పోస్ట్‌లు

జూన్, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

భావితర సన్నాసులు....🕺🏻

చిత్రం
సమయం వృదా చెస్తే జీవితం వ్యర్థమవుతుంది బ్రతుకు ఎడారి అవుతుంది భవిత కనుమరుగవుతుంది సంతోషం మాయమవుతుంది దుఃఖం పెల్లుబికి వస్తుంది అభిలాష అంతరిస్తుంది స్వయం కృషి సర్దుమనుగుతుంది కాలయాపన కర్మఫలం అయితే బ్రతుకు చలనం భారమై జీవితం నరకమై, జిజ్ఞాస దూరమై ఇక వారు చలనం కలిగిన శవాలు మరణం చెందిన మూర్ఖులు భాధ్యత తెలియని భావితర సన్నాసులు.. జీవితం ఒక కుసుమం🌺 వికసించినంత కాలం దక్కను ఆదరాభిమానం వాడినదా...?, కానరు జనం..! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

ఎప్పుడత్తవు నీ జిమ్మడి పోను..🦅

చిత్రం
అర్థరాత్రి దాటినా ఆకలి అంతా అలిగి చచ్చినా కమ్మని కల వచ్చి మురిపిస్తున్నా నిదుర రాక నిట్టూరుస్తున్నా గడియ కూడ కదలదు కనుల మత్తు మచ్చుకైనా రాదు జగత్తు మత్తున తూలుతున్నా నా జగత్తు నువ్వవ్వడం వల్లనా ఏమీ..? నా భాధ నానాటికి పెరుగుతున్నది నీవు దూరం ఐతే బతకలేనంటుంది నీ కోసం బ్రతుకు చాలించమంటుంది నీ ఉచ్చ్వాస నిచ్చ్వాసగా నిలిచిపొమ్మంటున్నది.. రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

అవని ఒడిలో అమ్మ వేదన..

చిత్రం
ఒంటరి బతుకున ఎంతటి కేధం చంటి బిడ్డతో సాగెను సేద్యం ఇది ఎవని పాపమో, ఎంత చొద్యమో అప్పు ఊబిలో పెనిమిటి ప్రమిదెమో సంద్రపు నీరె ఆవిరి చేసి కన్నుల జారెను వర్షపు చినుకై పూల దారులే ముళ్ళ పొదలుగా మేలు రోజులే కిడు కోరగా గుండె మెండుగా బిడు వారగా ఆశలు జారి నిరాశ చేరి అడుగే తూలి ధరిపై కూలి ఆవేదనలో అడుగులు పడునా ఈ రోదనలో గమ్యం చేరునా సొంతం అంటే పంతం పట్టి ఎంతకెంతని వంతులు వేసి అంతకంతకూ గోతులు తీసి అహర్నిశలు శ్రమించినా..! ప్రతిఘటిస్తూ పయనించినా ఫలం దక్కునా, భలం చిక్కునా ఏ దారైనా ఇదే నా తొలి అడుగు ఆ అడుగే ఆశ్వాలంటూ ఆనందానికి కళ్లెం వేస్తా అభివృద్ధికి వలవేస్తా జాతి గర్వించగా వన్నెతెస్తా.....!  రచన : తాజ్   పల్లెటూరి పిల్లోడు

కర్మరా బాబు...

చిత్రం
చరణి - చరణం పద్మభూషితం చరణి - చూర్ణం పారిజాతం చరణి - చౌదము చంద్రబింబం చరణి - చెంతనే మనసుకాహాలాదం పారిజాత పుష్పప్రాక్రుతిక సౌందర్య సొబగులను అంది పుచ్చుకున్న అదరికాంత భామిణి అంతరంగమున అలరించె విణా వాణి హాయిని కూర్చగా ఆవహించిన కొకిల నవ్వొయి కలకాలం నీ చరణముల చెంతనె వెల్లదిస్తా కాలం నీ దోసిలిలొనె కన్నుమూస్తా ఇది కర్మము... రచన : తాజ్ పల్లెటూరి పిల్లొడు

ఇచ్చంత్రాల నవ్వు...

చిత్రం
సంధ్య వేళ భానుడి పోలు వగల రంగు వలువగ మార్చి తెల్లని ఆ మేఘాలే నీ మదిని దాచు పై యదను కాచు కోంగుగా ముడిచి నవ నవల సుమ విరులే గంధాలుగా పూసుకుని మేలి ముత్యాల పచ్చడాలె చెవుల చేయు భోగాలు నీ కాలు కదిలి జల్లుమని జుమ్మని మ్రోగే మంజిరాలు పరువాల గాలి చల్లగ విచెనో నీ నడువొంపు తకదిమి ఆడేనో నీ గాజుల గల గల పిలిచెనో నయనాలు ఆడే దోబూచులాటకు తమలపాకుల పరుపు చూడు మన తను వేడికి పాలిపోవు కరి బిగియుల నలిగిపోవు పడతి నిను చూసి ఇచ్చత్రం అనే జనులు వడి కాకులు కాదా సుమి నీ గోటికి వారు సరిరారు కదమ్మి.. ...................................+++ రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

నీవు నా పక్కనుంటే...!

చిత్రం
ఇది కవిత కాదు, కల్పన అంతకన్నా కాదు ఇది కథ కాదు, కథానికా కాదు బుద్ది చాటు మాట కాదు, మనసున మెదిలే పాట కాదు ఎన్ని రోజులయ్యింది, ఎంత నిరీక్షణ సాగింది నా గొంతు మూగబోయింది, నా కలం పట్టు తప్పింది ఎదురు చూపులో వదురు మాటలు ఎదురు పడినను చేటు చూపులు అంతరం పెరిగింది, భంధమే విరిగింది గమ్యానికి ముందుగానే గిరుల తలుపు మూసింది కాలం అను నావ లోన కన్నీరే మిగిలింది మనం అనే తెడ్డు విరిగి విడ్డూరం చూస్తుంది నీ తోడు లేక నడవలేక అడుగు దారి పట్టింది వనాలన్ని చేత మొలిచి చెంపవాయ కొడుతుంది గోదారి గంగ కనుల నిండి ఊపిరాడనియకుంది ప్రాణ ప్రియా మన్నించు, నీ గొప్ప మనసు పలికించి నీ తోడే చాలు నాకు, అదే గొప్ప గెలుపు నాకు నా చేతిలోనే నీ చేయి చాలు, ఏ దిగులు లేదు నాకు మన ప్రేమ నిజం అయ్యేనా, అది నిన్ను నన్ను పెనవేసెనా జగాలన్ని జయహో అని, నా కాళ్ళ ముందు వంగి వణుకు యడబాటుకు వీడుకోలు, మన్నించవా నా వేడుకోలు.. ................................................................................++++ రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

చోలికే పిచే క్యాహే (దిల్)

చిత్రం
చోలికే పిచే క్యాహే (దిల్) అందాల భామ, అపరంజి బొమ్మ పాడేటి పాట, సాగేటి ఆట తన నోటి వెంట, తెనెలూరు మాట తన వదనమంత ఏపు కాసిన పంట వంగి కాచిన కాత 🍒 నాకంది వచ్చేనా ఇక, భాగ్యమే అంతా అందివచ్చిన ఆ రోజంతా సరసమైన విందు అందుకుంటా చక్కగా పాదుల్ని కోసుకుంటా నిక్కముగ నా మనసు కత్తుకుంటా...🎻 రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

నీతో నేనే నాలో నీవే..!

