పోస్ట్‌లు

జూన్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

దేవేంద్రునితో యుద్దం...!

చిత్రం
పడుచుదనం పరుగు తీయగ పల్లకినై నే నీ ధరి చేరగ  నీ పరువం మోస్తూ నేను, మై మరచి గానమెత్తగా  నీ కన్నుల వెలుగె నాకు దారి చూపు దీపము కాగా  నా ఊపిరి లయలో మ్రోగుతు నీ కాలి గజ్జే తాళమెయగా  నీ కంటి రెప్ప సవ్వడి వింటూ వడి వడి గా పరుగెడగా  దారి పోడుగు దాసి కన్నెలు చెమంతుల బంతులెయగా  అపహరించు దేవకన్యయని దేవేంద్రుడు యుద్దం చేయగ  నిలువరించి మెడలను తుంచి తరమనా నీను గెలవగా  సంబ్రమాశ్చర్యం తో భూ నభుంతరాలు దీవేనలిడగా  పాల బుగ్గ లోలికె సిగ్గు బుగ్గపైన ఎర్రని ముగ్గు  పెదవిపైన పూసిన పువ్వు మదువు జారు నీ చిరునవ్వు  పసిడి మెరుపు కసిరెపె రూపు మాటు వేసి వేస్తా కాటు  నీకు నాకె ఇక పోటి నీవు లేని జీవితం ఏపాటి  పూట పూటకు నీ తోటి సందర్శిస్తా స్వర్గ నగరి  జన్మ చివరన వాలిపోదాం ఆ వారణాసి (కాశి) -------------------------------------------------++++++🪄 రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

భగ్న ప్రేమికుడు( దేవదాసు)

చిత్రం
రాళ్లపై తన పేరు రాయలేదెన్నడు రాతి గుండె తనదని తెలియరాలేదెన్నడు నా కంట శోకాన్ని రాల్చలేదెన్నడు ఆ శిలను కరిగించే రోజు రానెన్నడు ఆ మనసు కే ఇంత అలుసైతినినాడు నా మనసులో తనని నలిపితే ఏనాడూ అవమాన బారముతో అలసితిని ఈనాడు అక్కరకు ఆడించి వంచించే ప్రతినాడు ఆడదే నా పాలు హాలహాలమాయేనే చూడు నా బ్రతుకు మారింది పస లేని బీడు చివరగా చెదిరింది ఆశల గూడు ఆఖరకు నా బ్రతుకు ఎనలేని మోడు చూడరా బాబు ఆడదో క్రీడ కై నీడ అనుసరిస్తుంది అభినయిస్తుంది వెలుతురు లోనే తోడోస్తుంది అందులోనే అంతరిస్తుంది చీకటి చేరిన పారిపోతుంది ఒంటరి చేసి బాధిస్తుంది..👤 ------------------------++++++++ రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

తెలుగు తల్లి నీకు వందనం..🙏

చిత్రం
తెలుగు తల్లి నీకు వందనం.. తెలుగు లిపికి నేను పాదాక్రాంతం ....✍️ ఏమిటయ్యా ఈ నిరాశ నిస్సహయత  నిజానికి నీడ లెనట్టు నీతికి జాడ కరువైనట్టు ఆకాశపు నీటదార అలిగి దిగిరానట్టు నా గొంది లొని బావాలు గురి తప్పినవా అన్నట్టు బుద్ది మనసు ఒక్కటవగ నీకు దిక్కెవరు అన్నట్టు నా కలం విదిల్చి రాల్చ అక్షరాలె కరువైనట్టు శూన్యం లొ దూరి పొయి దారి మరిచి పొయినట్టు అంతా అయొమయం నాలొని కవికి పొయె కాలం.. అంతటా అమావాస్య ద్యయం కారు చీకంట్లొ నాతొ నాకె రణం ఝరులా సాగె నా జన పదులు జీవంకొల్పొయాయ  జనావళిని జనరంజకం చెయు జీతాసులు  కలం మాటుజారలెక జొగుతున్నాయా  నీరసించి నిద్రలొనె తూగుతున్నాయా   జంజామారుతమైన జన చైతన్య పంక్తులు  కావాతు మరిచి కాలిపొయాయా.. కవితె లొకంగా జీవించాను  బావవ్యక్తికరణకు కలమె నా ఆయుదమని గర్వించాను  కలం ముందు కానిదెదని బ్రమించాను  అంతటి నా ప్రతిభా శైలి ఎమయినది  కనుల పడునదెది మనసును ద్రవించలెక పొతున్నది  తెలుగు తల్లి నీకు వందనం,నన్ను కటాక్షించు కవితా కుసుమాలు నా మనసున విరసించు  నాలొని బావాలు అక్షర మార్గమై  కవితాక్షర మాలికల తో నిను అర్చించె ఆజ్ఞ ఇవ్వు  తెలుగు లిపికి వందనం... నాలొని కవిని సత్కరింపమని ఆవ్వానం... ర

