నిద్ర మత్తు వదలరా నిగ్గుతేల్చ కదలరా  ఎన్నికలని వచ్చేరు ద్రావణములో ముంచేరు  సోమ్ములెన్నో పంచేరు కాలి ధూళి నంటెరు  ఓటు కోరకు పరిచార్లు గేలిచారో మరల రారు  పంచినంత కూడబెట్ట పన్నాగం పన్నేరు  “Divide and Rule” Britishers ని మించిపోయారు  అభివ్రుద్దికి మాల వేసి కులం మతం ముందు వేసి  మంచి తుంచి ముప్పు పెంచి గిరి దాటని భంటు చెసి  భుజం కాసె జెండా మోసి, భజనేనా బతుకు సి సి  గురువింద గుంజ తీరు, ఆ ఉసరవేల్లి వీరు  సంపాదన నీ ద్యేయం, దోచుకోనుటే మీ నైజం.. రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

పోలిస్ మీకు మా సెల్యూట్..

చిత్రం
పోలీస్, అంటుంటెనే గుండెల్లో ఏదో గుబులు  కళ్ళళ్ళో చూసి మాట్లాడాలంటె ఓళ్ళంతా బుగులు దేశ సంరక్షణ భాద్యతలో మీతీరు మొగులు కరోనా నివారణలో మీ చర్యలు సొభగు సొభగు పొద్దుగూకులు కోలువు, తేలియని పదం సెలవు ఆలు బిడ్డలకు దూరం, రోడ్డు మీదనె పతేకం రాత్రి పగలను లేదు భేధం చెడును తరుముతూ సాగు నైజం పోలిసన్నా మీ త్యాగం మరవబోదు మా ప్రజా లోకం "పూలమ్మిన నేల మీద కట్టెలమ్మె దాపురికం" తప్పును దండించు చేయి దండాలని కదిలింది తండ్రి భాద్యతనేత్తుకుని గుమ్మం లో కోలువుంది యమ భటులను అడ్డగించి ప్రాణాలను నిలిపింది కన్న తల్లి మరణిస్తె కన్నీళ్ళను దాచినావు చివరి చూపు నోచుకోని శిలలాగా మారినావు "కన్న వారి కన్న దేశసేవే మిన్న"  అను సూక్తి బోదించావు నీ ఔదార్యం తో మా మనసులన్ని తడిచేసావు ప్రమాణం చేస్తున్నాం సార్.. మీ భాద్యత పంచుకుంటాం దేశాన్ని నెగ్గించుకుంటాం అతి చెష్టలు వదులుకుంటాం ప్రయాణాలు మానుకుంటాం భౌతిక దూరం పాటిస్తాం మీ కష్టానికి సలాంకోట్టి సహకరిస్తాం ప్రెండ్లీ పోలిస్ మాత్రమె కాదు మా రక్షణకు"ఓన్లీ పోలిస్" అని గోంతెంత్తి నినదిస్తాం.. రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

పారిశుద్య కార్మికుడు(సఫాయి)

చిత్రం
సఫాయి, నీవే మా సిపాయి శుచి శుభ్రతకు కలికితురాయి గోరువంక చూడగానే గాభరగా గల్లి దాటి చీపురుతో తనువు కలిపి చీకట్లను పరదా జరిపి ముక్కుదూల మదిరి పడే మోరి ధూళి తోడి మరి ఛి కొట్టే చెత్త నెత్తి, పావురంగ కుప్పనూర్చి కంపుకొట్టే పట్నానికి పాలతోలు కప్పినారు WMC కి మేమే నిజ సేవకులమని చాటారు సూర్యుడొచ్చి, నెత్తినెక్కి,అలసిపోయి,వాలిపోయి అర్దజాము దాటినా ఆగదు నీ ఆరాటం కంపుపిల్చి రొంపుతున్న తీరదు నీ పోరాటం  ఇన్నియెళ్ళ జీవితంలో గుర్తించని సాహసం వంగిన నీ వెన్ను ఎముక, చెరిగిన నీ చేయి రేఖ నీ పని నిండుగ దుర్గంధం ఆరోగ్యం జర భద్రం బురదంటిన బట్ట చూసి దూరంగా గెంటినం కరోనా దాపుకొచ్చి దాటింది నీ కీర్తి ఖండాంతరం.. సఫాయి, నీవే మా సిపాయి శుచి శుభ్రతకు కలికితురాయి నా పద కుసుమాలతో అల్లిన ఈ కవిత  మీ పాదాలకు అలంకరణ కాగలదని నా నమ్మిక..                            రచన : తాజ్  మీ పల్లెటూరి పిల్లోడు

చైత్రకు ఆశ్రు నివాళిగా (ఆడది అబల కాదు సబల)