చిత్రం
నీతో నేనే నాలో నీవే..! ప్రియా..నా ప్రియ మదిలోన దాగినావా కనులలోన ప్రేమ విరియ, నను బందించినావా మాటలలో మధుకలశమే, నడకలు నాకిష్టమే గ్రిష్మములో గిరి పుత్రిక, నీ దాపులో వన కిర్తులిక సకలం సౌఖ్యం, నీ సర్వం నా సొంతం గిరి పిలుపులు వెనుదిరుగునట్లు, నా ప్రేమయు నిను చేరును ప్రకృతి ఆ సోభగులన్ని, పల్లెలలో నిలిచినట్లు శిల్పులే బహు నేర్పరులై, నీ రూపం చెక్కినారు ఆత్రంగా నిను చూడగా, ఇష్టంగా నిను చేరగా కష్టమైన తోవ మరిచి, నీతోవన సుఖం తలచి వస్తున్నా నీ కోసం, వరాలిడు మన జత కోసం .................................................. రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

అసమాన వీరుడు(భర్త), అనురాగ దేవత(బార్య)..!

చిత్రం
నా అర్ధాంగి..! సుస్వరాల రాగిణి, సుమనొహర తారుణి సుఖాంకిత శోభిణి, సుసంపన్న తావిణి సుందర సోబగుల రూపిణి, సువిశారద కామిణి అనురాగ దైవమై, సూడ చక్కని నా అర్ధాంగిణి భర్తలు మీ బాద్యతలు..? భార్యను మాత్రమే ప్రేమించు, తన చుట్టూ బ్రమించు తన కోసమే జీవించు, అన్ని తానేనని అర్చించు తన కోసమే ప్రార్థించు, కరుణించమని అర్ధించు తన నాడి గొని భాషించు, తన వాణి విని ఆనందించు అవసరమైన చోట అదిలించు, భాధాగ్రహిత అయిన ఓదార్చు నీ తేనె కౌగిట బంధించు, తానే నీ బ్రతుక్కు దిక్కు అని గ్రహించు అమృతమయమైన నీ జీవితం తనకందించు అనురాగాల బాటలో జంట గువ్వలై పయనించు.. --------------+-++++++++++++++++++++                             రచన : తాజ్  పల్లెటూరి పిల్లోడు

విశ్వకర్మ సృజిత నారి (నీ ప్రేమ జాడల్లో)

చిత్రం
నా ఆరో ప్రాణానివో నా అంతరంగిక సౌదానివో నా ఆనందామృత దారవో సుందర మందార పరిమళ నారివో స్వర్ణ కామాంచిత స్వర వీణవో కరుణించి ధారగా రాల్చిన వర్షానివో చీకటి న దాగి వెలుగు చిమ్మిన దీపానివో మసక చీకట్ల ను పారద్రోలి నా జీవితాన కాంతి నింపిన సూర్యదేవుని ప్రతినిధివో వెన్నెల వెలుగుల జాబిలమ్మవో నాకై ఇలవెలసిన దేవతవో నీకై పరితపించు నా హృదయంపై నర్తించు నర్తకివో నా ఇంటికి కంటికి కమనీయ కాంతి చిత్రానివో నీ ప్రేమ జాడల్లో , మన పెళ్ళి చూపుల నాటి రోజుల్లో ఈ నా కవితకు నీ ప్రతిమ ప్రేరణ ఆ ప్రెరణే నీ అందానికి ఆవిష్కరణ మన అనుభంద భాందవ్యమే ప్రేమ దినోత్సవానికి నాంది అని నా భావన..! ----------------------------------------------++++++ రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

అరక పీటపై సరసాల సేద్యం...

చిత్రం
అరకదున్నే పెసర చేను మసక బారే పొద్దు సూడు ముద్దుగుమ్మ వగలు చూసి అరక ఎద్దుల నిలుపు చేసి అరక పీటన నిన్ను నిలిపి ముద్దులతో మది గుద్దులతో సాలు సాలు ఇరువాలు దున్ని పొదల మాటున యదలు బిగియగా రుచులు చూసెదా మూతి నాకెదా కమ్ముకున్న చికటింట పనులు నావి, వెతలు నీవి నేటికిది చాలు, రేపటికి బెగిరవుండు.. ------------------------------------------+++ రచన : తాజ్  పల్లెటూరి పిల్లోడు

చిలిపి నవ్వుల చినదాన...

చిత్రం
ముసి ముసి నగియుల మువ్వలదాన ముంగురు కురుల మూగదాన శ్వేతప్రస్పుటాలంకార ముద్దుగుమ్మ  నటన కన్నుల మాత్రికురాల మగతత్వ మెరిగిన మాయల బొమ్మ మత్తును జల్లే మరల బొమ్మ గారడి నేర్చిన వయ్యారివమ్మ నీ జడ కొప్పున నను తురిమితివమ్మ ఊపిరి సలుపక చస్తున్నానే కొమ్మ వదులు విడువవే ఆశల దిమ్మ అర్థాంతరంగా చస్తానే నీ జడ కుచ్చుల నడుమ... -------------------------------++++ రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

మన్నిస్తావా ప్రియా..(ప్రేమ దారిలో)

చిత్రం
ఎవరు నీవు..? ఏ కొలనులో తామరవు ఏ గూటిలో కోయిలవు..! కార్తీక మాసపు దీపాలన్ని ఒక్కచోట చేరితే ఆ ప్రకాశమంత పూసుకున్న వదనంతో ఉత్తమమైన అభినయము తో ఉత్యుత తెలంగాణ లో అడుగిడిన ఆడపడుచువో ఉల్కలై రాలిన చంద్రుని ముక్కవో గ్రహాంతరవాసివో, బృహస్పతి పుత్రికవో బృహోత్తమమగు నా ప్రేమకు రూపానివో అంగబలం భుజబలం అన్ని నీవే నాకు  నీవు లేక ఏ విజయం రాదు నాకు..   మరి నేను..? కూర్చున్న కొమ్మను నరికాను, ఆదరించిన చేయి విరిచాను ప్రేమ పాశం మరిచాను, నోటి పూజతో చెలరేగాను🗣 చిన్న పిల్లాడి మనసు నాది.. నీ సూపు లేకుండా నడవనిది, నీ మాట వినకుండా మనలేనిది మన్నిస్తవా ప్రియా.......... నా దారిలో అడుగు కలిపి, మన ప్రేమను గెలిపిస్తావా మన ప్రేమ దారిలో కవితా కుసుమాల పంట వేద్దామా..! -------------------------------------------------------------++++++ రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

జంట పక్షుల కమ్మటి గానం....