లక్షి దేవి ( నీ జడన జెగంటను నేను )

చిత్రం
పసుపు వస్త్రమున పసిడి కాంతగా  చెవుల లోలాకు చిందె వెలుగునా  మెడన ఆడు ఆ హారమంచునా  రంగు రాళ్ళను పోదిగినందున  లక్ష్మీ దేవిలా కాచె కన్నుల  సిరులు ఓలికెరా మణులు కురిసెరా  నీ నడుము నాట్యాన నా చేయి సాయగా  చుట్టు చుట్టనా వడ్డాన మవ్వనా  గంధం విరజిల్లు ఆ కురుల అంచున  జేడ గంటనై సేదతిరనా  సర్పమంటి ఆ నాసికంచున  తీపి పలుకునై నే నిలవన  శంఖమంటి నీ చెవుల నిత్యము  నా ప్రెమ బాసలు వల్లెవేయన  నీ అదర చుంబనల తో అలసిపోనా  నీ అందాల విందామరలు చూసి చూసి మూర్చపోనా నీకు దూరం అయిన  మన యదల భందం విడిపోయిన ఈ లోకాన్ని విడిచి పోనా జీవితాన్ని నిలువరించనా  ఆకాశ మార్గాన కదిలిపోనా  అల్లంత దూరాన ఓ తారలా  నీను చూస్తూ నే నే మిగిలిపోనా  ఆ జాబిలి వేలుగు నీవె కాదా  నీ దాపున నేనే ఓదిగిపోనా  నీవు అలిగిన నాడు చీకటి కాదా  అందుకైనా నువ్వు నవ్వాల నీ నవ్వున నే కూడా వెలగాలా..! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

మనుషుల తీరే ఇంత..! (నమో హైద్రాబాద్)

చిత్రం
మారిన జీవన ప్రమాణం  బంధాలు అనుబంధాలకు దూరమై   శాంతి సంతృప్తి లేక   మనుషుల్లా కాక మర యంత్రాలుగా మారిన మనం  మారేది ఏనాటికో చేరేది ఏ గూటికో  గతుకుల దారిలో గమ్యం ఏమిటో ....? అందనిదే గొప్పంటారు   ఆత్రంగా పరిగెడతారు  అయోమయమై అంతా భ్రమయై  అస్తవ్యస్తపు అలజడి బ్రతుకై   భాగ్యనగర భోగాలల్లో భోగ లాలస క్రీడలు కొరివై   సంపాదన సహేతుకమైన సిరిని గిరిగా పోగేయాలని  సహనానికి సవాలు చేస్తూ పైసాపై సవారీ చేస్తూ కోరికలను కుంపటి పోసి వేడి ధగల సంతృప్తిని కాచి    అశాంతిలో అడుగులు వెసి నూతిలోని రొట్టెను కూడా  నేతి అని చేతులు తోసి అభద్రతను ఆలింగనం చేసి  ఉరుకులు.. పరుగులు..నిరాశల చూపులు   రేపటితో నేటిని మరిచి   మూకుటిలో పేలాలవుతూ   ఆ తెలుపే శాశ్వతమనుచూ  సంబరంతో గెంతును అంటే   మంట తాప తూలిక తనది   జాలి అంటే అమాయకం మనది   రంగుకారమే ఒంటికి పూసి  జోడు బాధలే మనసుని దోసి   నిరంతరం తరం తరం   పరంపరల తదనంతరం   జీవితమే బొంగరం  కోరికలకు ఆశలకు అనువైన మందిరం   మనశాంతిని దోచే యంత్రాంగం..! రచన : తాజ్  పట్నం చేరిన పొరడు

