పోస్ట్‌లు

మే, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

వనజాక్షి..

చిత్రం
తొలకరి రాలిన వసంత వేళ పచ్చ చీర కట్టిన ప్రక్రుతిలా  చేతికోచ్చిన పంట మాగాణిలా  పూతై కాతకోచ్చిన వనాలమ్మలా  ప్రక్రుతి పుత్రిక పరువాల కోమ్మ  చూసిన కన్నుల ఆకలి మరల..! అరుణ కీరణాల అల్లిన చీర  తన ఓంటికి అద్దెను సొభగుల మేళా  అకాశపు వర్ణాలన్ని గొరింటై నీ కాలికి అద్ది  గల్లుమనగ నీ మువ్వల రాగం  గుండె అదలదా, పండగే కదా  నిను చూడ కన్నులే చాలవే ఎలా!! ప్రక్రుతి నీకు సరితూగు మాలతి.. నా వనజాక్షి ముఖస్తుతి....! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

మంచికి రోజులు లేవ్వు మామ....

చిత్రం
జీవితం లొ ఒక రోజు చితి పెర్చక తప్పదు  హృదయాశ్రులు నేల జార్చి రొదించక తప్పదు  ఉదయించిన సూర్యునికి ఆస్తమయం తప్పదు  జనియించిన మనిషికి శివైక్యము తప్పదు... నేడు నిజం రేపు భయం  పొద్దు పదం మాపు మాయం  అంతా మనదె కొంతకు కొదువె  అందరు నీ వారె ఎంతకూ పగవారె... గమ్మమెక్కడ మజిలి మట్టి లో  ఆశ బారడే బతుకు బుడిదె  కొరిక కొరివె నిను కాల్చు కాష్టమె... రుదిరమ్మున రొకలు మోది  హృదయాశ్రుల కుండలు పగిలి  రొదించినా ఓదర్పులొ ఏ మార్పులె ఆ తిర్పులొ కవ్వింపులె...... సమాజమె వ్యసనం  దాన్ని అనునయించాలని శాసనం  నీ లొగడ హెచ్చకు ఇతరులు మెలెంచకు  బనాయించి ధనం పెంచు డబ్బు నీదైతె దైవం నీ పొత్తు  దారి చూపించి తానె జై కొట్టు  బడాయి పొతు కాలరు పైకెత్తు  చచ్చాక స్వర్గమో నరకమో  చూసిందెవరు తిరిగొంచిందెవరు... బుద్దిని నమ్ము మనసును అమ్ము  మంచికి చెడుకి అంగులమే తేడా  మంచి కి పొతె మంగలం పాట చెడును నమ్మినొడు చెడలె బెటా అవకాశం ఏదైనా అదిమి పట్టు ఏ అదికారైన నీకె జై కొట్టు..! __________________________  రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

వెన్నెల రాణి..🌛

చిత్రం
ఆ చిరు మందహసము చాలున్ మా మది మతి కొల్పోవగన్ ఆ చారు మకదాందహస చాతుర్యము చాలున్ మా పురుషాధిక్య జాతి పటాపంచలై విచ్ఛిన్నమగున్ మాణిక్యా వరవీణలన్ పలికించి నీ మునివేళ్ళన్ స్పృశించిన మా జన్మదన్యముల్ మిమ్ము తట్టి మము చేరిన వాయువుల్ దిగ్భంధిస్తా అంత:కుహరమునన్    నీ కన్నులలో అలిపిరి వెలుగుల్  నా జీవితములో వెన్నెల కురియున్.. రచన : తాజ్                                            పల్లెటూరి పిల్లోడు

బుజ్జి కోటరు..

