పోస్ట్‌లు

జులై, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

మాయల 'మని' షి (కులం పిచ్చి)

చిత్రం
*శీర్షిక : మాయల 'మని' షి (కులం పిచ్చి)*  ఘనమైన స్వతంత్ర రాజ్యంలో, నాడు మొదలు నేడు వరకు అగ్ర వర్ణ శోభితం, కడ జాతులతో పాద సేవనం గుణం చచ్చి, కులం రెచ్చి, మతం చొచ్చి మనిషిని మార్చి మనం అన్నది మరిచినాడు, మందిని ముంచేదిగినాడు కులం ఏదైనా మలం తినమనలేదు మతం ఏమైనా మరణానికి అడ్డురాదు పని ప్రాతిపాదికన పుట్టిన కులానికి అదో ప్రత్యేకత ఆపాదించకు సమస్త మానవాళి ఒక తల్లి పిల్లలం అని మరువకు మనిషి కుంచిత స్వేచ్చ విధానంలో స్వతంత్రం - స్వలాభం, స్వరాజ్యం - స్వబోజ్యం సానుకూలత - పేరు కులట, సమానత్వం - అమానుషత్వం అనుబంధం - అబద్దం, మానవత్వం - వినాశక మత్రం వినుతికెక్కిన గణతంత్ర దేశంలో ఎక్కడుంది ఘనం, మనిషి మనిషిలో ఖేదం ఎక్కువ తక్కువల తో ప్రాంతీయతల విభేదం,  ఎందుకు పంతం, ఎవనికి సొంతం  జీవితమంతా పరుగులతో అంతం రౌడీ రాజకీయకుల ఆయుధం ఈ కులం అన్నదమ్ముల మధ్య అగాధం ఈ మతం శాస్త్రోక్త గ్రంధములెవైనా సారం ఒక్కటే రాము, రహీమ్, రాబర్ట్ ల  కణములోని అనువంశిక పదార్థం(DNA 🧬) ఒక్కటే... రచన : తాజ్  అంశం : మత సామరస్యం

అరటి తోటలో ఆగని శృంగారం...

చిత్రం
  అరటి మాను తోటలోకి మనమిరువురం పోదూరి నీ అదరం వణుక జూసి నీ పరువం పొంగజూసి నీ లౌక్యం తిరగ జూసి నీ తాపం పెరగ జూసి నీ కనులలో సుడులు తిరుగు మరులు గొల్పు మత్తు జూసి నీ అదరములపై చేరి నేలదూకు అదరామృతాన్ని కలియ జూసి అరటి పత్ర దళములే ఆ పూటకు పాన్పుజేసి అల్లుకున్న మన తనువులు కరుపెక్కగ బిగియు జేసి నీ కాపుకు దొరనై, నీ హోయల సిరులకు ఎలికనై నీవన్ని దోచుకొని, నీ ముంగిట మూర్చిల్లని... నీ ప్రేమ ధారల మధువులను మీద జల్లగ మేల్కొని ఈ నా జీవితం నీ పాదాలకని నే చెప్పగలను నీ భానిసనని...! ----------------------------------------------------------+++++ రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

జన్మ జన్మలకు నీవే తోడు....!

చిత్రం
ఆమని వేళల వసంత పుష్పం నీ అందం కమ్మని కోకిల ఇంటిగానం నీ వాక్యం కారు మేఘములు కాటుక దిద్దిన నీ కనులు బారు సర్పముగ కాంచుచున్న నీ కురులు అంగ అంగమున అందచందములు ఆవహించిన హరిణి కోమలలు దాత్రిపై నీ పాద పద్మములు కమల రేకుల కాంతి దోనెలు ఆవహించిన హరిణి కొమలలు కనికరించిన నీదు హృదయము చేరనీ నను నీదు మధిరము జీవించగా మనమిరువురము కుటుంబమై అవనిలో ఆ జన్మంతములు...! -----------------------------------------------+++++ రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

తొలి ముద్దు..(ఓ తియ్యని అనుభూతి)

చిత్రం
  నీ అదర చుంబనముకై ఆరాటపడుతూ నీ అధరామృతం సేవించాలని ఆదుర్దా పడుతూ నీ చెంత చేరి కోరిక తీర్చ ఆలోచన చేస్తూ నీ అందాల రుచులన్ని ఆరగించాలని అవేశపడుతూ నీ మధురానంద రూపాన్ని అభివర్ణిస్తూనే నిను నా బిగి కౌగిలిన భందిస్తూ నీ అధరాలను నా ముని పంటితో ఒదిమి పట్టి నీ కాలి గజ్జెలు సర్దుజేయక, నా కాలి గోటితో అదిమి పట్టి నీ నయగారపు నడువొంపును, నవనీతపు మెడ సొంపును ఇరు చేతుల దుసివెస్తూ, ఇంపుగానే లింకుపెట్టి జోడు రాత్రులు గొలపెట్ట, ముద్దు మీద ముద్దు పెట్టి బిగి కౌగిలిన నలుపన, ప్రేమ ఉపిరూదన ముద్దు ముద్దు బాసలతో                 ధన్యజీవిగ వెలిగిపోనా...!                             మురిపెంగా చూసుకొనా ------------------------------------------------------------------- రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

మయూర మనో రోదన...!

