పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

నీ నవ్వే నా హృదిస్పందన...!

చిత్రం
  నీ నవ్వే నా హృదిస్పందన...! నా మస్తిష్కం లో నెలవై అక్షరాల మాలకూర్చే అలౌకిక శక్తినివ్వు నా మనసు గెలిచిన మహారాణివి నువ్వు నా కన్నుల తేలు వెలుగు రాసివి నువ్వు నా పెదవుల చిరునవ్వు పూయించ కదిలిన పారిజాతము నీవు నా శ్వాసలో కొలువు తీరిన దేవత నీవు నా జన్మ జన్మల పుణ్య ఫలముతో దొరికిన అదృష్ట తారక నీవు, నీ నవ్వు నీ నీడలో నేను నీ చెంత నా మనసు నీ పాదాలపై నా తనువు నా పరిసరాల తిరుగాడుతూ నన్ను పదే పదే చైతన్యం చేయు నీ నవ్వు నీ నవ్వుకై ఏమైనా చేస్తాను నీ నవ్వే దివెనగా తలుస్తాను ఎందుకంటే......! నీ నవ్వే స్పందనగా నడచు నా హృదయ యంత్రం ఆగిపోతుంది... రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

అందంగా ఆ'కట్టు'కునెలా....!

చిత్రం
  అందంగా ఆ'కట్టు'కునెలా....! అంజలి దేవి, సావిత్రి జయసుధ, జయప్రద మధుబాల, శ్రీదేవి ఆ తరం అందం వారిది ఈ తరం అందం నీది అబ్బా అబ్బబ్బ తన వెలుగు మోము, చూడనెంత సక్కన తన చెంత చేరి నిలిచానో, నేను కూడ వెలగనా పాలపుంత ఒడిలోన ఎన్ని గ్రహలుండినా తన చల్లని ఒడిలోన నా బ్రతుకే పండదా జానకమ్మ, సుశీలమ్మ, శైలజమ్మ, చిత్రమ్మ ఆ కాలం తీపి రాగం వారి సొంతం కోకిలలే చిన్నబోవు, జుంటి తేనె ఉటలూరు చెరుకు గడలు మాసిపోవు, కంఠస్వరం నీ దాసోహం దివి తార నెలజారి వంగినట్టి నడువొంపు నెలవంకే సేదతీరి అదిమి చూడు అను కెంపు ఆహా ఆ నడక చాలు కుర్రకారు బేజారు తన అంగీకార సంజ్ఞ కొరకు ఇంటి చుట్టు పరిచార్లు మల్లియలే పరిమళాన్ని ఆ తనువుకు అద్దెనేమో వెన్నెలలే తన యదనుపూసి నాకు వెలుగు పంచెనేమో నీ నవ్వుల గారడికి చింతలన్ని తీరునేమో అందినదా నీ చేయి, అదృష్టం లే హాయి దొరికినదా తన తోడు, నాకు లేదు ఏ కీడు తన నీడనే నాకు వెలుగు, తను లేని నే మోడు చలనమున్న శిలాజం, అస్తమించు రవి కిరణం...! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

కవిత కన్నులు....!

చిత్రం
కవిత కన్నులు....! మనసు పడిన ప్రేయసి, నవ్వు నేర్పిన నా ప్రియ సఖి కవితే నా కన్నులు, ఈ అక్షరాలే నా మది పలికే ఊసులు కవి ఆలోచనలకు మనసు వారధి, కవికి మెదడు మనోరధి కలమునకు ఉండదు ఈర్ష ఏది, రాసే కాగితం మాకు అమ్మ చెవి రాస్తాము మెదడుకు సానపట్టి, కలానికి భావాలను లంకెపెట్టి ఇది ఒక యాగము, అందరికీ దక్కని రాజయోగం నీ చప్పట్లే రాజపూజ్యం, నీ నగుమోముకు నే దన్యము అబద్దాలు కావు ఇవి, అందమైన ఆకృతులు మనసును మురిపించి ఆనందింప చేయు కీర్తి పతాకలు కవి కళ్ళతో చూడు అంతా నికే తెలియు కవి మనసుతో ఆలోచించు నీకంతా బోధపడు ఇది నిజం, నువ్వు కాదన్న నా కవితకు ఎది ఆదరణం నీది నాది ముచ్చటైన బంధం, మనం లేని ఈ జగతి వ్యర్థం కవితే మన అనురాగానికి ప్రతిరూపం కవితే మన మమకారానికి మరో అర్థం నీ నీడలోనే నా బ్రతుకు, నీ చేతిలోనే నా భవిష్యత్తు ఏ వేళ అయినా, ఏ రోజుకైనా కలిసే ఉందాం, కలిసే పోదాం..! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

ప్లవ నాయకి (The Love)..!