చిత్రం
నాటకీయ నాగరికతలో  ఆడది ఆటవస్తువుగా పరిణమించింది సబల అని కీర్తించిన చోటే  అబలగా అనామకురాలు గా నీతి గతి మాలిన అమర్యాద అందలమెక్కినా మిన్నక ఊరకుండి పోయింది వట్టి పోయిన సిద్ధాంతాలు చిల్లులు పోయి పెల్లులా రాలే సాంప్రదాయానికి ప్రతికగా మార్పు గడించింది  స్త్రీని దేవతగా కొలిచిన నాడె ధీనంగా దిగంబరాన్ని చేశారు ఓనాడు (ద్రౌపది) అనుమాన భూతాలు హుంకరించి  అగ్నిలో తోశారు ఆనాడె (సీతమ్మ)  అనాదిగా ఆడ బ్రతుకు అడవి వెన్నెల  అది ఏ సౌఖ్యమూ నోచుకోని కాటి దివిటిరా  మగాని పాశనహ్రుదయానికి నాటి  ఆయేషా,స్వప్నిక, స్వాతి, రఫియ ప్రతీకలు  ప్రేమోన్మాదానికి కీచక పాలనలో  స్త్రీకి రక్షణ కరువని నేటి "ప్రియంకా రెడ్డి,మానస, దిశ, చైత్ర" నిస్సహయ మరణ నేత్రాలు  అవి పాలక వర్గాన్ని నిలదిసే జాతి జాగ్రుత విధాతలు  ఇది తలరాత కాదు అయ్యో ! అని బోరుమన  ఇది కర్మ ఫలము కాదు కారు చీకటిలో క్రుంగిపోవ  నిస్తేజమైన నిద్రలో జోగుతున్న అధికారుల కుంచిత స్వభావాలకు స్వస్తి పలుకగా  కోటి గొంతుకలు ఒక్కటై, కీచకుల కంఠమైన బుసలు ఈను కోరలనైన పీకి పాతరేయగా  పిలుస్తుంది భరతమాత సంకెళ్లను తెంపగా  అబల కాదు "సబల" అని నిరూపించగా అబల కాదు "సబల

ఏది దారి బిగుసు కుంటుంది ఉరి..

చిత్రం
ఇది కథ కాదు, నా వ్యధ బుద్ది తోలిచె ప్రశ్నలకు ఏది దారి అను శీర్షిక ఏది దారి బిగుసుకుంటుంది ఉరి మానవుడా కాస్త బద్రం మరి కోమ్ముల పురుగు (కరోనా) నీలొ చెరి రెండు వారాల్లో నీ పని హరి కరోనాతొ దేశాలన్ని కబళిస్తున్నాయి కన్నిళ్ళు యదతన్ని వెక్కిరిస్తున్నాయి ఎటు చూసినా మానవ కళేబరాలు అపశకునపు నీడలు, యుగాంతపు జాడలు సురా ముప్పై మూడు కోట్ల దేవతలున్న దేశం ఓళ్ళు ఎరుగని శివం ఉంటదా అను తర్కం మానుతున్న గాయల మీద వేడీ నీళ్ళు చల్లినట్టు అసలే ఆర్దిక మందగమనం ములిగె నక్క మీద తాటి పండు పడ్డట్టు ఇదేదో శాపం ఆద్యాత్మిక ధుని, విజ్ణాన ఖని అంటూ  మా దేశం అని బిర్రుగున్నా కంసాలి పని మొత్తం కంట్లోనె ఉన్నా  కారు పట్టరాదను శాత్రం అందరూ మేదావులే కాని అవసరానికి దాటెసుడే పేరుకు పండితుడె మత్రాలన్ని కంటస్తమె కాని గొంతు పట్టిందను నాటకమే ఇక పభుత్వాలు వాటి పథకాలు పబ్లిసిటి పీకు, పని తనం వీకు పాకురు బండ మీద పాయసం గిన్నె బోర్లించినట్టు మంచు ముద్దను ఇచ్చి భద్రం బిడ్డా అన్నట్టు ఇక ఈ దేశ పౌరులు ముష్టావతారం ఎత్తారు నాయకులు కోట్లు మింగి రెండు వేలు దర్మం చేస్తె చాలు కిం అనకుండా కుక్కిన పేనులా పడుంటారు అభివ్రుద్ది అనగానే ఎక్కడ సార్ ఎంత సార్

కరోనా నేర్పిన పాఠం(ఏరా మనిషి చెప్తే విన్నావు కాదురా)