చిత్రం
అరణ్యాల అందాలు ఎర్ర మట్టి గంధాలు  పారుతున్న సెళయెళ్ళు సెదతీరు నేమళ్ళు  వాన ముసురులో నేమలి నాట్యము  చూసి మురిసిన కనులు ధన్యము  జాతి పక్షి అంటూ ఓ కీరిటాన్ని పెట్టాము  ఇంటి శోభ అంటూ దాని కంటి క్షోభ చూసాము  గూళ్ళ లోన పెట్ట చూసి గాట్లు పోట్లు పొడిచాము  ద్రౌపధి లా బట్టలిప్పి భలె భలే అన్నాము  రంగు రంగుల ఈకలు పీకి  ఫకీరు చేతిలొ విసనగ మార్చి  రంగు అద్దాల గోడ మేడలకు  కళ చెదిరి అవి ఘోషిస్తుంటె  అలంకారమని అనుకున్నాం  ఆ జాతిని పూర్తిగ భలి పెడుతున్నాం  బలిరా బలి ఓ తమ్ముడా  ఆ పాపం మానరా మా అన్నయ్యా..! ------------------------------------------------🪄 రచన : తాజ్  మీ పల్లెటూరి పిల్లోడు

తలపున వలపు రాకాసి..!

చిత్రం
వర్షాకాల సంద్యాసమయం గల గల పారె జల ప్రవాహం కొమ్మన పక్షుల కిల కిల రావం పడమర సూర్యుని ఎర్రని రూపం పిల్ల గాలుల వీణా నాదం పడుతూ లెచే అలల విహంగం ప్రకృతిమాత హోయల సౌరభం మువ్వల సవ్వడితో ముంగిట చెరెనే మది మురిపిస్తూ ముద్దులు కొరెనే నాతో కలిసి అడుగులేసే కలలోనైనా నీ తలపులే  కాసేపైనా పడుకొనివే ఆ కలలోనైనా నీ అందం నీదే  ఎవ్వరైనా నీ ముందు బలాదూరే..! _____________________________🪄 రచన : తాజ్  పల్లెటూరి పిల్లోడు

సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది...

చిత్రం
  సీతక్క.. గమ్యం తన గుమ్మం ముందు నిలబడింది... (మా ములుగు ఎమ్మెల్యే సీతక్కకు పుట్టిన రోజు సందర్భంగా) అమ్మా అన్నార్తుల పక్షానివై చితికిన బతుకుల్లో నేస్తానివై గిరి పుత్రుల ఇంటి ఇలవేల్పువై పీడిత జన సమూహమై పోరాటమే శరణమని పిడికిలెత్తి కదిలావు బందూకు చేతపట్టి రుద్రమనని చాటావు దొరలగడిల నెదిరించి, భూస్వాముల గుండె చీల్చి అంటరాని బ్రతుకులో అమ్మ నీవు అయ్యావు బాధర బందీలు బాపి భానుడల్లే తోచావు ఇలా నీ సగం జీవితం అడవిలోను  అజ్ఞాతంలోను గడిచిపోయింది కదమ్మా ఇప్పుడు అధికారం చేతిలోవున్నా ఈ అరణ్యవాసం ఏమిటమ్మా కరోనాతో ప్రపంచమే నడింట్లో నక్కి దాక్కుంటే గిరి పుత్రులు కొండ కోయలపై ఇంత ప్రేమ ఎందుకమ్మా సుగుణములేవైనా జన్మతః రావాలంటే విన్నాను మిమ్ము కళ్ళతో చూసాకే నిజం అని నమ్మాను ఎండ్ల బండి, ట్రాక్టరే మీకు పుష్పక విమానమై కదిలావు అడవి బిడ్డల ఆకలి తీర్చి అక్షయ ప్రదాయిని అయ్యావు కామ్రేడ్ అని నినదించినా, అధ్యక్షా అని గర్జించినా బహు బాగుంది తల్లి మకిలి పట్టిన వ్యవస్థపై నీ వేట మా నాడిలో రక్తం వలె నడుస్తాము తల్లి మీ బాట ఋణగ్రస్తులం అయ్యాము తల్లి మీ తెగువకు అబ్బురపడి మీ త్యాగానికి ఆశ్చర్యపడి అమ్మా మీ పాదాలకు మా కన్నీటి తర్ప

మనుటయా, మరణించుటయా...!