చిత్రం
సందర్భం : లాక్ డౌన్ తో మందుబాబుల అవస్థలు ఏమాని చెప్పనమ్మో నువు లేక పాణమే నులువడమ్మో నెలరోజులాయెనమ్మో ఈ యడబాటు ఓర్వనమ్మో  నాలుకే లాగెనమ్మో తలలోని నాళాలు పగిలెనమ్మో  మద్యపానం లేదని నాలోన పానాలు పాయేనమ్మో ఏ జన్మ పాపమమ్మో నిన్నిడిచి ఉండగోరు శాపమమ్మో  ఇల్లాలి పొరువున్నా నిన్నొదిలి గడియైన ఉండనైతి  గడియారం ముల్లువోలె గుండెల్లో నీ మీదే నాకు భీతి  ఇన్నాళ్ళ నా జీవితం అయ్యో నువ్వేగ నా ఇంధనం  కన్నీళ్లు మింగుతున్న అయ్యో కాలి కీసకు మొక్కుతున్నా  పండగోస్తె నువ్వే పంచాయితికి నువ్వే చావు పుట్టుకల్లో దోస్తానివి నువ్వే దుమ్ము కొట్టిన బతుకు బగవంతుడవు నువ్వే దినం అలిసిన చీకటిపొద్దుకు వైద్యుడవు నువ్వే ఇల్లు డోల్లవుతున్న ఓళ్ళు గుల్లవుతున్న  పూట పూటకు నిన్ను ప్రేమగా ముద్దాడి  వందయేళ్ళ బతుకు ముప్పైయెళ్ళకే మాడి  కళ్యాణ భాదకంటే హాయిగా కాట్నం లో కాలుతుంటే  ఎన్నికల యాల్ల నాడు అమ్మా నివేగ నోటి తీట  మా కులము లీడరోడు ఆడబ్బ మార్చిండు నేడు మాట కరోన వచ్చెనంటూ నీన్నాపి మాడ్చిండు పూట పూట  దండాలే 'కే సి యారు'నువ్వైనా ఎత్తు మందు గేటు     అన్నమూ నీళ్ళకన్నా ఓ మందు అన్నిటా నీవే ముందు  మందు లేని తంతు లేదు జగమునందు ఉన్

నయన చంద్రిక..!

చిత్రం
ప్రియా..!మదిలోన భావాల లయ  ప్రియా.. !నయనాల చంద్రుల నిలయ  మోమంతా విరగ కాసిన సన్న జాజుల చాయ  నడు వోంపున పరుగులెత్తు పల్లె వాగు పాయ  అధరములొ మధురిమలు రుధిరములొ సరిగమలు  గాజులతొ గల గలలు మువ్వలతో నీ సైగలు  ఎందరైన నీ ముందు అయ్యో ఇక దిగదుడుపె  నంగి చూసిన కుర్ర కారు సొంగ కార్చి నదులు పారె  అందుకేగా సముద్రాన ఉప్పు నీరు నిక్కమాయె  అయ్యారే..! ఈ రేయికి నీ నవ్వే నజరాన  నీ నోటరాలు ముత్యాలె ముద్దులతొ ఎత్తుకోన  హత్తుకుని మత్తుకమ్మి, మల్లెపక్క వోత్తుకుని  పట్టె మంచం మొత్తుకుని... ఆ కిర కిరమను గమకం లో  నీ చిరుబురల తమకం లో  నా సోంతమయి నిలువుమా,సంతసం లో మునగమా  మన సంసారం సాగగా, సంతానం పెరుగదా.... రచన : తాజ్  పల్లెటూరి పిల్లోడు

వెన్నెల సావిడిలో వన్నెలాడి కొంగు జారి..