చిత్రం
ఏరా మనిషి  చెప్తే విన్నావు కాదురా  క్రమశిక్షణ తప్పిన క్షమ కూడా లేదురా ఎదిరా నీ దర్పం, ఎక్కడరా నా నీ ధనం ఎంతరా నీ గర్వం, వచ్చింది రా నీ అంతం రెండు పూటల కాలాన్ని మూడు షిఫ్ట్ లుగ మార్చావు కాలచక్రాన్ని ఎదిరించి కాళ్ళకు చక్రాలు కట్టుకు తిరిగావు " ఏరా మనిషి చెప్తే విన్నావు కాదురా " "ఆఖరికి ఆరడుగుల జాగ" అను తర్కం  మరిచి అకాశహర్యాలు నిర్మించావు ఉన్న నేలను నాశనం చేసి మరో గ్రహం వెతికేవు పంచ భూతాలను జయించిన నీ గంభీర స్వరం  కంటికి కనిపించని జీవి ముందు బెరుమన్నావు " ఏరా మనిషి చెప్తే విన్నావు కాదురా " ఏమయ్యాయి నీ విలాసాలు ఎవరు చెప్తే వింటావు నీ లోపాలు ధనం కాదు బంధుత్వం శాశ్వతం కాదంటావా...? నేను అను మాట మరిచి నలుగురితో నడుస్తావా..! " ఏరా మనిషి చెప్తే విన్నావు కాదురా " ఇంకా మించిపోలేదు ఇకనైనా కళ్ళు తేరువు లోభిగా లాభపడలేవు, స్వార్థం తో. సాదించలేవు ప్రకృతితో విబెదించకు, ప్రగల్బం తో ప్రాణాలు బలిపెట్టకు మతం పేరుతో మానవత్వం నులి పెట్టకు "ఏరా మనిషి చెప్తే విన్నావు కాదురా" తల్లిదండ్రులను గాలికొదిలితివి భార్యాబిడ్డల గొసవెడితివి గవ్వలు ఎన్ని పోగేసినా గంజి నీళ్ళ

లాక్డౌన్ లో ముదిరిన ప్రేమ...!

చిత్రం
ఎర్ర రంగు వలువతో ఎగిసి పడుతున్న ముంగురులతో చిరు గజ్జెల తాళమేస్తు చిరు మందహస హోయలు పూస్తు దరి చేరిన ఆమని తానె నా ప్రియమణి నీ రూపు నవ్వె, చూపు నవ్వె తనువు నవ్వె, తపన పొందె ఆ ఓర చూపు సోయగాలు కోప్పు మల్లె పరిమళాలు తన మాటలతో మత్తు చల్లి నా తనువును ఎత్తుకెల్లి తెల్లార్లు ఊసులల్లి స్వర్గాన్ని చుట్ట చుట్టి అదరాలతో మడత పెట్టి అందించెను కిల్లీ కట్టి తడికారెసిన కురులు దూస్తు జారెసిన పైట ఓరలో ఫలాలెవొ వొలక బొస్తె చూసిన నా కళ్ళు రెండు రసాలన్ని జుర్రుకొస్తె అయ్యారె ఈ రేయికి నీ నవ్వె నజరానా ముందు ఎన్ని జన్మలైన నువ్వె నా తోడు కావా..! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

శ్రామిక వలస భారతం

చిత్రం
సందర్భం : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం  శ్రామిక వలస భారతం,  పుట్టిన చోట పట్టెడన్నం పుట్టని అగాతం వలస కూలి, కన్నిటి కేళి  రోజు కూలి, కడుపు ఖాళి ఇలా అన్నపుడు, మళ్ళి మళ్ళి విన్నపుడు  మనసు చెదిరి కన్నిళ్ళు నేల జారి  అమాయకంగా అడిగిన ప్రశ్నలు  తత్తరపడి జవాబు దొరకని తిప్పలు  బాద్యులెవరైనా భాద నిన్ను అలిమింది  కరోనా కక్షకట్టి నీ మెడకు ఉచ్చు బిగించింది  అన్నపూర్ణ అనె దేశం లో నీ ఆకలి ఏక్కడ తీర్చింది  నీ ఆకలి గీతం మన పాలెగాళ్ళకు ఏం నేర్పింది  కాంక్రిటు జంగలిలో బతుకన్నది భారమై  పరిమితికి మించి పనిగంటలతో ఒళ్ళు శల్యమై  అన్నమో రామచంద్ర అని అయినవాల్లకు దూరమై  స్వతంత్ర బారతం లో నీ ఉనికి ప్రశ్నార్దకమై  కన్నిళ్ళను బిగబట్టి, ఖాళీ పొట్ట చేతపట్టి  మరణం అనివార్యమని తలచితివా  అనాధలా కాక అయినవాళ్ళ మద్య  తనువు చాలించాలని ఆశనొందావా  గమ్యానికి, నీ సొంత గుమ్మానికి  కాలి నడకన చేరుకుంటావా  అలుపెరుగక వందల మైళ్ళు  గోదారిలా సాగిపోతావా  ఆకలి అక్రందనలు జీవితానుభవాలుగా వల్లెవేస్తు  కరోనా నేర్పిన పాటాలు కంటశోశతో ఆలపిస్తూ  దారి పొడుగున ఆపాత స్మ్రుతులు జారవిడుస్తూ  ఉండాలనె కోరిక మదిలో కొరుకుతున్నా వెళ్ళి పొతావా.! కారుతున్న