చిత్రం
ప్రేమామృత ధారలు అడుగింకి అశ్రునయనాలతో ఆకాశాన్ని అర్ధిస్తూ ఈ యడబాటులో శూన్యాస్తములు చాచి నా హృదయ సామ్రాజ్య ఎలికకై విన్నపము కలలో మెదిలే నీ రూపాన్ని కనులముందు నిలిపి క్షమించమని అడగనా కరుణించమని ఎడ్వనా ఓ ఒంటరి బాటసారినై ఇక్కడనే మనుటయా, మరణించుటయా...! ఇది అన్యాయమా, లేక విధి నాటకమా త్రివేణి సంగమ అద్భుత ఝరి నీ నవ్వుల సవ్వడి ఒరుపు నేల నురగల వలె నీ పలువరుసల అలజడి ప్రియా.. నేడు కరువయినవి, మది బారమైనది ఎ వాల్మీకి రాయని రామాయణం నా బ్రతుకైనది అరణ్యముల పాలై బ్రతుకు బరువైనది అలసిన నా ఆలన సొలసినన నా పాలన అనుకరించు ఆప్తురాలు, ఆర్తి తీర్చు భక్తురాలు నీవు లేవైతివి నాకు కరువైతివి... పాడు కాల పరీక్షలో నీవు లేక ఎడారి ప్రయాణం నాదయినది ++++++++++++++++++++++++++++++++++++ రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

చివరి ఘట్టం..(సునామీ)

చిత్రం
నా మది మందిరమును అతిష్టించిన దేవత నా ఊహా ప్రపంచ వీణవంక డోలా సింహాసన గోరువంక దేదిప్యమానం నీ దేహామంత దివ్య తేజస్సు నీ కనుల వంక పరితపించు నాకే కదా నీ జత ప్రియముగ అడుగులేయవా నా వెనక ఆ కల తీరని రోజు నా అంతమె ఇక ...! ------------------------------------------------++++ రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

బాల్య స్మృతులు...(పాట)

చిత్రం
చరణం : మనసు మరవలేనన్నది నా బ్రతుకు సాగలేనన్నది మనసు మరవలేనన్నది నా బ్రతుకు సాగలేనన్నది పచ్చని నా పల్లె ప్రకృతిని విడనాడి పట్నంలో నా బ్రతుకు హినమే అనిపిస్తే (మనసు..) పల్లవి : ఇల్లు వాకిలి వదిలి నా పల్లె నిన్నొదిలి అక్కున చేర్చేటి అమ్మను వదిలి హాయిని పంచేటి నాన్నను వదిలి గడియైన విడిచి ఉండాలేనంది గాలిమాటు గమనం వద్దాని చెప్పింది (మనసు..) పల్లవి : పండుగ రోజుల్లో పల్లెల నా ఆట సంక్రాంతి బోగీల సద్దుల బతుకమ్మ దసర పండుగలంట పీరిల జాతర ఉపవాస దీక్షలు ఊరంత అందాలు (మనసు..) పల్లవి : కట్ల బుచ్చయ్య బావి నేర్పిన ఈత కల్లు కుండల కొరకు చేసిన దొంతర సర్కారు బడిలోన చిన్న పిల్లలమంత చల్లంగ కూర్చొని సాగిన ముచ్చట (మనసు..) పల్లవి : కొత్తపల్లి గోరి నా పల్లె నిండా తీరొక్క మనుషుల తీరైన దందా కులమతాలేవి మాకు లేవంట అందరూ కలిసి కూడుండే పొదరింట (మనసు..) పల్లవి : నాలుగు దిక్కుల్లో కుంటలు నిండు వాటి దాపున ఉన్న మామిల్ల పంట దొరగారి బంగ్లోలే కూలిన మెడల్ల ధన గర్వమన్నది లేదు నా పల్లెల (మనసు..) పల్లవి : మసీదు చేరువలో నల్లరాతి బండ పెద్దమనుషులు చేయు పంచాయితీకి అడ్డ ఎవ్వారీ భాదయిన తీరును ఆ పూట మాట త

రసిక రాజు...

చిత్రం
రసిక రాజు... అ ఆ ఇ ఈ.. అతను ఆమె ఇంతలో ఈమె సంతలో సారంగం ఇంటిలో వీరంగం ఇంట మొగుడు సుద్దపూకు వీధిచేరి ప్రగల్భాలు పలుకు ఇల్లాలు గుండెపోటు రెండో ఇల్లు రక్తపోటు ఉన్న వ్యాంపు వీధికిడ్చే ఆస్తినంత లాగిమింగే బతుకు బారం మోపడాయే పికలోతు అప్పులాయే కాషాయం ఒంటికాయే ఒళ్ళునిండా భూడిదాయే సన్యాసం నాకు మిగిలే మందుముట్ట మణి లేక నాలుకిగ్గే రోజులచ్చే చెంత చేరే చుక్క లేక పక్కలోన తడుముడాయే పోరి కొరకు వెంపర్లాడే చూడరా బాబు ఈ నా కొడుకు ఇంత అయ్యాక కూడా మళ్ళీ ఆడది కావాలట చూడు ఈడబ్బ సాలేగాడు వీడు రసికుడా కాదు రాక్షసుడు...... -------------------------------------------------- రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు