పోస్ట్‌లు

నవంబర్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

అవనికి ఆకాశం వర్ష ధారల ప్రేమ లేఖ...!

చిత్రం
అవనికి ఆకాశం వర్ష ధారల ప్రేమ లేఖ...! ఆకాశం అలిగినదేమో, మూతి చిన్న బుచ్చిందేమో కలతప్పి తను నలుపెక్కి, వెక్కి వెక్కి ఏడ్చిందేమో ఎరుపెక్కిన కన్నుల వెలుగే, మెరుపులాగ మారిందేమో  వెక్కిల్లే ఉరుముగా మారి పెక్కున అది పెరిగిందేమో కన్నీరే వర్ష ధారగ, నీ మేను కడిగిందేమో కన్నెపిల్ల ఒళ్లు తడిపితే భాధ తీరుతుందనో ఏమో నీ కోసం వెతికిందేమో నీ పైనే రాల్చిందేమో నీ గుండె గుట్టు తెలియాలంటూ,నీ వెనకే నడిచిందేమో తన తప్పును ఒప్పమంటు,నీ పాదం కడిగిందేమో చెప్పు కింద ఉతం ఇచ్చే  భూదేవిని అడిగిందేమో తడిచిన నీ తనువును చూసి, అబ్బా అని అరిచిందేమో నీ జత కోసం విల విల లాడి, ప్రేమ ముదిరి పిలిచిందేమో నువ్వు కాదు అన్నావంటూ, ముందు నిలిచి ఎడ్చిందేమో నీ ప్రేమ లేని బతుకే చేదని సముద్రాన దూకిందేమో ఇప్పటికీ నువు ఊ అంటే, ఎగసిన ఆ అల నిను చేరునో ఏమో ఎత్తుకు నిను నిలుపునో ఏమో, హత్తుకు సెగ తీర్చునో ఏమో...! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు లిపవర్య ప్రేమ లేని బతుకు ఓపలేక అబ్బాయి ఆకాశమై అమ్మాయిని అవనిగా తల్చి రాసిన వర్ష ధారల ప్రేమ లేఖ ఈ నా కవిత...

హద్దులేని మరు ముద్దు తాపనం..!

చిత్రం
  హద్దులేని మరు ముద్దు తాపనం..! ఓ నీల వేణి నీ కులుకు సోయగం మదిని ముంచెనే కనుల నిలిచేనే దరికి పిలిచేనే సోకు పంచేనే నీ పలుకు చాలునే విన్న ధన్యమే నిదుర లేవగనే నీ నవ్వు మాటలలో మకరందమున్నదే వింటుంటే సమ్మగున్నదే గుండె ఉరకలేసినది నాడి జివ్వు నేగిరినది రక్త ప్రసరణ తేలికై నింగిపైన తేలియాడుతున్నది ఊహలో నీ రూపు చూసి మురిసితిని...! నీ సుట్టబుగ్గలో దాగు నవ్వుకి, నీ చెంత నడవగ ఆశ పడితిని నీ వద్ద కేగి ఓ కౌగిలియని, బుగ్గ కొరికి ఓ ముద్ర వేయని కోరినాను నీ దరి చేరగా, భూనభోంతరాలు ఉర్రుతలూగగా ముద్దు మీద మరో ముద్దు సంతకం హద్దులేని మరు ముద్దు తాపనం చిరు నవ్వులు రువ్వగ సిరి మువ్వలు పలుకగ హాయిని గొల్పగ ఈ రేయి, నీ ముద్దు ఔషదం అందియి...! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

నీ పాద కమల సేవ నాకు దయయే గదా...!

చిత్రం
  నీ పాద కమల సేవ నాకు దయయే గదా...! పచ్చనైన పందిరిలో...? స్వచ్ఛమైన మనసుతో నన్ను దోచుకుంటివి నీ నుదుట నిలుపుకుంటివి నీ జడన తురుముకుంటివి నా గుండె సవ్వడి నీ పాదముద్రల వెంటసాగి మువ్వలుగా మారెను అవి ఘల్లుమని మ్రోగెను నా కనుల రాలు ఆశువులే అక్షింతలుగ రాలెను నా గుండె పగులు ఆర్తాలే గట్టిమెలమాయేను నా రక్త ధాతువులే వధూవరుల సింధూరమై నా ఆర్తి పాట మెలానికి ఊరువాడ గొల్లుమని నా చావు కోరి ఆకాశపు దారులన్ని తెరియును నా చివరి చూపు నీ బుగ్గ మీద దిష్టి చుక్కగ మారును నీవు నడచు దారులలో నా ఆత్మ నిలిచిపోవును నీ పాద ధూళి రువ్వు హాయి తాకగానే మురియును నీ పెదవిపైన నవ్వు చూసి చేమంతులు సిగ్గు పడి నీ చూపు తగిలి చల్లబడి మేఘములే కరిగిపోయి వర్షధార పొంగదా పుడమి పులకరించదా...? అంతమైతి నీ సొంతము కాక అంతలోనే జన్మించితి నీ ప్రేమ తోడ నీ చేతుల పాపాయిగ మరో సారి ధన్యత జారిపోయిన నా ప్రేమకు ఇలా మరో రూపున........! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

మిద్దె మీది అర్రలో ఆ ఇద్దరూ..!