చిత్రం
ప్లవ నాయకి ( The Love )..! చెప్పనా చెలి! నీతో ఓ మాట చెప్పనా? ఆలన, నీ పాలన నాదిగా చెప్పనా కలువ కన్నులు నీవి, కాదనగలరా ఎవరైన సర్వ దేవతలు నీ దాసులని ఒప్పక తప్పునా.....! హిమల పవనములే కదిలి వచ్చి, నీ కురులను ముడవగా తొలకరి జల్లుల తడిసిన నేల, వీచే గంధం నీ మేనుకు అద్దగా గట్టి భూమిలో మెత్తటేరులు పొరలు కోయును, నీ కోపం మత్తడి తెగి ముంచకుండ కట్టవేయును, నా మది భాగం నీ కోపమే సంద్రమైన, నావికుడినై నేనోస్తా నీ మనసు గీటీ కవ్విస్తా, నీ ప్రేమ పొంది గెలిచోస్తా వెన్నెలనే రాట్నమలికి తెల చీరగ తెచ్చిస్తా మేఘాలను పూలు చేసి నీ కొప్పున ముడిచోస్తా చెందురునే పట్టి తెచ్చి నీ అరికాలికి చుక్కెడతా సూర్యుడిని తోలుకొచ్చి నీ గుమ్మంలో గుమ్మడిగా నిలబెడతా పంచ భూతాలు నీ వాకిటిలో, నవగ్రహాలు నీ కనుసన్నలలో ఈ జగతిని శాశించగ లేవా, భారతావనికి మహరాణివి కావా నా మది సింహాసనం అలంకరించి నవ నాయికగా వెలగవా.....! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

కథలో నిజానికి ఆడదంటే? (చివరి భాగము)

చిత్రం
ఆడుదాని మాయా,మర్మము తెలుసుకోవడం ఎలా? ఒకానొక కాలంలో ఒక రాజు దీర్ఘాలోచనలో పడ్డాడు అసలు ఆడుదాని యొక్క మనస్తత్వము, ఆలోచన సరళి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని అందుకు గల మార్గాన్ని అన్వేషించనారంభించాడు కానీ అతనికి ఏ మార్గము కనిపించకపోవడంతో కాస్త నిరాశ చెంది బేలగా కూర్చున్నాడు, అది గమనించిన అతని భార్య రాణిగారు ఎందుకు అలా దిగాలుగా ఉన్నారు అని ప్రశ్నించింది దానికి సమాధానంగా నేను ఎన్నో రోజులుగా ఆడవారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని లోతుగా అన్వేషణ సాగించాను కానీ నాకు ఎలాంటి మార్గము కనిపించలేదు, కానీ కొన్ని రోజులుగా మన రాజ్యం మధ్యలోని చేద బావి దగ్గరకు వెళ్లి కూర్చుంటున్నాను చాలామంది మహిళలు నన్ను చూసి దగ్గరకు రావడానికి కూడా జంకుతున్నారు.  అలా కొన్ని రోజుల తర్వాత ఒక ఆడది ధైర్యంగా బావి దగ్గరకు వచ్చి నీళ్ళు చేదడం ప్రారంభించింది, అయిపోగానే నేను ఆ ఆడుదాన్ని అడ్డగించి ఇలా అడిగాను ఆడదాని యొక్క మర్మము, మాటలలోని ఆంతర్యం తెలుసుకోడం ఎలాగో తెలపమని దానికి సమాధానంగా తను నాకు ఒక మాట చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది అది ఏమిటంటే రాజా ఇది సమయము కాదు, సందర్భం కాదు కానీ మీరు అంత దిగాలుగా కూర్చున్నారు కాబట్టి నేను మీ

స్త్రీ ఆలోచనా విధానము - వింత ప్రకృతి (అష్టమ భాగము)

చిత్రం
స్త్రీ ఆలోచనా విధానము....! స్త్రీ బావ్యాప్రపంచంలో వ్యవహరించేటప్పుడు చుట్టూ ఉన్నవారి మెప్పుకోసమే చూస్తుంది, ఊహలో రాజకుమారుడు, లక్షలు సంపాదించేవాడు, అడులకు మడుగులోత్తు బానిసని కోరుకుంటుంది, తన చుట్టూ వున్నవారు తనని చూస్తున్నారా లేదా అని పరిశీలించే అలవాటు చిన్నతనం నుంచి వస్తుంది, తల వంచుకునే అన్ని వైపులా గమనించడం స్త్రీ ప్రత్యేకత, తూర్పు వైపు చూసి ఎడమవైపు ఏముందో చెప్పగలదు, దక్షిణం వైపు చూసి ఉత్తరం వైపు ఏముందో చెప్పగలదు. ఆడది తనను రక్షించే మగాడు కావాలని కోరుకుంటుంది, అప్పుడప్పుడు ఆ మగాణ్ణి పరీక్షిస్తుంది కూడా, లోగుబాటు తనం ఎంత ఉందో పగబట్టి కసితీర్చుకునే తత్వంకూడా అంత ఉంది, నవ్వుతూ విషం ఇవ్వగలదు, పాడుతూ ప్రాణం తియ్యగలదు, తనకు తగ్గ మగాడు దొరక్కపోయినా తీర్చిదిద్ది పది మందిలో నిలబెట్టగలదు. యుద్ధం చేస్తుంది, యుద్ధం ఆపిస్తుంది, నరకములో నెడుతుంది, స్వర్గాన్ని చూపిస్తుంది, అంతా ఆడదాని చేతిలో పని అనుకున్నది నెరవేరేదాకా నిద్రపోదు, అందుకు సాధనగా అన్ని మార్గాలు వెతుకుతుంది, మానసికంగా ఎంత దృఢంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుందో అంత చపల చిత్తముతో మగాడి మాటలకు లొంగిపోతుంది. తనకు కానప్పుడు ఇతరులకు దక్కకూడదన్న

వివాహము - తొలి సమాగము (సప్తమ భాగము)

చిత్రం
వివాహము - తొలి సమాగము....! ఏడు అడుగులతో ముడిపడి నూరు వసంతాలు రెండు దేహాలు ఒకే ఆత్మగా రూపం దిద్దుకునే కమ్మని ఘట్టాన్ని నా సప్తమ భాగములో వివరించడం ఒక విశేషమే! స్త్రీ పురుషులు : సాంఘికముగా ఏనాటికైనా వివాహము చేసుకోవాల్సిందే, స్త్రీ పురుషులు చాలా వరకు చేసుకుని లేదా చేసుకోవాలని తాపత్రయపడతారు, స్త్రీ పురుషులిద్దరూ కలిసి సమ్మతముతో పెళ్లి (ఆర్థిక, లైంగిక, రక్షణ అవసరముల నిమిత్తము, సంఘాభివృద్ది నిమిత్తము) చేసుకుంటారు, భారతదేశంలో విహవా వ్యవస్తను పవిత్రంగా భావిస్తారు, భార్య మళ్ళీ పెళ్ళి చేసుకోవడం కంటే చావడానికి సిద్ధపడుతుంది. కొన్ని దేశాలలో మాత్రం ఆడ మగలిద్దరూ సమాన స్వతంత్రము హక్కు కలిగి ఉండి కొన్ని సంవత్సరాలపాటు భార్య భర్తలుగా కాంట్రాక్టు పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది, ఇప్పుడిప్పుడే కాంట్రాక్ట్ వివాహ పద్ధతి రద్దుచేయడానికి ఆలోచిస్తున్నారు, పురుషుడు ఆడవాళ్లపై పెద్దరికం వహించడం క్రమంగా తగ్గిపోతుంది, జీవితంలో స్త్రీలకి పురుషుడు, పురుషుడికి ఆడది అవసరం, కానీ ఆడది మగవాడిని పొందడంలో స్వతంత్య్రాన్ని కోల్పోతుంది. పురుషుడు పెళ్లి చేసుకున్నా స్వతంత్ర వ్యక్తే, పిల్లలు కనడం, గృహ నిర్వహణ ఆడవారి భాధ్యత, వచ్చిన

వ్యభిచారిణి(వేశ్య) (షష్ఠి భాగము)

చిత్రం
వ్యభిచారిణి(వేశ్య)..... పెళ్లికి, వ్యభిచారానికి వెలుగు నీడల సంబంధము ఉంది, మగవాడు తన భార్య పవిత్రంగా ఉండాలని కోరుకుంటాడు కానీ తను మాత్రం ఇష్టం వచ్చిన విధంగా వ్యభిచరిస్తాడు, రెండో పెళ్లివాడయిన కన్నెపిల్లనే భార్యగా కోరుకుంటాడు, సాంఘికంగా స్త్రీకి విలువనివ్వరు కొన్ని ప్రదేశాలలో సన్మానాలకు విందులకు భార్యలను తీసుకువెళ్ళరు, అలా తీసుకువెళడానికి ప్రత్యేకంగా కొంతమంది స్త్రీలను ఉంచుకుంటారు, వ్యభిచారిణిని కాసేపు అనుభవానికి డబ్బిచ్చి అనుభవించి వదిలేస్తారు, భార్యకు వ్యభిచారిణికి తేడా ఏమిటంటే భార్య శరీరానికి మూల్యం యావజ్జీవం అందుకే కన్నెపిల్లగా పవిత్రంగా ఉండాలని కోరుకుంటాడు, వ్యభిచారిణి శరీరానికి మూల్యం అనుభవించిన మగవాళ్ళందరూ కొద్ది కొద్దిగా భరిస్తారు, రెండిటిలోనూ ఆడదానికి ఇచ్చే విలువ కామసంబంధమైనదే, వివాహ బంధములో ఒక పురుషుడు బాధ్యత స్వీకరించి అనేక పురుషుల బారినుండి రక్షించి తాను అనుభవిస్తాడు, వ్యభిచారిణి అందరూ అనుభవించేలా ఉండాలి కాని ఎవరో ఒకరు భయపెట్టి స్వంతంగా వాడుకోవడానికి వీల్లేకుండా చేస్తారు, స్త్రీ వ్యభిచరించిననా ఎక్కువ మూల్యం ఒకే పురుషుడు చెల్లించవలసిన బాధ లేకుండా అనేకమంది పురుషులు పోటీ ఉంటారు,

స్త్రీ ప్రేమ, వైభవము (పంచమ భాగము)

చిత్రం
స్త్రీ ప్రేమ, వైభవము....! ప్రేమ అనే మాటకు నిర్వచనము స్త్రీ పురుషులిద్దరికీ ఒకే రకముగా ఉండదు, ఆడదానికి ప్రేమంటే నిర్మొహమాటంగా తన మాన, ధన, సర్వస్వాలు మగవానికి అర్పించడమే, కానీ  మగవానికి అలా కాదు తన పట్ల ఆడదానికి అభిమానం ప్రేమ ఉంది కదా అని తన సర్వస్వం ఆడవారికి అర్పించాలి అనుకోడు అలా అర్పించే వాడు మగవాడే కాదు, తాను ప్రేమించిన ఆడది ఒక్కతే అతని జీవిత పరమార్ధం కాదు, ఆడదాని కోసం సర్వస్వం త్యజించిన మగవాడు లేడు, కాళ్లావేళ్లా బడి ఆడదానిని ఒప్పించి తన అదుపులోకి తీసుకు రావడమే మగాని కోరిక, కానీ ఆడవారు తను ప్రేమించిన మనిషి  కోసం తమ సర్వస్వం త్యాగం చేస్తారు, అతని ప్రేమలో తమని తాము మరచిపోతారు అది సహజ ప్రకృతి, మగవాని రక్షణలోనే ఆడది పరిపూర్ణంగా జీవిస్తుంది, ఆ బంధం చీలిపోతే చిరిగిన పాత పీలిక అవుతుంది. మగవాడు ఆశాజీవి సమర్ధుడు పుట్టినప్పటినుంచి చచ్చేవరకు ఆధిక్యత ఉంటుంది ఆడది తనను తాను అర్పించు కోవడం తప్ప వేరే మార్గము లేదు తన వ్యక్తిత్వాన్ని చంపుకుంటుంది, వయసు వచ్చిన అమ్మాయి తను పురుషుని వెనుక (పురుషునితో) ఉండాలని వాంచిస్తుంది, సహజంగానే మగవారిలో గొప్ప వారిని పొందాలని, తన ప్రియుడు పురుషోత్తముడిగా ఉండాలని అనుక

స్త్రీ పురుషులలో లైంగిక వాంఛ..! (చతుర్థ భాగము)

చిత్రం
  స్త్రీ పురుషులలో లైంగిక వాంఛ..! లైంగిక వాంఛ స్త్రీ పురుషులకు చిన్నతనం లోనే మొలకెత్తుతుంది శారీరకంగా మానసికంగా మాట్లాడడం ద్వారా వినడం ద్వారా ఈ విషయం అనుభవంలోకి వస్తుంది పసితనం నుంచి యవ్వనంలోకి కుర్రవాడు రావడం సర్వసాధారణమైన విషయంగానే ఉంటుంది ఉద్రిక్తత తెలియజేయడానికి ఒకవయవము ఉండనే ఉంది ఉపశమనానికి ఆనందించడానికి స్త్రీ ఉంటుంది, అక్కడ కూడా మగవాడికే స్వేచ్ఛ మగువ అతడి చేతిలో కీలుబొమ్మ కలవడంతో మగవారి ఉద్రిక్తత తగ్గి సంతృప్తి ఆనందము తప్పనిసరిగా పొందుతారు సంతృప్తి లేకపోయినా ఉద్రిక్తత మాత్రం తగ్గుతుంది. స్త్రీకి అలా కాదు ఈ ఆనందం అనుభవించడానికి తగిన స్థితికి రాకపోతే అసంతృప్తి చికాకు మిగులుతుంది, పూర్వకాలం నుంచి నేటి కాలం వరకు కన్యత్వం గల కన్యను మాత్రమే వివాహానికి పనికి వచ్చే కన్యగా నిర్ణయించారు రతి ఆనందం పొందడానికి అనుభవము, చొరవ, అర్థము చేసుకోగల సూక్ష్మ జ్ఞానము ఉండాలి సామాన్య రతిలో పురుషునిదే పైచేయి, స్త్రీ ఉద్రిక్తత చెందినదా లేదా అన్న విషయము ఎవరూ ఆలోచించరు సంభోగానికి స్త్రీ అనుమతి అవసరం లేదు, తను ఇష్టపడి వస్తుందా లేక తప్పక తప్పుతుందా అని ఒప్పుకుంటుందా అని చాలామంది మగవారు ఆలోచించరు పట్టించుకోరు

స్త్రీ ఆంతరంగికము (తృతీయ భాగము)

చిత్రం
  స్త్రీ ఆంతరంగికము... భర్త తనకన్నా గొప్పవాడు అన్న భావం స్త్రీకుంటేనే సంసారం నిలబడుతుంది పురుషుడు స్త్రీని రెచ్చగొడతాడు ఆకర్షిస్తాడు అనుభవించి వదిలేస్తాడు అలా వదలని వాడు దేవుడిలా భావిస్తుంది, పెళ్లికాకముందు తనకు నచ్చిన దేవుడు లేదా సినిమా నటుడి బొమ్మను తన దగ్గర పెట్టుకొని వాళ్ళు తన వారైతే ఎలా ఉంటుందో ఊహించుకుంటుంది అలా అందని మగవాడిని దృష్టిలో పెట్టుకోవడం తన ప్రేమ ఆలోచనలను కేంద్రీకరించడం వల్ల ప్రమాదం లేదు ఏ పర పురుషుని మీద దృష్టి పడి అది త్వరగా సాఫల్యానికి వస్తే విషాద పరిణామాలకు దారి తీయవచ్చును ఊహజనితమైన ప్రేమ, ఆలోచనలో ఉన్న ఆనందము, నిజ జీవితంలో దొరకక పోవచ్చు కానీ ఆ ఊహల లో పరిపక్వమైన స్త్రీ పెళ్లి చేసుకోవడం జరిగితే చక్కని గృహిణిగా ఉంటుంది భర్తకు విధేయురాలిగా తన కలలకు రూపమిచ్చిన దేవునిలా చూసుకుంటుంది. చేరని ప్రేమలేఖలు, బయటకు చెప్పని ప్రియ వచనాలు ఇచ్చే మధురానుభూతి గొప్పది తనకు ఏనాటికైనా మగవాడు అవసరం తనంతటి దాన్ని ఆకర్షించాలంటే ఆ మగవాడు తప్పక గొప్పవాడు అయి ఉంటాడు తను అదృష్టవంతురాలు అని స్త్రీ భావించాలి, కొందరు అమ్మాయిల మనస్తత్వం చిత్రంగా ఉంటుంది తను పెరిగి పెద్దదయింది ఇక అమ్మ నాన్న అన్నదమ్ము