మనిషికి మనిషే శత్రువు...🔨

చిత్రం
ఆ సూర్యుని అస్తమ కిరణం నా కన్నుల ఆశావరణం ఈ జగతే చిక్కుల వలయం అడుడడుగున భంగపు పర్వం కష్టకులకు లేదే కాలం సోమరులకే అందల పీఠం ఈ జీవితం ఆకలి గీతం పేద బతుకు అంధ:కూపం అనుదినము క్షణమొక నరకం కడ బ్రతుకే చికటిమయం కాటికి చేరిన కూరదు మోక్షం కర్మ ఫలితం కారణాతీతం ప్రపంచమే నాటకరంగం రక్షణ ఎరుగని రంగుల గోళం మనిషికి మనిషే యమపురిపాశం రచన : తాజ్  పల్లెటూరి పిల్లోడు

నీవే కదా నా ప్రశాంత జీవనం..

చిత్రం
ఇదేమి జీవితం, కానీ ఇదే జీవితం అన్నివున్నా లేమి జీవితం మనసు కన్నీట జారు జీవితం ఓర్పు లేక ఏ తీర్పు నోప్పక కడుపు కాల్చినా నిద్రకోర్చినా మర్మం తెలియని వనితంట లోతే ఎరుగని మా జంట తప్పు ఏమైంది చిక్కు రగిలింది హక్కు యాడుంది చివాక్కు మిగిలింది అర్దం మారి పెడర్థం దూరి నమ్మకం కరిగి అపనమ్మకం పెరిగి పరం తూలనాడి మిగిలిందేది..?నీది/నాది ఉరిమే నింగి విరిగితే ఏమీ తిరిగే భూమి కంపనలేమి ఒక్క నిమిషం ఆలోచిస్తే ఉలికిపాటులో అంతా మాయం అతలం వితలం అంతా శూన్యం అట్లే.. అలిగినా నీవే నను అల్లినా నీవే నీ కోపం ఉప్పెన నాకు, నీ ప్రేమ చంద్రుని తాకు నీ చేతుల అలరారని రోజు, నా రేపటి బ్రతుకే చేటు నీవే కదా నా జీవితం నీ తోడుంటేనే ప్రశాంతమైన జీవితం ఇప్పటికీ ఎప్పటికీ నీ తోడే నా జీవనం నీ నవ్వే నందనవనం..! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

సగటు భారతీయుని గా నా ఆవేదన..!

చిత్రం
స్వాతంత్య్రం వచ్చిందని సంబరపడలో అది స్వార్థపరులు చేతిలో కీలుబొమ్మ అని చిన్నబోవాలో ఇన్నాళ్ళ స్వాతంత్య్రం ఏమిచ్చింది పేదరికపు దరిద్రం, అవినీతి లంచగొండితనం స్వార్ధపు నల్లదనం అధర్మం అన్యాయం పాశవికం వెరసి..? గాంధీజీ కలలుగన్న స్వాతంత్య్రం అగ్లేయుల పాలనేనా అనిపిస్తుంది కదూ ఇది నాలాంటి సగటు భారతీయుని ఆవేదన అరవై నిండినా అర్డాకలి వీడలేదు రాజ్యమేలే అన్యాయం సర్దుమనగలేదు ఓనమాలు నేర్పి ప్రజల చైతన్య పరచలేదు ఒరడిస్తూ బుజ్జగిస్తూ మెలకువగా వున్నా కూడా ఒంటి బట్ట లాగేరు ఇన్ని చూసి కార్చే కన్నీటిని కూడా అవమానం చేస్తూనే అవహేళన గా చూస్తూనే ఆకతాయి పథకాలతో ఆశలెల్ల నింపెరు నోటి కాడి బుక్కలాగి బూటు కాలితో తన్నెరు ఎన్నికలలని ఉన్నన్నాల్లు సామాన్యుడు మనిషిరా అధికారం వున్నన్నాల్లు ఎవడు కానరాడురా ఏది ఏమైనా.. సమాధానం కోసం ఎదురు చూపులే అనుభవజ్ఞులందరు మిథ్యావాదులే..! .............................................🪄 రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