చిత్రం
తూరుపు తెల వారింది, వెన్నెల దిగి నడిచింది సూర్యుని పొడ సొకగనే, ముంగిట ముగ్గయ్యింది కోడి కోయిలయ్యింది, కూత పెట్టి అరిచింది నిను లేప సహసించింది.. అప్పుడు.......! చెదిరిన ఆ కురులను చూసి, జారిన ఆ వలువలకేసి చూసిన నా కన్నుల ఫలికి, ఈ రోజుకు శుభమని పలికి నీ నవ్వుల శ్వేతంకెనా, నా తనువు న శీతం రాసి చలి చలిగా నిను పెనవేసి, గిలి గింతల గేయం నీకై రమ్యంగా రాస్తా యదపై........... మన జంటను చూస్తే ఇలపై, ఎ పోటీ రాదే ఇకపై నది దాటని నీరుమల్లే, గతి మారని తారవోలే నీలోనే ఉంటాను,నీ నీడగ మారతాను ఇంద్రధనసు రంగులోని భావాలు నీలోను పలికిస్తా, నీ గెలుపుకు కృషి చేస్తా... ------------------------------------------+++ రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

యువత ఎక్కడయ్యా భవిత..

చిత్రం
యువత... కానరాక భవిత, భవిష్యత్తు మూత  కలిసి రాని గీత, అందని ఏ చేయూత పల్లె వదిలి పట్నం చేరినా, పట్టా పుచ్చుకు పచార్లు తిరిగినా నౌకరీ ఇచ్చే నాదుడు లేడు, కిందా మీదా బాదుడు షురూ..! పనికి రాని ప్రణాళికలు, ప్రచారానికే పథకాలు దారి చూపదు చదువు, దరిద్రానికే ఇది మొదలు అధికారుల ఆట, జారుతున్న కన్నీట ప్రభుత్వానికి సుస్తీ, పనులన్నిటా జాస్తి🖕 అందుకే గా ఆ పెద్దల సూక్తి చదువుకున్న ఈ సన్నాసి కన్నా చదువు లేని ఆ చాకరి మిన్న.. ----------------------------------------++🪄 రచన : తాజ్  మీ పల్లెటూరి పిల్లోడు

నీ నవ్వులే - మెరుగులు..

చిత్రం
ఈ వెలుగులు తిమిరం తరిమి నా నిదురను పరదా తొలగి ఓ ఆశల వలనే విసిరి నిను నా తలపులలో బందీ చేసి కడలి అల నేనైతే సాగు నావ నివైతే ఉయాలై ఊపనా జాలిగా తడపన ముందు అల నీ ముంగురు తాకగా నే నీ వెనుక చేరి కనులను మూసిన ఉవ్వెత్తున ఎగసి రాన నిను హాత్తుకు ఒడ్డున నిలవన ఆ పిదప..? ముత్యాలు పగడములన్ని నే కానుక అందిస్తుంటే చిన్నబోయే ముత్యాలన్ని తళుకు మానే రత్నాలన్ని వెరసినవి కళ మాసినవి మరలా అవి మెరవాలంటే పసిడి పాత్రలా నీ నవ్వు కావాలట అది తోడై పాలపుంతలా   నీ మెడలో హారాలవుతాయట.. మరి నవ్వు..! .....................................++++ రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

జోహార్ నాయిక 🧚‍♀️

చిత్రం
ఇది విధి వణికించిన జీవితం ఆ విధాత వంచించిన క్షణం రచయిత అచ్చు తప్పులు గాయని తప్పిన శ్రుతులు శ్రోతల చెవులు తూట్లు పొడిచినట్లు అసంపూర్ణమైన ఆలోచనలు ఆలోచనే లేని అడుగులు అల్లుకుంటున్న వెతలు హృదయాన్ని జల్లెడ చేస్తుంది గమ్యం నిర్ధారించలేని ప్రయాణాలు గాటు రోడ్లపై సమీపమని వెళ్తే షాక్ తగిలి కూలబడిన రోజులు ఒక తల్లి మోసిన పాశం మరువదు తన బిడ్డను రోడ్డున విడువదు ఏ జీవి స్వార్థం కోరదు తన బిడ్డల యడబాటు కూరదు సప్త ప్రమాణాలు చేసి శాస్త్రనుగుణంగా నడవాలని సర్వం అనుకునే ప్రేయసి వదులుకుంటుంది కాదు వదిలించుకుంటుంది గట్టు తెగిన ప్రవాహం లంగరు లేని పడవ ఏ గూటికి చేరునో ఏ ఆశలు కూల్చునో ఏ రాహువు కన్నుపడి, మా అనురాగం కుంటుపడి ఓ పంతం అంతం కోరి, నా ప్రేమను ఉరి వేసింది అయోమయమై అంతా బ్రమయై అస్తవ్యస్తపు అలజడి బ్రతుకై జోహార్ నాయిక నా వెనుక నీ జ్ఞాపకాలే ఇక..🧝🏻‍♀️ .....................................🪄 రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

సుఖదుఃఖాలు

చిత్రం
  ఆశు కవిత్వం.. పాపం పుణ్యం దేవునికేరుక మంచి చెడు మడిసికే ఎరుక జననం నిజం మరణం నిజం నడుమన బ్రతుకే నాటకం అన్నారు అన్నమయ్య నాటకం కూడా యాతనే అయితే నరకం కూడా నెయ్యమే అంటాను నేను పరమాణువులన్ని ప్రాణిగా మారి తోలుతిత్తిలో వాయువు పోసి రాగం రోగపు నవదారులు కలిగి భాగ్యం బోగ్యం బాధ సుఖం కామం క్రోధం కరుణారసం అన్ని సమపాళ్లుగా రక్తి కడగిననే జీవితం అను నాటకం జనరంజకం లేదన్న కానరు లే జనం.. -----------------------------------++++++🪄 రచన : తాజ్  పల్లెటూరీ పిల్లోడు...