చిత్రం
  మిద్దె మీది అర్రలో ఆ ఇద్దరూ..! ప్రకృతిలో అందమైనది...? చలి కురిసే మాసంలో చెలి కౌగిలి..! తన నులి వెచ్చని కౌగిలిలో, చలి తరిమిన మధు గిలిలో యవ్వనాల పూగుత్తుల ఎత్తులలో చేరగానే పారిపోవు పాడు చలి, ముద్దివ్వగ మొదలాయేను కా(మ)థా కేళి ఆ కౌగిలి ఓ స్వర్గము, గిలి గింతల సుమ పర్వము అది సఖల శుభాలకు నిలయము, సఖునికి ఓ వరము యవ్వనాల పూదోటన...! ముసురుకునే బ్రమరంభుకు మకరందమే ఆనందము పూబంతుల చేమంతుల కౌగిలింతే తన భాగ్యము నిన్ను చేరు నా ఆశకు..! బింబాదర మధురిమలలో, బిగి కౌగిలి ఘుమ ఘుమలలో గొళ్ళెము లేని లోకములో, కన్నము లేని అర్రలో నిను అనుభవించుటచే నా జన్మ పావనము, పుణీతము.! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

దోర సొగసుల జారు పరువం...!

చిత్రం
  దోర సొగసుల జారు పరువం...! నా ఈ ప్రేమలో ఎన్ని పులకింతలో చెలియ చిరు నవ్వులో ఎన్ని నెలవంకలో జారు ఆ పైటలో ఎన్ని కనువింతలో ఎండలోనే పండువెన్నెల విరగకాసింది గుండె నిండుగ పండుగలతో కాపు వేసింది పూత పూసి తిపికాయల విందు పిలిచింది దోర సొగసుల జారు పరువం జోరు మీదుంది నాదు ప్రాణం నేలజారి తాళమాడింది, తన పొందు కోరింది పారు నీరు వంక బారి నడుమునాడింది ఆ పడచు సొగసు నాదే అనుచు బెరమాడింది పల్లె పడుచుల నడక నీతో కలిసి సాగింది కొమ్మలోని కోయిలమ్మె నీ నోట వెలిసింది నెమలి నాట్యం నడుము తిప్పగ సాయమిచ్చింది పూల తావులే పాదరక్షలుగ పయణ మయ్యింది నీ తీరులోనే విజయ నాదం తోడు నిలిచింది నా ప్రాణమైన పసిడి కూన....! నా జన్మ పైన ఏడు జన్మల తోడురానుంది ఈ రాత్రి కనుల కలగా మెరిసి నిదురపుచ్చింది సరస సౌఖ్య రుచులు జూపి, సరసునిగా నను తీర్చి దిద్దింది నీ అందమే నా సరస చేరి నీడ లాగా నిలిచి పోయింది....! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

నవ్వుల్లో తంగెల్లు...!

చిత్రం
  నవ్వుల్లో తంగెల్లు...! సుందరి....! సిరులు రాలు నీ నవ్వులు సుధలు జారు నీ మాటలు సుందర, సుప్రజ, మధుర, సుమధుర మాటలు లేవే వర్ణణకు అవి చేవులనే తిరిగే, వీణలై మ్రోగే విశేషమేదో కలిసుందే, వింటుంటే మది పులకించే జన్మ ధన్యం అనిపించే, మరొక్కసారి అని పిలిచే మరపున రాక మది తొలిచే, పురివిప్పిన నెమలి గా కాచే నా ఆలోచనలో హాయిగా కదిలే, పదాల కూర్పుకు బాసటనిచ్చె నిను పోలిన శిల్పం లేదెడ, నిను పొందిన నేనే గొప్ప ఇలపైన నేడు నిలో ఉప్పెంగేను ఎన్నో ఆశలు నను రమ్మని అవి చేసెను సైగలు నిను వీడి రాగా, తడబడుతూ తిరగబడినవి నడకలు నీలి మేఘాల వర్ణము, నీ తనువును పోలి మెరిసేను పూసిన ఆ తంగేడు పువ్వు నీ కొప్పుచేరి మురిసెను భువి వీడి దివి చేరిన నా దేవిని శ్రీదేవిగా మలిచేను నిను నను ఒక్కటి చేయు కల ఏదయినా కలివిడిగా కూడుదాం, ఆలుమగలమై నవ్వుదాం...! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

బ్రతుకే ఉలిపిరి కాగితం..!