పురుషుడు ఏనాటికైనా స్త్రీని అర్థం చేసుకుంటాడా?(ద్వితీయ భాగము)

చిత్రం
  పురుషుడు ఏనాటికైనా స్త్రీని అర్థం చేసుకుంటాడా? (ద్వితీయ భాగము) స్త్రీ చిత్ర విచిత్ర ప్రకృతులు , పడుచు పిల్ల వేషాలు, భార్యగా కామపిశాచిగా, ప్రియురాలిగా, స్వేచ్ఛా జీవిగా అన్ని కోణాలలో స్త్రీ ఆంతరంగిక మేమిటో? మహామహులు కూడా కనుక్కోలేక చతికిల పడ్డారు కానీ స్త్రీకి పురుషునితో గల సంబంధం ముఖ్యమైనది ఎందుకంటే స్త్రీ లేకుండా పురుషుడు గడుపుకోగలడు కానీ పురుషుడు  లేకుండా స్త్రీకి జీవితమే లేదు. అయ్యో నీకు చీర తీసుకురావాలని అనుకున్నాను కానీ మరిచిపోయాను అని మొగుడు అంటే పొంగి పోతారు బోలెడు చీరలు ఉన్నాయి ఇప్పుడు ఎందుకులే అంటుంది, మరి కొందరు స్త్రీలకు కామవాంఛ ఎక్కువగా ఉంటుంది కామ వాంఛ తీరకపోతే భర్తతో లేక పిల్లలతో తగాదా పెట్టుకుంటారు తన అసంతృప్తి తన లోపంగా భావించి సంతృప్తి కోసం అనేక మంది పురుషులతో పరిచయం పెంచుకుంటారు కానీ కొందరు స్త్రీలు భర్తతోనే సుఖంగా గడుపుతారు తనంత తెలివి తేటలు లేకున్నా తనకు దిక్కుగా తను చెప్పిన మాట వినగలిగితే చాలు అని అందం కోసం చూడరు తెలివి తేటలు ఉన్నవాన్ని చేసుకుని అనవసరమైన భాధలు పడటం కంటే సామాన్యుని చేసుకుని తన మాట చెలామణి చేసుకోగలిగితే చాలు అని స్త్రీ అభిప్రాయం. కొంతమంది స్త్రీల

ఆడది కోరేది ఏమిటి? (ప్రధమ భాగము)

చిత్రం
  ఆడది కోరేది ఏమిటి? ప్రపంచాన్ని పాలించే మహారాణి కైనా పక్కమీద మొగాడు కావాల్సిందే! ప్రేమించడం, ప్రేమించబడడం కన్నా మించిన సంతోషం స్త్రీకి మరొకటి లేదు పురుష సాంగత్యం కోసం నిరంతరం స్త్రీ తపిస్తుంది పదవి, రాజ్యం, అధికారం అన్నీ ఉన్నా "నేను నిన్ను ప్రేమిస్తున్నా" అనే మగాడు ఆడదానికి కావాలి. పురుషునిలా స్త్రీ తేలికగా మరిచిపోవడం మనిషిని మార్చడం చేయలేదు ఉత్సాహము ధైర్యము, కేంద్రీకరణ, లౌక్యము ఉంటే నిలబెట్టుకోవచ్చు అది స్త్రీకి కావాల్సినంత ఉంది. ప్రతి స్త్రీ పురుషుని ఆకర్షించడంలో ఆరితేరిందే, ప్రేమ అన్నది ఒక రకమైన మానసిక స్థితి భరించడం, భర్త మాట అనుసరించడం ఆడ వాళ్లకు బాగా తెలుసు ఎంత అందవికారంగా ఉన్నా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్న మగాడు దొరికినప్పుడు ఆ స్త్రీలో తెలివితేటలు పెరుగుతాయి. ముసలయినా ముతకయినా ఆడ దానిలో ఒకరిని మెప్పించాలని ఆకర్షించాలని  తాపత్రయం ఉంటుంది మెచ్చుకున్న వాడే మగాడు మొనగాడు. స్త్రీ మొట్టమొదట చూచిన మగవాడు తండ్రి అందుచేత స్త్రీ దృష్టిలో తండ్రి స్వరూపం ముద్ర వేసుకుంటుంది ఆమె జీవితంలో పురుషులు ప్రవేశించినప్పుడు తండ్రి పోలికలను వాళ్ళ తో పోల్చుకుంటుంది తండ్రి పోలికలను దగ్గర