నెల జీతగాడు(private employee)

చిత్రం
జీవితమను సముద్రయానం  జీతం అను తెరచాపతొ గమనం అమ్మకాల తెడ్డు లెకనె  నడ్డి విరిగేటి గడ్డుకాలం  సంపాదన సహెతుకం కాదా  సహనం వీడి పరుగె ఎలా..? జీతానికి భలి జీవితం కాదా  అన్నిటికి ధనమె ప్రధమం  కష్టేఫలి పలుకె నిగమం  నీ కష్టం ఎవనికి ఫలితం..? "రాత్రులు నీవి కావు, పగలు నీకు నీవే లేవు" నియమం లేని సమయం కాని  పరిమితి లేని పని గంటలు  పడిగాపులు ఉన్నా కుంటి బ్రతుకులు  అత్తెసరు అధికారులు  సత్తె సావండను దొభి మాటలు.. పేరు గొప్ప ఊరు దిబ్బ అను సామెత ఉంది  గడీయ ఖాళి లేదు,గవ్వ నిలువ లేని గాదే మనది  గంగ కనుల సుడి తిరుగు గాధ చివరిది  అందరూ దూరమయ్యారు ? కాలం శాపం, ఇక ఇంతె ప్రాప్తం! కాలప్రవాహం లో కరిగి పొయాను కాని ? ఉదయ భానుడను కాలెకపొయాను! ఆశల పల్లకిలొ అహార్నిశలు శ్రమించినా అందలం చేరుకోలేక పొయాను గతం లో గతించానె కాని ? గర్వించేలా ఎదగలెక పొయాను! ఇది జీవిత పాటం అనుభవాల పీటం  అందరికి ఆశే చిరకాలం మాకు గొసె.... ఏ కార్మిక చట్టాలు మా కష్టాలను తప్పించలేవు ఒక్క పూట సెలవు కోసం ఎన్ని సార్లు అధికారుల కాళ్ళు మొక్కమో లెక్కేలేదు  మేడే రాగానే నిప్పులో ఉప్పూలా రగిలిపోతాం తెల్లారగానే నిమురుకప్పుకుని పనిలో చేరిపోతాం 

ఓటు బ్యాంకు రాజకీయము...

చిత్రం
సందర్భం : ఎన్నికలు ముగిసిన అనంతరం నీతి మాలిన రాజకీయము  నియమము లెనిదీ నీచకీయము  బలిసిన నేతలు భడా చోరులు  ప్రజా పిడితకు ముఖ్య కారకులు  జనావాహిని వారి వాహనములు  కార్యకర్తలని నామకరణములు  ప్రజల నాడిగోని పరుగులిడుదురు  పైసా పంచి ప్రతినిదులవుదురు  ఓటు బ్యాంకు ఈ రాజకీయము  ఓట్లు రాలిననే చాటు ముఖములు  కంస కీచక రాక్షస గర్వం,దోపిడి పర్వం  తెలుగు నేలలో వేళ్ళునిన భూతం  ఏంతకాలమీ ఆకలి చావులు  ఏన్ని నాళ్ళు ఈ అత్తెసరు బతుకులు  సాగకూడదీ నీచ దురంతర  నిగ్గు తెల్చాలి రండి పోరాటంగా  మేల్కోండి ఓ ధాత్రి పుత్రులు  తరిమి తరిమి కోట్టుడీ దగుల్భా•••?  రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

అమరులకు వందనం..

చిత్రం
వందనాలు వందనాలు అమరులార మీకు ఉద్యమాన పోరారు జీవితాన వెలిగారు జన్మకు అర్దం నేర్పారు అలా జీవించండని చెప్పారు బానిస బ్రతుకులు వద్దని బలిదానం ఇక శరణ్యమని  ప్రాణ త్యాగమే మార్గం అని అదే తెలంగాణకు సన్మార్గమని మా హృదయ స్పందనగా మారి ఉద్యమ స్పూర్తితో నడవమని అమర తెలంగాణ నాది వీర తెలంగాణా అసువులు బాసిన అమరుల ఆకృతి నా తెలంగాణ అడుగడుగున పెనుగులాట ఒడిదుడుకుల తెలంగాణ ఉద్యమంగ కదిలినం వీరోచితంగా పోరినం రండి రండి రండి  అడుగు కలిపి నడవండి బంగారు తెలంగాణకు బాసటగా నిలవండి.. జై తెలంగాణ.. జై జై తెలంగాణ... రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