వంక నడుము చిన్నది..

చిత్రం
అమాయకపు చూపులతో, అతి వినయపు మాటలతో ఆనందాలు అందిస్తూ, చిరు నవ్వులు చిందిస్తూ నీవు వస్తావనే ఆశ ఏదో, నను చిలిపిగ కవ్విస్తూ ఆకాశపు దరి అందకున్న, వాన చినుకు చేరినట్లు సంద్రపు లోతెరుగకున్న, అలల హొయల తేలినట్టు ఉల్లాసం పంచిస్తూ, నవ్వులతో ఊరిస్తూ వంక నడుము కెంపులతో, ఒంపులిరగ సొంపులతో అల్లరిగా అల్లుకుని, మల్లియలలో హత్తుకుని సుగంధాల పువ్వువో, సుమనోహర తావివో అందం నీ సొంతమైతే, నీవే నా ఇంట పడితే అదియెలే ఆనందం, నా ఇల్లే బృందావనం ...................................................🪄 రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

నీ ప్రేమకు నే బానిసను...

చిత్రం
మల్లెల పొదలొ, గిల్లుడు కథలొ వెన్నెల బడిలొ, నీ వన్నెల ఒడిలొ సంద్రపు అలలై, నీ మాటల లయకై ప్రక్రుతి  అందం, నీ సొభగుల చంధం వగలె నగలై, నీ కనులె పగలై గొంతు కదిపితే రాగలె, కొంగు చాటు సురభొగలె రగులుతున్న రవినెనైతె, రంజిల్లు కమలం నీవైతె మతెక్కించె అత్తరులెల, నీ కనుల కైపుతొ మతులెపొవ చికటి ఇంటికి దిపం ఎలా నీ పెదవి విరుపులొ అరుణం లెదా దడి కట్టిన నీ దొరల సొకు దర్జాగా నే  దొసుకు పొన తెల్లవారులు వత్తులెసుకుని తనివి తీర నిను తనువుకత్తుకుని తరించనా నిను వరించనా ఊపిరి తనువును బాసె వరకు జగాలు యుగాలు మాసె వరకు నీ ఆలోచనలకు అంకురమవుతా నీ అజ్ఞాపనలను అనుకరిస్తా మన బంధానికి నే  బానిసనవుతా మరుజన్మకు నే బావుటనవుతా....🚩 రచన : తాజ్                 పల్లెటూరి పిల్లోడు

పల్లెటూరి ప్రేమ కావ్యం..

చిత్రం
పల్లెటూరి పడుచుదనం యెంకి లోని పెంకితనం కనులురాలు చిలిపితనం కరుణ కిరణ సాయగుణం గొంతు పలుకు తీపి స్వరం నా చెవుల మ్రోగు నాదస్వరం వన్నెలోలుకు మణిహారం హొయలు కులుకు సుమబాణం అందానికి ఆవిర్భావం నువ్వు నీకు సాటి ఎవరు, అది నువ్వు ఆత్మీయతలు అంకురించిన నీ నవ్వు అందమా..! నా అనురాగ దిపమా ఆలింగనాల అదర చుంబనాలు కవ్వింతలు వలపు కేరింతలు కలబడుతు క్రిడించగా సాగిపోయే కాలమైన ఒక్క క్షణం నిలిచి చూడ ఆకాశం, భూలోకం అచలనమై పరికి చూడ నా జతగా చేరుమా, నీ చేత నన్ను తడువుమా నా పెదవులపై ఆటలాడ నీ పెదవుల పంపవా నా హృదయంపై తలవాల్చి ఒక్కమాట చెప్పవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని..! -----------------------------------------------🪄 రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

ఎవరు గొప్ప..

చిత్రం
ఈ కవితా మాలికలు కవి గా ఓ సామాన్యుని మనసు సూత్రాలు కొవ్వొత్తి వెలిగిస్తూ ఇది నా వల్లే ఇంత ప్రకాశిస్తుంది అనుకుందో అవ్వ కానీ అందుకు సహకరిస్తున్న గాలి దానికి ఊతం ఇస్తున్న తైలం అంత బాధని ఓర్చుకునే దారం అవి లేక సాధ్యం అయ్యేనా కాదు కదా..! నేను నల్లగా ఉన్నాను అందువల్లే ఈ కొవ్వొత్తి వెలుగుకు  ఇంత విలువ అని వెకిలిగా నవ్వుతుంది రాత్రి మరి ఎవరు గొప్ప..? కనులు మూసుకుని పాలు తాగుతున్న పిల్లి నన్ను ఎవరు గమనించరు లే అనుకుంటే..? ఇది లోకోక్తి..! నిద్రలోనో ఐశ్వర్యం లోనో కనులు మూసుకుని రాజు నాలాగే ఈ రాజ్యం సుభిక్షంగా ఉంది అనుకుంటే..? మరి ఇది కక్కుర్తి...! అనాదిగా అధిపత్యం కోసం మత పిశాచులు, ఛాందస వాదులు,  దనికాసురులు పోరినా.. ప్రస్తుతానికి అది స్త్రీ పురుషులు అని వర్గాలు గా విభజించి పోరుతున్నరు ఎవరు గొప్ప.. చూసే చూపు చెప్పే పదం చేసే పని దేని మీద నిలకడ లేని ఈ నర బొమ్మలు ఇంత వీరంగం వేసి మిగిలేది ఎన్నాళ్ళు రా.. నాలుగు రోజుల ఈ బూలోక యాత్ర ను నరకంగా మార్చి సాధించేది ఎంది..? గతించే కాలం, చేజారే యవ్వనం ఎందుకు పంతం, ఎవరికి నీవు సొంతం  మిగిలేది నీకు నీవే నేస్తం రచన : తాజ్  పల్లెటూరీ పిల్లోడు

తెలుగు తల్లికి వందనం

చిత్రం
తెలుగు తల్లి నీకు వందనం.. తెలుగు లిపికి నేను పాదాక్రాంతం ....✍️ ఏమిటయ్యా ఈ నిరాశ నిస్సహయత నిజానికి నీడ లెనట్టు నీతికి జాడ కరువైనట్టు ఆకాశపు నీటదార అలిగి దిగిరానట్టు నా గొంది లొని బావాలు గురి తప్పినవా అన్నట్టు బుద్ది మనసు ఒక్కటవగ నీకు దిక్కెవరు అన్నట్టు నా కలం విదిల్చి రాల్చ అక్షరాలె కరువైనట్టు శూన్యం లొ దూరి పొయి దారి మరిచి పొయినట్టు అంతా అయొమయం నాలొని కవికి పొయె కాలం.. అంతటా అమావాస్య  ద్యయం కారు చీకంట్లొ నాతొ నాకె రణం ఝరులా సాగె నా జన పదులు జీవంకొల్పొయాయ జనావళిని జనరంజకం చెయు జీతాసులు కలం మాటుజారలెక జొగుతున్నాయా నీరసించి నిద్రలొనె తూగుతున్నాయా  జంజామారుతమైన జన చైతన్య పంక్తులు కావాతు మరిచి కాలిపొయాయా.. కవితె లొకంగా జీవించాను బావవ్యక్తికరణకు కలమె నా ఆయుదమని గర్వించాను కలం ముందు కానిదెదని బ్రమించాను అంతటి నా ప్రతిభా శైలి ఎమయినది కనుల పడునదెది మనసును ద్రవించలెక పొతున్నది తెలుగు తల్లి నీకు వందనం,నన్ను కటాక్షించు కవితా కుసుమాలు నా మనసున విరసించు నాలొని బావాలు అక్షర మార్గమై కవితాక్షర మాలికల తో నిను అర్చించె ఆజ్ఞ ఇవ్వు తెలుగు లిపికి వందనం... నాలొని కవిని సత్కరింపమన

నీ నవ్వే నాకు జాబిలి వెలుగు..!

చిత్రం
నర్మగర్భ లలితమగు నా చెలి నీ విజ్ఞానం ముందు సాటి కాదు ఏది నీ మనసు కడలి, దాని నిండుగా జాలి నీ మోములో హాస్యం, తను ఒంపులో రహస్యం నీకు నీవే సాటి , నీ ముందు లోకం ఏపాటి నీవు అందరికంటే ఘనాపాటి ఈ పుడమికి చినుకు వరం నీవు తోడుంటెనే నా జీవితం మధురం నీ నవ్వే నాకు జాబిలి వెలుగు నీవు చెంతనుంటే బాధలు తోలగు నా జీవితంలో చింతలు చెరగు కొత్త పోకడలు తొడుగు నిన్ను చూసిన చాలు ఒక్క క్షణం మదిలో దాచుకుంటా కలకాలం..! రచన : తాజ్  మీ పల్లెటూరి పిల్లోడు

తన పై యదల మత్తడి(అర్థరాత్రి మద్దెల దరువు)

చిత్రం
ఎర్ర రంగు వలువతో ఎగిసి పడుతున్న ముంగురులతో చిరు గజ్జెల తాళమేస్తు చిరు మందహస హోయలు పూస్తు దరి చేరిన ఆమని తానె నా ప్రియమణి నీ రూపు నవ్వె, చూపు నవ్వె తనువు నవ్వె, తపన పొందె ఆ ఓర చూపు సోయగాలు కోప్పు మల్లె పరిమళాలు తన మాటలతో మత్తు చల్లి నా తనువును ఎత్తుకెల్లి తెల్లార్లు ఊసులల్లి స్వర్గాన్ని చుట్ట చుట్టి అదరాలతో మడత పెట్టి అందించెను కిల్లీ కట్టి తడికారెసిన కురులు దూస్తు జారెసిన పైట ఓరలో ఫలాలెవొ వొలక బొస్తె చూసిన నా కళ్ళు రెండు రసాలన్ని జుర్రుకొస్తె అయ్యారె ఈ రేయికి నీ నవ్వె నజరానా ముందు ఎన్ని జన్మలైన నువ్వె నా తోడు కావా..!                                                       రచన : తాజ్                                                    పల్లెటూరి పిల్లొడు

అమాయక చక్రవర్తి (కథ)

చిత్రం
అనగనగా మహాబలేశ్వరం అనే గ్రామంలో సోమయ్య అనే ఒక మోతుబరి ఉండేవాడు అతనికి రాము అనే అమాయకమైన కుమారుడు ఉండేవాడు చలమయ్య గ్రామంలోని వారికి అప్పులు ఇస్తూ వారి దగ్గర నుండి అస్తి పత్రాలు తనఖా గా తీసుకునే వాడు తండ్రి ఇచ్చిన అప్పు పత్రాలను తనకు తెలియకుండా చింపేసేవాడు రాము ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉండేది దానివలన గ్రామంలో అప్పు ఎవరికి ఎంత ఇచ్చింది ఎంత వసూలు అయ్యింది అన్న విషయం కూడా తెలియకుండా పోయింది దానితో కోపోద్రిక్తుడైన చలమయ్య ఒకరోజు తన కొడుకును మందలించాడు అంతటితో ఆగకుండా అతన్ని తన్ని ఇంట్లో నుంచి తరిమేశాడు అలా అమాయకుడైన రాము హూ హూ అని ఏడుస్తూ ఇంట్లో నుంచి బయలుదేరాడు అలా వెళ్తున్న రాముని ఊరి చివర లో మొక్కజొన్న చేను వేసుకున్నటువంటి రంగయ్య ఆపి బాబు ఇలా ఏడుస్తూ వెళ్లే కంటే "వూడ్తు ఆడ్తూ" అనుకుంటూ వెళ్ళు దానివల్ల సాయంకాలం పూట పిట్టలు నా చేనుపై వాలి పాడు చేయకుండా ఉంటాయి అని అతని చేతిలో ఒక బెల్లం ముక్క పెట్టాడు దాన్ని తినుకుంటూ వెళ్తున్న రాము చేను చివర వరకు  "వూడ్తు ఆడ్తూ" అనుకుంటూ వెళ్ళాడు దానితో పిట్టలన్నిఎగిరిపోయాయి అయినా అంతటితో ఆగకుండా రాము "వూడ్తు ఆడ్తూ" అనుకుంటూ వెళ్ళసా

హద్దులు లేని ప్రేమ..!

చిత్రం
సుందరి..! నీ వదనం ముగ్ధమందారం సుందరి..! నీ అందం కనుల కమనీయం సుందరి..! నీ సొబగులు గుండెల గుబాలం సుందరి..! మన జత విహారం హద్దులు లేని వినోదం ముద్దు ముచ్చటల మృదు సంగమం జన్మ జన్మలకు రాదు వియోగం నిన్ను విడిచి వెరయుట నిజవక్కం నిన్ను మరచి బ్రతుకుట అసంభవం నన్ను కాదన్న నీవు కాదు సత్యం నిన్ను వలచి తలచి తలచి జీవిస్తా నిత్యం..! రచన : మీ తాజ్  పల్లెటూరి పిల్లోడు

అలిగిన ప్రేయసి... అల్లాడే ప్రేమికుడు

చిత్రం
గగనతలంపై ఎగురు కపోతమా గిరి చివర చేరి నాట్యమాడు విహంగమా విన్నపంగా నా చెలికి వివరించు నా మదితలపు ఆ కన్నులలో ఊరేగే మెరుపు చూసి బ్రమపడకు తన ముందు చేరి భయపడకు, వెన్ను చూపి పారిపొకు తన స్వరం నీవు వింటే చాలు, తన చెలిమి నీకు ఎంతో మేలు మచ్చికగా నీవు మెదులు, అదును చూసి నా బాధను తెలుపు నా నాడి తెలిసిన నాయకురాలిగా, బాధ్యతేరిగిన రాయబారిగా ఒక్కొక్కటి ఏకరువు పెట్టు, అంతకుముందు ఓ సలాం కొట్టు ఒక్కసారి తన గుండెను తట్టు, మా జ్ఞాపకాలు మెదిలేటట్టు కొట్టినా, తిట్టినా, పెట్టినా, మొట్టినా ఆరోజులు మరిచావెట్లని దీనంగా మొహాన్ని పెట్టు, తన కాళ్లపై నీ తలనే పెట్టు చిరునవ్వుకై దోసిలి పట్టు, తానే నా ఆయువు పట్టు మమ్ము ఒక్కటి చేసి పుణ్యం పట్టు, నీ రెక్కల దాచి నా ముందర పెట్టు ............................................🪄 రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో (మధ్యతరగతి మనిషి)

చిత్రం
బ్రహ్మయ్యా.. ఏమయ్యా బ్రహ్మయ్య నీ శిరోభారాన్ని నీవు మోయలేక నా తలకెక్కించి బ్రహ్మ ముడిని చిక్కు ముడిగా చేసి విప్పుకొలేని తప్పుకొలేని బాధ్యతలతో ఉరి వేసి మెలివేసి మెడనంత నులిమేసి చంపుతున్నావా...? నీ శిరోభారాన్ని నా తలపై మోయలేకున్నానయ్యా భారాని దింపెయి.. లేదా భాధల్ని ఆపెయి.. నారాయణ.. ఏ తోడు లేకున్నా నీ నీడలో చేరి మోడులా మారి భాద్యతలు మోస్తున్నా కదయ్యా మోస్తున్న భారాన్ని పెంచుతున్నట్లు బరువు మీద బరువు నా నడుముపై వేస్తే మోయాలేకున్నానయ్యా..! బరువును దించేయి లేదా బ్రతుకును బలిచ్చేయి.. మహేశ్వరా.. నీ గొంతులోని గరళాన్ని నా బ్రతుకులో పారబోసి హాయిగా నవ్వుతున్నావా శివయ్యా గొంతు గరళం నిండి గడియ గగనమై గరళమే గుటకకింత మింగుతున్నట్లు ఉందయ్యా అమృతం అక్కరలేదు కానీ.. గరళాన్ని లాగేసుకో లేదా గళం లో ప్రాణం లాగేసుకో రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

మా నాన్న మాట..

చిత్రం
మిత్రమా.. నీకో విషయం చెప్తాను గుర్తు ఉంచుకో ఇది మా నాన్న నాతో అన్నది నేను నీతో అనేది "సంక జోలె చినిగిపోలే, ముందు ఊళ్లు కాలిపోలే" ఈ ఊరు కాక పోతే ఇంకో ఊరు అది కాక పోతే ఆ పై ఊరు ఎలాగైనా బతకొచ్చు కానీ ఇదే జీవితం ఇదే బతుకు అని జీతానికి నీ జీవితం ఇవ్వద్దు బాధ భయం రెండు వద్దు రెక్కలు దాయనంత కాలం ఎన్ని కుక్కలు మోరిగినా నీ ఆస్తులు కరిగిపోవు రచన : తాజ్ పల్లెటూరీ పిల్లోడు... లవ్ యు నాన్న 😍🙏🏻

శృంగారభావ సుకుమార సుందరి..!

చిత్రం
ప్రియా... ప్రియా... అని పిలవనా నా ప్రాణం నీవని చెప్పనా రవ్వల నీ చీరకట్టు శ్రావ్యమైన నీ చేతి పట్టు శ్రవణానికి నీ మాట తేనెపట్టు సౌమ్యమైన నీ ఆటపట్టు శృంగారానికి నీవే ఆయువు పట్టు శాసిస్తూ భాషిస్తావు, కోపిస్తూ మెప్పిస్తావు అలక పూనిన ఉల్క నీవు జాలి కలిగి నాపై రాళిపోదువీవు నింగిని వీడి నేలకు జారి భంగిమ తొడిగి భామగా మారి... కాకతీయుల కళా పంటవట నళినీ, నాగిని నీ చెలులంట పరువమనే మాటకు పీఠిక నీవు పరులేవ్వరికి దక్కని పాఠ్యాంశం నీవు నీలో ప్రతీ అక్షరం అమూల్యమే  నీలో ప్రతి అంగుళం అమోఘమే గ్రంధములగు నీ అందం ముందు గారాలు పోతూ గ్రహిస్తా విందు..! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

మన ప్రేమకు పిల్లల కానుక..

చిత్రం
మేఘం రంగు ప్రేమ పొంగు ఎప్పుడు మారునో చెప్పలేము మేఘం రంగు మారితే నెమలి చెంగు మంటది ఉరు మెరుపుల నడుమ ప్రకృతిని పరవళ్ళు తొక్కించగ ఒక నీటి ధార నేల జారుతుంది ప్రేమ పొంగేనా ఆమనిలా నా పిల్ల సిగ్గు ముసుగుతో తుళ్లీ ఆడును సప్తవర్ణముల మేళవింపు తో ఓ నవ్వు విసురును అది ముసురు కమ్మిన ఆకాశంపై తెల్లని బట్ట కప్పును వెన్నెలలా నా ఇల్లంతా వెలిగిపోవును పండగలా వీధి అంతా తొనకిసలాడును పసిడి ఆభరణములే ఆ నవ్వుకు వెండి గిన్నెలుగ మారిపోవును తన కాంతి వెరసి విస్తుపోవును నెలరాజుకు ఇక సెలవంటూ పిల్ల పాపాలు కేరింతలు కొట్టి ఈ తుంటరి పిల్లకి తోడుగ చేరి రాత్రులు మరిచి ఆడెరు మన ఒంటరి మనసులు జతచేయ ఆ వెన్నెల పందిరి విడిదంటూ పెళ్లికి పెద్దలు అయ్యేరూ మన పెళ్ళి జరుగగా మురిసేరు నిను నా చేతిలో పెట్టి వెళ్ళేరు.. -------------------------------++++++🪄 రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