చిత్రం
ఈ చల్లగాలి వీణ పాటల లో  ఈ పిల్ల తోడు చిలిపి ఆటలలో  వరుణుడికి రాకకు ముందు వేళలో  ఉరుముల మెరుపుల అల్లరి చలిలో  బెదరక చంద్రుని పారె యెలుగులో  రాతిరి రేపె కోరిక మదిలో  ఇరువురి తనువుల తుంటరి పనిలో  మల్లియలల్లిన కోళ్ళ మంచములో  కిర కిర మంటు చేయు గానములో  ఇక ఆ వెన్నెల వెలుగులో నా దేవి  అది వెలిగె చంద్రుని కిరణమని  పందిరి పై ఈ మల్లియలె  తననల్లుకు వదలకు వెళ్ళమనె ..! ఆకాశంలో తారకలు తన నుదుటన చేరగ తపియించె  పూసిన బంగరు తామరలు కోప్పున నిలవగ కదిలొచ్చె  పసిడికి మించిన అందమని అవి నేలకు జారి విలపించె  లేత పరువాల తీపి స్పర్శకై తన చెతిలొ పడితెచాలంటూ  ఈ ఏర్ర రోజాలు వినిపించె ఇవ్వరా అని నిదించే  నా గుండెను గుడిగా బావించి నిను దేవతగా ప్రతిష్టించి  ప్రెమ ముద్దుల నైవెద్యములతొ నిత్యాభిషెకాలు ఇస్తున్నా  గుండెలయలె జే గంటలుగా ఆర్దిస్తూ ఓక వరమడిగా  నా మీద నీ ప్రెమ ఎప్పటికి నిలవాలని  నా ఆయుష్సు నీ శ్వాసలో కలుపుకొవాలని  పసి పాపలా నను నీ ఓడిలో దాచాలని  చివరి చూపులొ నీ రూపు నా తోడు రావాలని  అర్ధిస్తున్నా...! అభ్యర్ధిస్తున్నా..!!                                             రచన : తాజ్                                   

అన్నధాత సుఖిభవ దిగ్విజయిభవ..!

చిత్రం
ఇది నా అంతరాలలోని మాట అనాలొచితమైనది కాక సమాలోచన కావాలి ఇక  ఆకాశానికి మేఘం సోంతం  తన ఫలం మాత్రం ధరణికి ప్రాప్తం  అది హినమా లేక త్యాగమా  పంచభూతాలు ఎకమైననాడు  ధరణి పై అవి యుద్దానికి పూనిన రోజు  దాని త్యాగమే తోడు కాదా  ఏ ప్రళయమైన ఎదురోడ్డి మిగలదా  అట్లే అన్నధాత! అంటే తెలుసొ లేదొ 'రైతు' అఖండ భారతావనిని అన్నపూర్ణగా మలిచిన ఘనత  విపత్తులెన్నొ తట్టుకుని దేశానికి ఆకలితీర్చె విధాత  శ్రమనునమ్మిన హలికుడు విరామమెరుగని శ్రామికుడు  తోలకరి చినుకులు రాకను మరిచి  నెర్రలు బారిన నేలను చూసి  శిరసు దించుకుని కళ్లు ఒత్తుకుని  మదిలొ ఎదొ శంకించావొ నదిలా లొలొ శొకించావు  వరుణుడు కరుణించి వర్షించగా  పెట్టుబడికి ఎది దిక్కు ఆలి పుస్తెకె మోక్షం తుదకు  ఆరుగాలం మడిలొ తడిచి పంటచేను ప్రెమగ తడిమి  పిల్లగాలులె గాలిమరలుగా పిల్లకాలువే ఇల్లు లోగిలుగ  ఎదుగుతున్నపంటను చూసికన్నబిడ్డలా తమకంనోంది  ఆకలిధూపల ద్యాసెది బెంగపోదువు రెపును తలచి దేశానికి రైతు వెన్నెముక తన నోటిలొ లేదు నాలుక  రాబడికి రాబందులైన దళారులపై  మూర్ఖపు అధికారుల దర్పం పై అతని కినుక  ఏ దైవం తీర్చునో ఈ ధాత్రి పుత్రుని అలక  "రైతే రాజు అన్నది నానుడి" మ

చేజారిన బాల్యం ఒక వరం ఒక అద్భుతం..