ఆయమ్మా నీకు వందనం (Baby care centers)

చిత్రం
ఆలు మగల ఉద్యోగం పిల్లల బ్రతుకున అంధకారం పొత్తిళ్ళలో పసికూన ఆకలి అరుపులు విని పరిగెత్తుకోస్తున్న పాల సీసాలు గని సగం కడుపుతో కూన సర్దుకుని అందానికై తల్లి ఆరాటమెంటని అడగలేక మూగ కనులతో కసిమి గొడ్డు గొద కున్న ప్రీతి మడిసికి లేదని తల్లడిల్లే బిడ్డ ఆకలి తాళలెలని చనుబాలు ఎరుగని పిల్లలెందరో తల్లి ఒడి చేరని బ్రతుకులెన్నో ఎంత ఏడ్చినా గుక్క పట్టినా  ఊయాలే తనకు ఓదార్పు అని అమ్మ ఒడి నాకు హులక్కే అని తీరిక దొరకని నాన్న చేతిని అందకోవాలనే చిలిపి ఆశని తోపుడు బండి తీర్చేసింది కాలికి ఉతం అందించింది అమ్మ ఒడిలో నిదుర పోలేదు నాన్న చేతిలో నడక నేర్వలేదు అందరు ఉన్నా అనాధ నేను చలనం కలిగిన కీలు బొమ్మను🕴 అమ్మ ప్రేమా..? ఎమో తెలీదు నాన్న ఎవరంటే కరి బండ తోచేను ( నల్లని రాయి) సరిగ్గా అప్పుడు..?..! ఆయామ్మే అసలు తల్లిలా అన్ని నేర్పిన మొదటి గురువులా లాలించింది పాలించింది సహృదయం తో దివించింది దేవుడు పంపిన మరో అమ్మలా నాలో మనిషికి ప్రాణం పోసి సమాజానికి మంచి పౌరున్ని అందించింది 👨‍💼 ఆయామ్మా నీకు వందనం నీ ప్రేమ పొందిన నా జన్మ ధన్యం..🙏 ----------------------------------+++++🪄 రచన : తాజ్ పల్లెటూరీ పిల్లోడు...✍️

అమ్మాడి పోదామా ఊహల జగతిన పరిగెడి..!

చిత్రం
కురుస్తున్న ఆ వానజల్లు పులకరిస్తున్న ఈ నేల ఒళ్ళు పరిమళించే మట్టి వాసనతో మళ్లు పచ్చరంగు తివాచీ పరిచి ఆవ్హానిస్తున్న ప్రకృతి నికివే నా జోహార్లు ప్రకృతికే పరువం నేర్పిన ప్రేయసి ఇస్తున్నా నీకిదే నా కలాక్షర హారతి రవి దాగి ఊరేగ వచ్చిన నిశి జాబిల్లి నీ నవ్వు కలువోలే ఎదురు చూసిన రోజుల్లో సప్తవర్ణ శోబిత నీ కనుల దోబుచుల్లో వరదగుల్లు జరిగిన వర్షం నీ నవ్వు జారిన నా జత చప్పట్ల హర్షం తేనెలూరు నీ భాష్యం ఓ మధుకలశం మురిసిన చీకటిలో నీ మువ్వల సవ్వడి విని మన్మధుడు ఒళ్ళు నిండి నీ ముందు చేరి మోకరిల్లి కనుతెరువని తిమిరంలో నీ తనువు తాకి మోర్చిల్లి గుండె వెగమెక్కిపొగ గొంతులారి గోసరిల్లు అదిరింది భామ చలి మొదలు ఇక శృంగార విభావరి కాలం కదిలిన కాసేపటికి... చెదిరిన కురులు, నలిగిన మల్లెలు కొరికావిరై పారే చేమటలై అమ్మాడి....  పోదామా ఊహల జగతిన పరిగెడి..!                                                              రచన : తాజ్                                     మీ పల్లెటూరి పిల్లోడు