పెళ్ళానికి ప్రేమలేఖ

చిత్రం
తొలకరి చినుకుల మాసంలో తొలి వేకువ పొద్దున కోయిలవై కమ్మని స్వరాల మాలికవై మది రాజ్యము లాగు ఎలికవై వేసవి రేపే దూపలలో గొడుగును పరచు తామరవై సన్నగ విచే పవనమువై గొంతున జారు సితలమై శీతాకాల సంధ్యలలో సెదతిర్చేటి తూలికవై వణుకు మాన్పెటి కౌగిలివై సరుకు తగిలించు కుంపటివై కరిగే కాలం, తిరిగే భూమి పగలు, రాతిరి బేధము లేమి నమ్మిన చేయి అందిన నాడు నాది నిదను వాదన మాని ఒంటిగ కాదు జంటగ ఉందాం మనిషిగ మారి మంచిని కోరి అర్ధిస్తున్నా నీ కోసం అందిస్తావా నీ మది సౌధం చివరి ఆశగా వస్తున్నా చిరకాల వాంచ గా చెప్తున్నా నిన్ను ప్రేమిస్తున్నానని..! ---------------------------------🪄 రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

రాయంచ నడకతో, మత్తెక్కించే నవ్వుతో

చిత్రం
ఇది నిజమా...! అందమైన అబద్దమా తెలియదు కానీ నా మనసు మాట విన్నవిస్తున్నా నా మది ఆలోచన నీ ముందు ఆవిష్కరిస్తున్నా అందం అంటే నువ్వు అనురాగం అంటే నీ నవ్వు మమతానురాగానికి మరో పేరు నువ్వు నా కనులు కాంచిన అతిలోక సుందరి అది నువ్వే నీ నవ్వుల గలగలలకు సెలయేరులు సాటియెల నీ నడకల సవ్వడికి రాయంచ పోటియెల నీ గొంతుశోభ సంగితాలు పలుకలేవు కోయిలైన నీ గళం నాజూకు నీ పలుకు నేను చూసి వణుకు నీ చూపు నను వెతుకు నీ అడుగులు నా వైపు సాగు నీ చేయి నా చేయిన నిలుపు మన ప్రయాణం ఒకటేనని చెప్పకనే చెప్పు నువ్వు నా గమ్యం, నీవే నా ప్రాణం నువ్వే నా సర్వం, నీ నవ్వే నాకు సర్వస్వం నీ నవ్వు చూస్తున్నంత కాలం రాదు నాకు వయోబారం రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

ఎవరీ అభాగ్యురాలు

చిత్రం
ఎవరమ్మా నీవు ఏ వంశానికి మూలాధారం నీవు ఏ ఇంటి ఆడపడుచు నీవు అయిన వారి ఇంట పుట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నా ఆరుపదుల వయసులో మొగ్గు బుట్టలా నెరిసిన జుత్తుతో బోసి పోయిన ధీనమైన మోముతో యాచన చేస్తున్న నీవు ఏవరమ్మా ..? ఐదుగురు కొడుకులను కన్నా విధురుని అశ్రమాన తలదాచుకున్న కుంతివా నూటొక్క సంతానం కలిగినా ఆఖరి ఘడియలలో ఏ పుత్రుడు తోడు లేని గాంధారివా ఎవరు నీవు ఏ ఇంటిలో కొడిగట్టిన దీపం నీవు చేయి ఆకాశాన్ని అర్థిస్తున్నా అరికాళ్ళ కింద భానుడు కరుపెక్కిస్తున్నా ఆకలి భాధ మెదడు నాడులను నులిమెస్తున్నా ఎందుకమ్మా తొమ్మిది దారుల దేహంపై మక్కువ సురా ముపై మూడు కోట్ల దేవతలున్న దేశంలో ఏ దేవుడు నిలపడడేమమ్మా నీ పక్కన క్షేమాపణలు కోరుతున్నా తల్లి ఈ దేశం తరుపున ..............….........................+++🪄 రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

నా సొంతమై నిలువు నా కంటి ముందే

చిత్రం
దొంతిలా మారి ఒక్కో మాసం నీ జ్ఞాపకాలు నాతో శకం ఆడిన ఆటలు చెప్పిన మాటలు చేసిన బాసలు చూసిన గాదలు అంతు తెలియని ఆనందాలు కొంతెనా అను నిమిషాలు అందంగా అల్లిన చేతులు ఇష్టంగా మన మల్లిన జతులు రాతలు గితాసుపు కవితలు నేతుల మూటై కడవల ఊటై తేనెలు జారే నీ నోటిన పాటై స్వరాల వనాల హరపు తొటై నీ పాదము చేరెను సాగే బాటై నా కవితలా బతుకు మారాలని నీ కంటిలో నవ్వు చూడాలని నీ ఇంటిలో సిరులు నడవాలని ఆయురారోగ్యాలు అందాలని ఒక్కొక్క రోజు మక్కువగ మారి పాలపుంత కాంతి నీ కనులలో దూరి తారలింట వెలుగు జాబిల్లి మల్లే నా సొంతమయి నిలువు నా కంటి ముందే..! రచన : తాజ్ పల్లెటూరీ పిల్లోడు

బడి బడుగు పేదల గుడి...!

చిత్రం
అంశం : మూతపడుతున్న సర్కారీ స్కూళ్ళు తల్లిదండ్రులుగా మీ బిడ్డలకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్న మీ ఆలోచనలకు అభివాదం కానీ.......... అది పెట్టుబడిగా మారిపోయింది నర్సరీ చదువుకి లక్షా..అది తిరిగి సంపాదించడమే లక్ష్యమా....? తృప్తి లేని జీవితం, సంతృప్తి ఇవ్వని జీతం  వెరసి పోరుగు దేశాలకు పారిపోతున్నారు కోట్లు సంపాదించినా తీరని కోర్కెలతో మీకు కొరివి పెట్టే భాధ్యత కూడా విస్మరిస్తున్నారు విద్య వినయేన శోభతే: అని కాక  విద్య ధనార్జన విత్తం అయిపోయింది మీ డాబు కోసం చదివించి వాళ్ళతో డబ్బు కోసం పరుగులు పెట్టించకండి శీర్షిక : బడి బడుగు పేదల గుడి బలహీనులకు బంధం తానై,  భవిష్యత్ తరాలకు బాటలు వేసి అక్షరమనే భీజం వేసి,  సామాన్యుడికి జ్ఞానం పోసి లాంతరు వేసుకు నడిచొచ్చింది,  బడితో బంధం పెనవేసింది ప్రాంతీయాభివృద్ధి ధ్యేయం అంది,  ప్రతి పేదొడు ఇక చదవాలంది ఆశయాలతో అడుగులేసినది, అసమానంగా ఆదరించినది అమూల్యమైన ఆస్తి పంచినది, అంతలోనే వంతు మార్చినది తంతుగ భారతి చింతలు తీర్చే,  తాడో పేడో నిగ్గును తేల్చే, భావి నాయకుల అంకుర దీపం కాటి అంచున చేరెను శల్యం అభివృద్ధికి అది కొరగాకుంది,  నిశీధి అలిమి నినదించింది నిరాశ కమ్మి విలపించింది, 

చరవాణి లో నా దేవేరి(స్క్రీన్ వాల్ పేపర్)

చిత్రం
పూసిన మల్లియ పరిమళించేనని కొలనున తామర రెల్లు విప్పెనని నెలవంక ముక్కలై నోట ఉరెనని నా చేతి యంత్రమును తొంగి చూస్తువా నవ్వి నవ్వుతో నాకు లెంక వెస్తువా తొలకరి చినుకులు అల్లరి ఆటలా తూనిగమ్మ రెక్కల సడిలా చెవిలో మ్రోగేను నీ నవ్వు  రెట్టింపాయేను మన లవ్వు ప్రశాంతము నవ వసంతము సమస్తము నీ సాంగత్యము సుమాల వారాల హారములన్ని పావనమౌ నీ పాదము తన్ని తరించినవి నీ పేరు జపిస్తూనే తనువు చాలిస్తూ మాట ఇచ్చినవి వెన్నెల పూలై పూస్తాయట నీ కొప్పున గర్వంగా నిలుస్తాయట వయారమ్మ నీ వయారి హాస్యం సుగంధాలు విరజిమ్మే సువాసన పుష్పం సాగర మధనం చిలికిన కవ్వం దరిపై గిరిలా కిర్తుల పర్వం తప్పక చెప్పని గొప్పని తత్వం తప్పుగ చూడక ఒప్పని పరువం ఇప్పుడు తప్పదు తప్పుడు కార్యం నీ కౌగిలి కానక కించేను ఘోరం..! రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

రైతు బతుకు కడు దుర్లభము...

చిత్రం
నిత్య కృషివలుడు సత్య భాషా పరుడు అతనొక యోధుడు  ఆకలి పోరులో చస్తూ బతికే వీరుడు గొరుకొయ్య పొడవగానే కోడి గూట కూయగానే జోదెడ్డుల సావాసం బురద మదిలో తన ఎవుసం  అన్నదాత, నిత్యాన్న ప్రదాత ఆకలిని అంతం చేయాలనే ఆర్దత తాను అన్యాయమవుతున్నా  అఖండ భారతావనిని  అన్నపూర్ణగా నిలిపిన దైవాత్ముడా జోతలివే నీకు మా అప్తుడా తరాలు మారినా..? "రైతే రాజు" మరి రైతు'త'రాజు ఎక్కడ దలారుల చేతిలోనే తక్కెడ గిట్టు బాటు దక్కని తిప్పలు మిల్లర్ల దోపిడీకి మిగిలేవి అప్పులు అంతమై పోతున్న కులవృత్తులు ఆ దారిలోనే మా రైతులు, రాతలు నాడు నేడు ఎప్పుడు లేదు వైబొగం పారె యేరు కనుల నింపి ఎవరిని నిందించని మంచితనం అందుకే అతనొక యోధుడు ఆకలి పోరులో చచ్చి బ్రతికే వీరుడు -------------------------------+++++++🪄 రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

మహిళలు మీకు మా క్షేమాపనలు

చిత్రం
కన్యాశుల్కపు కటకటాలను బాల్యవివాహపు బంధిభూతాలను సతీ సహగమన సంకెళ్లను విదిలించుకుని నిలిచిన వారి ఆలోచనలను గెంటేస్తూ వారి కోరికలను చిదిమేస్తూ కట్టుబాట్ల కంచెలేసి, మూఢత్వం మనసు తొలిచి ఆడది ఆడదే అని ఇంకా అదిమి పెడుతున్నాం ఆశలన్నీ చిదిమేసి గడప చాటు తోసేసాం ఏ ప్రాంతమూ గుర్తించని ప్రతిభలకు మహిళా సాధికారత పేరిట ప్రపంచదినం ఎందుకీ మహిళలకు..? అధికారుల ఆగడాలు, పురుషగణ పోకడలు పాలనా ఘన మూర్ఖులు, పనికిరాని చేష్టలు దారి నిలువు ధూర్తులు, దారికాసి చేరుపులు అడుగడుగునా ఆర్తులు, ప్రాణపీడ నేత్రులు వేకిలి, నకిలి చట్టాలు, విటులు అయిన యువకులు శాస్త్రాలు, గ్రంధాలు, చట్టాలు వాళ్ళకి చట్టాలు అదుపు లేదు ఆజ్ఞ లేదు పాపమనే ఊసులేదు వివస్త్రగా మారి వనిత, అవహేళన పూని భవిత అనాధిగా ఆచారం, ఆడ బ్రతుకు గ్రహచారం అడవిలోని పూలమల్లే, అనాకారి బ్రతుకు సూడే మారి ఈ పరిస్థితిలో ఎందుకీ మహిళా దినం మార్పుకు కావాలా మరో యుగం... ......................................++++.🪄 రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు

సదా నీ సేవలో (కిక్ ఇచ్చే కాఫీ)🍵

చిత్రం
నల్లని ఆ కైనీడ తొలగిందో ఎమో నీ మోముపై పరదా జరిగిందో ఎమో నీ నవ్వు పూసుకుని ఈ లోకం వెలిగిందో ఎమో పంచ భూతాల సమ్మెలిత దేవతవే నీవో నీ నవ్వు లేని నాడు ఈ జగతి ఎమవునో ఎమో అందకారమగు చీకట్లలో మగ్గుతుందో ఎమో సూర్య చంద్రులే నీ దేహంపై విలసిల్లిరేమో నీ ఇరుకన్నులై వారిరువురు బాసిల్లినారేమో గోదారి అలల లాగ కలలు విరియు చందంగా నీ నడకకు లోకమంతా దోసిలిడినారేమో నీ పాదం తాకి జన్మ ధన్యత అని సంద్రాన పాశనులై పడున్నారో ఎమో దయించవా తన్ని తరింప జేయవా ఈ పుణ్యకార్యం చేసినంతనే మాజన్మ ధన్య ప్రధానమే నీకు బానిసా గణమై కాఫీ ఇత్యాది ఫలహారాలు అందించి అది నీవు గ్రొలుతుండ అధరములపై అద్దిన పాల మీగడ మత్తుగోలపగ నీ ఇంటి ముందు నీ కంటి ఆజ్ఞకై వేచు భక్తులమై నీ సేవ చేయుచుందుము... .................................................................... రచన : తాజ్ పల్లెటూరి పిల్లోడు