చిత్రం
చిన్న నాటి బాల్యం చితి చేరువన వస్తుందా  చిరు జ్ణాపకాల దోంతరలొ మనసు తేలికవుతుందా  వచ్చిపోవు చంద్రునిలా నా బాల్యం తిరిగొచ్చేనా..? అమ్మ చేతి చల్ల బువ్వ ఆరగించాలని వున్నది  నాన్న గుండెలపై జారి నవ్వాలని వున్నది  తేనెలూరు బాల్యం ఇంక్కొక్కసారి రావాలని వున్నది  పిల్లగాలి వెన్నెల్లో పాలపిట్టలా కోమ్మల్లో  ఆడి పాడిన బాల్యం అమ్మ చేతిలొ తాయిలం  అందనని వెళ్ళింది అలిగినా రానంటుంది  కోతి కొమ్మలలో చెడుగుడు నీటి మునకలలో  తేలి ఆడిన బాల్యం ఆశ వదులుట నెయ్యం  మట్టి కుండల ఆట తప్పు దోర్లె మాట  బోసి నవ్వుల కూత చిన్ని మువ్వల మోత  మరపు రానన్నది మది తోలుచుచున్నది  జాతరోస్తే బూర పండగోస్తె గారె  కోత్త బట్టలు కట్టి ఊరు మొత్తం చుట్టి  హరిదాసుల గానము గోంతు తీపి పాశము  అల్లరల్లరిగ రోజు ఇల్లు పందిరి చేయు  చిన్న నాటి రోజులన్ని చిగురాకు కోమ్మాయె  ముదిరి పెరిగిందంటె ముఖము వాచిపాయె  రెక్కలోచ్చిన పక్షి గూడు వదిలినట్లు  పొట్ట చేత పట్టి ఊరొదిలి నేనోస్తె  పొద్దు మాపు బతుకు గానుగెద్దైపాయె  సావిడిలొ ఆల మంద అరుపులు శ్రుతి తప్పి  నౌఖరుగా నా చుట్టు కాకుల గోలైపాయె  బడికి పోమ్మని నాడు బ్రతిమిలాడిన నాన్న  చదువుకున్నా బ్రతుకు సాకిరేవు అ

పడతి తిరేదెలా నీ వెలతి(గృహిణి)

చిత్రం
పడతి తిరేదెలా నీ వెలతి(గృహిణి) వంటింటి సంస్థానములో మహిళలే మహరాణులు  విరామమె ఎరుగకుండ చిరునవ్వులు పూయాలి  ఇరుకు ఇరుకు గదుల మద్య వేల మైళ్ళు నడవాలి  కోత్త కోత్త రుచులు వండి జివ్యాపెక్ష తీర్చాలి  వంటిల్లె ప్రపంచమని బ్రతుకంతా తరించాలి  నిదుర విడిచి వేళ మరిచి సుఖం మరిచి మోఖం వాచి  తోలి జామున నిద్ర లేచి పేడ నీళ్ళె అత్తరుగ తలచి  ముక్కు ధూళమదిరేటి బోళ్ళనెల్ల భూడిదతో శుద్ది చేసి  పిల్లజెల్ల ఇల్లుపెద్ద ఓక్కటిగాభావిస్తూదినమెల్లా సేవిస్తూ  సోంత కలను మరుస్తుంది కుటుంబమై నిలుస్తుంది  కోంగు నడుముకు చుట్టి చీపురు చేతిలో పట్టి  ఊపిరి సత్తువ జేసి నెత్తురు చెమటగ మలిచి  గుర్తించని లోకం పై అలుపెరుగని పోరాటం  అమ్మైనా ఆలి అయినా నిరంతరం తరం తరం  మారలేదు ఏ క్షణం వంటిల్లే చివరి గమ్యం  కాలిన గాయలతో తిరగదోడె నోప్పులతో  ఓళ్ళు గుల్లవుతున్నా, డోల్ల మనసుతో  నిర్వీరామంగా శ్రమిచె శ్రామికురాలు పడతి  వంటింటి కర్మాగారం లోనే తనకు సంత్రుప్తి  ప్రాణం ఉన్నంత కాలం తనకు లేదెమో విముక్తి కసురుకునే పరివారాన్ని కోసిరి కొసిరి వడ్డించి  బాగుందని ఒక్కరన్న ఎంత పొంగిపోదువో  ఏమి నా భాగ్యమని మురిసి మురిసి నవ్వెవో  తెల్లార్లు నిద్రమాని రేపు