చిత్రం
  బ్రతుకే ఉలిపిరి కాగితం..! ప్రేమ అనే వృక్షానికి, పూసిన ఓ పువ్వువని మనసు పడి, మదిన చెడి, బ్రమరమునై వెంటపడి నీ బానిస అయినాను, నీ భావులలో ఒదిగాను పావురంగ పక్షినై ఇరు రెక్కల దాచాను పారవశ్యమంత నిండి కన్నుల్లో దాచాను ప్రీతి కలిగి ప్రాప్తః కాలమంత నిన్ను కాపు కాచాను ఇష్టం అని మనసిస్తే నిర్లక్ష్యం చూపావు ఇంక్కొకరికి ఆశ్రయమై హాయిగానే వున్నావు ఆదరించిన నన్నేమో చిదరించుకున్నావు దేవతవని పూజిస్తే హారతినే తన్నావు పువ్వు నాది, పూజ నాది, ఫలం ఆయే పరాయి కడదాక తోడుంటానని కన్నీళ్ళతో ముంచావు కనికరం లేకుండా కాటికి నను చేర్చావు జ్ఞాపకాల కడవలన్ని నేల వొలక బోసావు తడవ తడవకు గుర్తుకోచ్చి గుండె కోత కోసావు స్వార్థమే పరమార్థం అను సిద్దాంతం నేర్పావు శ్రమ స్వేదం నాదయితే వేరుల పంటయినావు గుండెల్లో తూట్లు పొడిచి తూలనాడి వెళ్ళావు కన్నీళ్ళ తుఫానులో కడిగేసుకు నడిచావు...! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

తొలి ప్రాయపు ఊహల్లో విహాంగాలై ఎగిరాము..!

చిత్రం
  తొలి ప్రాయపు ఊహల్లో విహాంగాలై ఎగిరాము..! అరె ఇది ఎందిరో, ఆకాశాన తేలినట్టు నీటిపైన నడిచినట్టు, నేలపైన ఈదినట్టు జాబిలితో ఊసులాడి, సూర్యునితో ఆటలాడి చుక్కలన్ని కోసుకొచ్చి, చెలి కోప్పున తురిమినట్టు వెన్నెలంత తోలుకొచ్చి, సఖి నవ్విన కూర్చినట్టు పూలవనం సుగంధాలు, పోరి మేను కద్దినట్లు రామ చిలుక పలుకులన్ని, ముద్దుగుమ్మ నోట ఊరి కోయిలమ్మ రాగమేదో, కూనలమ్మ గొంతు చేరి కాలనాగు నడక తీరు, దాని నడుము వంక వారి కురులు చూడ చిన్నవాయే, హిమము వంటి కోపమాయే నేను తనకు ప్రాణమాయే, నన్ను విడిచి నిలవదాయే అయ్యారే ఈ బంధం, తన సౌఖ్యమే నా ఆనందం తన జతయే నాకిష్టం, దానందమే ఓ మాణిక్యం మా బంధం చిరకాలం, మా పయణం మరు జన్మం తను లేనిది నా మరణం, తలరాతకు మేము వెరవం కలనైనా ఇలనైనా, తనతోడే నా సర్వం....! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

ప్రణయ సుధా నీ కోసమే...!

చిత్రం
తొలి చినుకుల తడిసినపుడు ఉరు మెరుపుల జడిసినపుడు తడి వలువల జూసినపుడు తడినేల సుగంధాలు నీ తనువున వీచినపుడు పులకించే ధాత్రి దేవిలా పరవశించి నువు పలికినపుడు ఇల నింగి కలిసినట్టుగా వర్షధార పొంగినపుడు నిన్ను నన్ను దగ్గర చేయ ప్రేమ వారధిగ మారినపుడు వరద చేరి నిండు కుండలా వాగు వంకలిడినపుడు దయా కరుణ నీ మదిలో చేరి సహన శీలి గా కాంచినపుడు జాబిలమ్మను నే తుంచి నీ నడుము ఒంపులో అది దాచి వెలుగులు పంచే తారలను నీ కంఠపు ఆభరణం జేసి కన్నులమాటు కలగా కరగక నిజమయ్యే రోజుకొసమే వసంతముకై కోకిలమ్మలా నిత్యం నే వేచి చూడనా అను నిత్యం నిను ఆరాధించనా నీ ప్రేమే వర్షం అని జాతికంతా చాటిచెప్పనా...! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

వర్షం కురిసిన రాత్రి...!

చిత్రం
జడి వానలో తడిసి తడిసి నెమలి భామలా చిందులేసి జింక పిల్లలా పరుగుతీసి జలుబు తాకి ఇల్లు చేరగా నా బిగి కౌగిలిలో ఒదిగిపో ఇగ వెచ్చటి ఊపిరి ఉదంగా ముద్దుల తడి ఆవిరిగా మురిపెంగా అందిస్తా ముద్దులతో కుదిపెస్తా తడిబారిన నీ దేహం పై మంచు బిందువుల సమాహారం తడిసి వణుకు నీ ప్రాయాన్ని క్షిరముగా నే భావిస్తా, తెల్లవార్లు జుర్రెస్తా...! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు